ఎమ్మెల్యే ‘కోడ్’ ఉల్లంఘన | muncipal elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ‘కోడ్’ ఉల్లంఘన

Published Mon, Mar 31 2014 2:07 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

muncipal elections

పోలింగ్ కేంద్రాల్లో కలియదిరిగినా  ఆక్షేపించని అధికారులు


 హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ అన్ని వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో కలియదిరుగుతూ ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేకపోయినా, ఎవరితోనూ మాట్లాడరాదన్న నిబంధనలున్నా, అక్కడి అధికారులను పలకరించారు.
 
 
  పోలింగ్ కేంద్రంలోకి ఎవర్నీ అనుమతించేది లేదని పోలీసులు, అధికారులు చెబుతూనే.. ఎమ్మెల్యేతో పాటు కొందరు టీడీపీ నాయకులు కేంద్రం లోపలికి వెళ్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరించారు. మీడియా ప్రతినిధులకు కలెక్టర్ జారీ చేసిన కార్డులు ఉన్నా వారిని సైతం అనుమతించక పోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement