ఒంగోలు, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఇప్పటి వరకు ప్రచారం ముమ్మరంగా సాగించిన నాయకులు ప్రస్తుతం డబ్బు, మద్యం పంపిణీకి దృష్టి సారించాయి. ఒక వైపు పోలీసులు డేగ కళ్లు వేసినా, ఎన్నికల నిఘా విభాగం నిరంతరం పర్యవేక్షిస్తున్నా పంపిణీ వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోంది. చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలతోపాటు అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చీరాల, గిద్దలూరు, చీమకుర్తి ప్రాంతాల్లో పట్టు కోసం టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత సర్పంచ్ ఎన్నికల సమయంలో కుమ్మక్కైనట్లుగానే ప్రస్తుతం రాజకీయాలు జోరందుకున్నాయి.
చీరాలలో స్వతంత్ర అభ్యర్థుల డబ్బు పంపిణీ విపరీతంగా పెరిగిపోయింది. వారంతా ఒక ప్రముఖ నాయకుని కనుసన్నల్లో పోటీ చేస్తున్నారని తెలిసినా స్వతంత్ర అభ్యర్థులపై పోలీసుశాఖ కూడా పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల రోజున 200 మీటర్ల పరిధిలో ఎక్కడా రాజకీయ పార్టీల నాయకుల టెంట్లు వేసేందుకు వీల్లేదు. అదే విధంగా వంద మీటర్ల పరిధిలో ఎక్కడా రాజకీయ పార్టీల రాతలు, కరపత్రాలు, ఇతరత్రా ప్రచారం కనిపించడానికి వీల్లేదు. దీనిపై కూడా తక్షణమే దృష్టి సారించాలని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.
చీరాల మున్సిపాలిటీ..
మొత్తం 275 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 160 మంది బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్ సీపీ 32, టీడీపీ 32, కాంగ్రెస్ 8, సీపీఎం 1, బీఎస్పీ 3, ఎస్పీ 3, లోక్‌సత్తా 5.
మార్కాపురం మున్సిపాలిటీ..
మొత్తం 252 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ అనంతరం 92 మంది బరిలో ఉన్నారు. వారిలో వైఎస్సార్ సీపీ 28, టీడీపీ 25, సీపీఐ 3, సీపీఎం 1, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా 2, స్వతంత్రులు 33. వీరు కాకుండా వైఎస్సార్ సీపీ 1, టీడీపీ 2 నామినేషన్లు ఏకగ్రీవం అయ్యాయి.
అద్దంకి నగర పంచాయతీ..
మొత్తం 150 మంది నామినేషన్లు వేయగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 68 మంది బరిలో దిగారు. వారిలో వైఎస్సార్ సీపీ 19, టీడీపీ 20, కాంగ్రెస్ 5, సీపీఎం 3, లోక్‌సత్తా 2, స్వతంత్రులు 19.
కనిగిరి నగర పంచాయతీ...
మొత్తం 236 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 105 మంది బరిలో ఉన్నారు.
ముగిసిన మున్సిపల్ ప్రచారం
Published Sat, Mar 29 2014 4:14 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement