ఆంధ్రప్రదేశ్ లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి అభ్యర్ధుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని కమిషన్ పేర్కొంది. నామినేషన్ల గడువు 17న ముగుస్తుంది. మార్చి 27న పోలింగ్ తోపాటు అదేరోజున ఓట్ల లెక్కింపు ఉంటుందని కమిషన్ తెలిపింది. కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సందిగ్ధత నెలకొందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.