ఏలూరు, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సజావుగా ముగియడంతో అధికార యంత్రాంగం ‘పరిషత్’ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. మునిసిపల్ ఎన్నికల్లో సగటు పోలింగ్ 76.48 శాతం నమోదు కావడంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూలైలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 87 శాతం పోలింగ్ నమోదు కాగా, ‘పరిషత్’ ఎన్నికల్లో అంతకుమించి పోలింగ్ జరిగేలా కృషి చేయూలనే ఆలోచనతో ఉన్నారు.
ఈ నెల 6న ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లు, 11న నరసాపురం, కొవ్వూరు డివిజన్లలో జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహించన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేం ద్రాల్లో వెబ్ కెమెరాల ఏర్పాటుకు యంత్రాంగం సమాయత్తం అవుతోంది. వీటిని సమకూర్చుకునేందుకు టెండర్లు పిలిచారు. తొలి విడతగా ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో నిర్వహించే పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు.
ప్రచారం ముమ్మరం
ఇదిలావుండగా, మునిసిపల్ ఎన్నికలు ముగియడంతో రాజకీయ పార్టీలు పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారుు. గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణాల్లో ప్రచారం చేసిన నాయకులు పల్లెల వైపు సాగుతున్నారు. దీంతో గ్రామీణ రాజకీయం కూడా వేడెక్కింది.
పట్టణ నేతలు ప్రచారానికి రావడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం పెరిగింది. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ల పరిధిలోని 22 మండలాల్లో ఈనెల 4న సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
‘పరిషత్’ పోరుపై దృష్టి
Published Mon, Mar 31 2014 11:40 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement