ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం, డబ్బులు పంపిణీ చేయకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో అనుమానితులను బైండోవర్ చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద గట్టి బందోబస్తు కల్పించారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో అక్కడ పోలీసులు అధిక దృష్టి సారించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచనల మేరకు ఆదివారం జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం ఏడుగురు డీఎస్పీలు, 36 మంది సీఐలు, 123 మంది ఎస్‌ఐలు, 319 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, 1,812 మంది కానిస్టేబుల్స్, 442మంది హోంగార్డులు, 43 మంది మహిళా కానిస్టేబుల్స్, 99 మంది మహిళా హోంగార్డులు, 280 మంది స్పెషల్‌పార్టీ పోలీసులను బందోబస్తు కోసం నియమించారు.
బందో‘మస్తు’
Published Sun, Mar 30 2014 1:59 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement