సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఇటీవల ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి నవంబర్ 6 వరకు ఈ యాత్ర జరగాల్సి ఉంది. కానీ, తాజామార్పుల ప్రకారం యాత్ర రాష్ట్రంలో నవంబర్ 7న ముగియనుంది.
తాజా షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23న ఉద యం 11 గంటలకు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గూడబెల్లూరులో రాహుల్‌గాంధీ తెలంగాణలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మక్తల్ వరకు ఆ రోజు యాత్ర సాగిస్తారు. ఆ తర్వాత దీపావళి సందర్భంగా 3 రోజులు యాత్రకు విరామం ఇచ్చి, 27న మక్తల్ నుంచి తిరిగి ప్రారంభిస్తారు. ఆరోజు నుంచి నవంబర్ 3 వరకు యాత్ర జరగనుండగా, 4న విరామం తీసుకోనున్నారు.
మళ్లీ 5న మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం చొట్కూరు వద్ద యాత్రను ప్రారంభించి 7వ తేదీ సాయంత్రం ఏడుగంటలకు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని షాపూర్ మీర్జాపూర్ హనుమాన్ గుడి వద్దకు చేరుకోవడంతో యాత్ర రాష్ట్రంలో ముగియనుంది. అక్కడి నుంచి ఆయన మహారాష్ట్రకు వెళతారు.
ఫారెస్ట్‌లో.. పది కిలోమీటర్లు
తాజా షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ పది కిలోమీటర్ల మేర రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో యాత్ర చేయనున్నారు. నవంబర్ 7న ఉదయం జగన్నాథపల్లెలోని జుక్కల్‌చౌరస్తా వద్ద యాత్రను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, రిజర్వ్ ఫారెస్టు గుండా ప్రయాణించి షాపూర్‌గేట్ వద్దకు చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో 11 చోట్ల జరిగే (కార్నర్ మీటింగ్‌లు) సమావేశాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment