సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశంపై సందిగ్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్టాన దూత, కేరళ ఎంపీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. అయితే సమావేశానికి సంబంధించిన తేదీని టీపీసీసీ ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెల 17 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కాను న్నాయి.
అందుకు ఒకరోజు ముందు బుధవారం కనుమ రోజు సీఎల్పీ సమావేశం నిర్వహిస్తారా.. లేదా 17న శాసనసభ ప్రారంభమయ్యే రోజు నిర్వహిస్తారా.. అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎల్పీ నేత పదవి రేసులో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సీఎల్పీ నేతగా ఎవరిని నియమిస్తారన్న దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment