పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక నేపథ్యంలో పార్టీ పదవులపై కాంగ్రెస్‌లో చర్చ
ప్రచార కమిటీతో పాటు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే చాన్స్
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు కొత్త కార్యవర్గంలో చోటు
అధికార ప్రతినిధుల్లోనూ మార్పులు
ఈనెల 15న బాధ్యతలు తీసుకోనున్న మహేశ్‌కుమార్‌గౌడ్
రేపు ఢిల్లీలో పార్టీ పెద్దలను కలసి కృతజ్ఞతలు తెలపనున్న టీపీసీసీ అధ్యక్షుడు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర పారీ్టకి కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి కావడంతో పార్టీ పదవులు, టీపీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. అయితే, కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగినా కార్యవర్గం ఏర్పాటుకు కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ అనంతరం రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి, వారి సల హా మేరకు కమిటీలను కూర్చి, ఆ కమిటీలపై హైకమాండ్ ఆమోద ముద్ర వేయించుకునేందుకు కొంత సమయం పడుతుందని తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షునిగా ఈనెల 15వ తేదీన మహేశ్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకంటే ముందు బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నా యి. మహేశ్‌గౌడ్ ఈనెల 11న ఢిల్లీ వెళ్తారని, అధ్యక్ష పదవి అప్పగించినందుకు గాను పార్టీ పెద్దలను కలసి కృతజ్ఞతలు తెలిపేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారని గాంధీభవన్‌వర్గాలు చెబుతున్నాయి.
ప్రచార కమిటీని నియమిస్తారా?
టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన నేపథ్యంలో గతంలో ఉన్న మిగిలిన కమిటీలను కొత్తగా ని యమిస్తారా లేక వాటినే కొనసాగిస్తారా అనే చర్చ ప్రారంభమైంది. టీపీసీసీకి అనుబంధంగా ఏడెని మిది కమిటీలు పనిచేస్తుంటాయి. వీటిలో టీపీసీసీ ప్రచార కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమి టీ లాంటి వాటిని కొత్తగా ప్రకటిస్తారని గాం«దీభవ న్ వర్గాలంటున్నాయి. టీపీసీసీకి ప్రచార కమిటీని నియమిస్తే దానికి చైర్మన్‌గా ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డికి పదోన్నతి కలి్పంచి ఆ పదవిలో నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.
ఇక, జగ్గారెడ్డితో పాటు అంజన్‌కుమార్, అజారుద్దీన్, గీతారెడ్డిలు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేస్తున్నారు. సామాజిక సమీకరణల మేరకు గతంలో నియమించిన ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ల స్థానంలో కొత్త వారు వస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి కూడా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారని, వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
వీరితో పాటు సీనియర్ ఉపాధ్యక్షులుగా పార్టీ సీనియర్ నేతలను నియమిస్తారని, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఎంత మంది ఉండాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా, అధికార ప్రతినిధుల జాబితాలో మాత్రం మార్పులు చేస్తారని సమాచారం. అన్ని పదవుల విషయంలోనూ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే నెలలో టీపీసీసీ కార్యవర్గ కూర్పు కసరత్తు జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment