ఏప్రిల్ 9న ఎంపీగా నామినేషన్
11 తర్వాత పునరంకిత సభ
ఎంపీ పొన్నం ప్రభాకర్
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 35 డివిజన్లలో కాంగ్రెస్‌కు విజయం దక్కడం ఖాయమని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టనున్నారన్నారు. డీసీసీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా నాయకులు సమష్టిగా జెడ్పీ చైర్మన్, మేయర్, చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థిగా సెగ్మెంట్ పరిధిలోని ఏడుగురు నియోజకవర్గ అభ్యర్థులతో కలిసి ఏప్రిల్ 9న తాను నామినేషన్ వేస్తానన్నారు. 11వ తేదీ తర్వాతనే సోనియాగాంధీతో పునరంకిత సభను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ ఒకటి నుంచి రోజుకు మూడు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా వస్తున్న ఉగాది పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో ప్రజలకు విజయం కలగాలని, జిల్లా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. సమావేశంలో పీసీసీ కార్యద ర్శులు డి.శంకర్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, అర్బన్‌బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎస్‌ఏ.మోసిన్, డీసీసీ అధికార ప్రతినిధి కటకం వెంకటరమణ పాల్గొన్నారు.