సాక్షి ప్రతినిధి, కడప: పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. అయితే ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బంది మాత్రం మదనపడుతున్నారు. చేసిన పనికి తగిన రీతిలో రెమ్యూనరేషన్ (ప్రతిఫలం) దక్కలేదని ఆవేదన చెందుతున్నారు. ఇతర జిల్లాల్లో ఇచ్చినట్లుగా వైఎస్సార్ జిల్లాలోని మైక్రో అబ్జర్వర్లకు పంపిణీ చేయలేదని వాపోతున్నారు. ఎన్నికల ప్రక్రియలో విధులు ఒక్కటే అయినా ఒక్కొక్క జిల్లాలో ఒక్కో విధంగా రెమ్యూనరేషన్ అందించడం తగదంటున్నారు.
జిల్లాలో 800మంది మైక్రో అబ్జర్వర్లును ఎన్నికల విధులకు ఉపయోగించుకున్నారు. వారిలో 775 మందికి విధులు అప్పగించగా, 25మందిని రిజర్వులో ఉంచారు. వారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. జిల్లాలో పాల్గొన్న మైక్రోఅబ్జర్వర్లుకు ప్రతిఫలంగా రూ.1000 ఇచ్చారు. అయితో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో అత్యధికంగా రూ.2300 పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో రూ.1350, కర్నూలు జిల్లాలో రూ.1800 చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. ఈతేడాలకు కారణాలు ఏమిటి.. ఎందుకు ఒక్కొక్క చోట ఒక్కో విధంగా రెమ్యూనరేషన్ అందించారు.. అన్న ప్రశ్నలు జిల్లాలో పనిచేసిన మైక్రో అబ్జర్వర్ల మదిలో తొలుస్తున్నాయి. మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల కమిషన్ నుంచి రూ.2300 పంపిణీ చేయాలని ఉత్తర్వులు ఉన్నాయా.. ఆమేరకే నెల్లూరు జిల్లాలో పంపిణీ చేశారా అని జిల్లాకు చెందిన అబ్జర్వర్లు చర్చించుకుంటున్నారు.
ఆడిట్ లేకపోవడమే.....
ఎన్నికలకు సంబంధించి జమా ఖర్చుల ఆడిట్ ఉండదు. అధికార యంత్రాంగం ఇందుకు అనుగుణంగానే రెమ్యూనరేషన్ పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఇలాంటి విషయాల పట్ల ఉద్యోగుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. చేసిన పనికి తగ్గట్లుగా ప్రతిఫలం దక్కలేదని పలువురు వాపోతున్నారు. ఈవిషయమై డీఆర్వో సులోచన వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. ఫోన్‌లో రెండుమార్లు ప్రయత్నించగా వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నట్లు చెప్పారు.
ఇదేనా గౌరవం
Published Sat, May 10 2014 2:04 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement