కావలి, న్యూస్‌లైన్ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తీరుతాయని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ కావలి జెడ్పీటీసీ అభ్యర్థి సోమయ్యగారి పెంచలమ్మ, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి మండలంలోని రుద్రకోట, పెదపట్టపుపాళెం, తుమ్మలపెంట, అన్నగారిపాళెం పంచాయతీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఓట్లు, సీట్లు గురించి తప్ప ప్రజా సమస్యలను కాంగ్రెస్, టీడీపీలు పట్టించుకోవడం లేదన్నారు.
రైతు సమస్యలపై ఆ పార్టీలు మాట్లాడటం లేదన్నారు. నియోజకవర్గంలో పంటలు ఎండుతున్నా ఆ పార్టీల నేతల నుంచి కనీస స్పందన రాకపోవడం దారుణమన్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల్లోని సమస్యలు తీరుతాయన్నారు. ఈ సందర్భంగా రుద్రకోట వడ్డిపాళేనికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
పార్టీలోకి చేరిన వారిలో దేవళ్ల రమణయ్య, గండికోట శీనయ్య, వల్లపు రాధయ్య, తమ్మిశెట్టి శీనయ్య, ఉప్పు పుల్లయ్య, గండికోట మాలకొండయ్య ఉన్నారు. ప్రచార కార్యక్రమంలో రుద్రకోట ఎంపీటీసీ అభ్యర్థి బొమ్మిరెడ్డి కీర్తి, పెదపట్టపుపాళెం ఎంపీటీసీ అభ్యర్థి గంగనగారి యాదగిరి, తుమ్మలపెంట బిట్ -1, 2 ఎంపీటీసీల అభ్యర్థులు అరగల మేరీ, కొమారి ప్రసన్న, అన్నగారిపాళెం బిట్-1, బిట్-2 ఎంపీటీసీ అభ్యర్థులు బయ్యా ప్రసన్న, పొన్నాల శూలం, రూరల్ మండల నేతలు గోసల గోపాల్‌రెడ్డి, పాలడుగు వెంకట్రావు, దేవళ్ల బసవయ్య, పులి వెంకటేశ్వర్లు, బక్తాని నరసింహా, నాగమణి, వెంకారెడ్డి, కోటయ్య, లక్ష్మయ్య, దుర్గారావు, తిరుపతి, తిరుపాలు, శ్రీనివాసులురెడ్డి, పద్మనాభరెడ్డి, యానాదయ్య, రవిరెడ్డి, బ్రహ్మయ్య, వెంకట రమణయ్య పాల్గొన్నారు.
జగన్‌తోనే రైతుల సమస్యలకు పరిష్కారం
Published Mon, Mar 31 2014 3:29 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement