మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే గెలుపు : పొన్నం | congress party win in muncipalty elections: ponnam | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే గెలుపు : పొన్నం

Published Sat, Mar 29 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

congress party win in muncipalty elections: ponnam

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: కరీంనగర్ లోక్‌సభ స్థానం పరిధి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఎంపీ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం నగరంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించానని, ప్రజల నుంచి మంచి స్పందన కనిపించిందని చెప్పా రు.

 

మేయర్, చైర్మన్ పదవులను పార్టీ దక్కించుకుంటుందన్నారు.  తనతోపాటు పార్టీకి.. సుద్దాల దేవయ్య కాంగ్రెస్‌లో చేరిన సమాచారం ఉందన్నారు. ఆయన కూడా చొప్పదండి టికెట్ ఆశిస్తున్నారని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. హుస్నాబాద్‌లో సీపీఐతో పొత్తు కార్యకర్తలకు ఇష్టం లేదన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పాటిస్తామని స్పష్టంచేశారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎస్.ఎ.మోసిన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొన్నం సత్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement