సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం జూన్ 26, 2021న రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. జూలై 7న ఆయన గాంధీ భవన్‌లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు. ఒకవైపు అధికార బీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్‡్షతో.. మరోవైపు ప్రత్యామ్నాయ స్థానం కోసం బీజేపీ సవాలు విసురుతున్న పరిస్థితుల్లో రేవంత్ పార్టీ పగ్గాలు స్వీకరించారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఇచి్చన పార్టీగా కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు.
తొలి పరీక్ష.. హుజురాబాద్
బాధ్యతలు స్వీకరించిన వెంటనే హుజురాబాద్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి తొలి సవాల్‌గా నిలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 3,014 (1.5 శా తం) ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచింది. అంతలోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. అదే సమయంలో రాహుల్ గాంధీ భార త్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో అటు మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్రను సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. ఈ ఎన్నికల్లోనూ పారీ్టకి పరాజయ మే మిగిలింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో రేవంత్ 2023, ఫిబ్రవరి 6 నుంచి మార్చి 20 వరకు 33 రోజులపాటు చేపట్టిన పాద యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని తెచ్చింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాలు సఫలీకృతమై 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టగలిగింది.
రేవంత్ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. 8 పార్లమెంటు స్థానా ల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా రేవంత్ పార్టీని నడిపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా దాదాపు 9 నెలలపాటు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆదివారం టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించడంతో రేవంత్ రెడ్డి 38 నెలల పీసీసీ అధ్యక్ష ప్రస్థానానికి ముగింపు పలికినట్టు అయింది.
Comments
Please login to add a commentAdd a comment