
భూత్పూర్(దేవరకద్ర): పెన్షన్లు మంజూరు చేయాలని ప్రతీ సోమవారం అధికారులకు దరఖాస్తు చేసుకున్నా పలువురికి మంజూరు కావడం లేదు.. ఇక వస్తున్న పింఛన్లు ఆగడంతో పలువురు ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు అమిస్తాపూర్ గ్రామానికి చెందిన ఈరమ్మ సోమవారం భూత్పూర్‌లో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. తనకు అభయ హస్తం పింఛన్ ఆగిపోయి మూడు నెలలైందని.. చనిపోయినట్లు చెబుతూ పేరు తొలగించాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. దీంతో ఎంపీడీఓ గోపాల్‌నాయక్.. మహిళా సమాఖ్య సీసీపై మండిపడ్డారు. ఈరమ్మ పింఛన్ తొలగించడానికి కారణాలను తెలియజేయాలని ఆదేశించారు.