సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం రసకందాయంలో పడింది. అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అధ్యక్ష పదవికి రేసులో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోని సీనియర్లతో జట్టు కట్టారు. నలుగురు ఎమ్మెల్యేలతో వెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ను కలసి తమ వాదనను వినిపించారు. అభిప్రాయ సేకరణ ప్రక్రియలో చివరిరోజు శనివారం ఆసక్తికర పరిణామా లు చోటు చేసుకున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్యలు అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను నియమిస్తారనే ఊహాగానాల నేపథ్యంలోనే వీరంతా సమావేశమయ్యారని చర్చ మొదలైంది. ఎంపీ, ఎమ్మె ల్యేలు కలిసికట్టుగా గాంధీభవన్‌కు చేరుకుని... పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తమ అభిప్రాయాన్ని ఠాగూర్‌కు తెలియజేశారు. వీరు వచ్చిన ఐదు నిమిషాలకే రేవంత్ కూడా గాంధీభవన్‌కు వచ్చి ఠాగూర్ వద్దకు వెళ్లారు. రేవంత్ రావడంతో ముం దుగా వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ కోమటిరెడ్డి కొద్దిసేపటికే బయటకు వచ్చారు.
ఇన్‌చార్జికి అన్నీ వివరించాం: జగ్గారెడ్డి
మాణిక్యంను కలిసిన అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎంపీ కోమటిరెడ్డితో కలిసి తమ మనసులో ఏముందో ఇంచార్జికి చెప్పామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ మామూలే అంటూనే... ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చీలిపోకుండా ఉండేందుకే ఠాగూర్‌ను కలిశామని చెప్పడం గమనార్హం. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీలో ఏం జరుగుతోందన్నది గమనించాలని ఇంచార్జికి సూచించినట్టు వెల్లడించారు. పీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారంలో మెజారిటీ అభిప్రాయం అని కాకుండా... ఏకాభిప్రాయం సాధించాలని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటా రని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీకి ఠాగూర్
టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఢిల్లీకి చేరింది. మాణిక్యం ఠాగూర్ తన పర్య టనను ముగించుకుని శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిపోయారు. ఈనెల 9 నుంచి 12 వరకు ఆయన దాదాపు 160 మంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కలిసి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందన్న దానిపై వేర్వేరుగా అభిప్రా యాలను తెలుసుకున్నారు. వీటిని క్రోడీకరించి ఏఐసీసీ అధ్యక్షురాలు సోని యాకు నివేదిక ఇవ్వనున్నారు. దీనిపై సోనియా తుది నిర్ణయం తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment