deadline increased
-
అధిక పెన్షన్ కోసం సంస్థలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల తరఫున, వేతన వివరాలను అప్లోడ్ చేసేందుకు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ గడువు సెపె్టంబర్ 30తో ముగియనుండగా, సంస్థల యాజమాన్యాలు, యాజమాన్య సంఘాలు చేసిన వినతి మేరకు ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సెపె్టంబర్ 29 నాటికి 5.52 లక్షల పెన్షన్ దరఖాస్తులు యాజమాన్యాల వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది. అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్‌వో దరఖాస్తులు ఆహా్వనించగా.. జూలై 11 నాటికి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్ కోసం వచి్చనట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి వేతన వివరాలను సంస్థలు అప్లోడ్ చేసి, తమవైపు ఆమోదం తెలియజేస్తే అప్పుడు వాటిని ఈపీఎఫ్‌వో ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది. -
ఐడీబీఐ బ్యాంక్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా బిడ్స్ దాఖలు గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది. కొనుగోలుదారులు 2023 జనవరి 7వరకూ ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేసేందుకు అనుమతిస్తున్నట్లు నోటీసు ద్వారా దీపమ్ పేర్కొంది. బ్యాంకులో 60.72 శాతం వాటాను ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వం సంయ్తుంగా విక్రయించనున్నాయి. కొనుగోలుదారులు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) లేదా ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేసేందుకు తొలుత 2022 డిసెంబర్ 16వరకూ గడువును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ నిర్వహిస్తున్న సలహాదారు సంస్థలకు గడువును పెంచవలసిందిగా అభ్యర్థనలు రావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. కాగా.. ఈవోఐ ఫిజికల్ కాపీల దాఖలుకు గడువును సైతం 2022 డిసెంబర్ 23 నుంచి 2023 జనవరి 14వరకూ పొడిగిస్తున్నట్లు నోటీసులో దీపమ్ వెల్లడించింది. వాటాల వివరాలిలా.. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ(49.24 శాతం), ప్రభుత్వం(45.48 శాతం) సంయుక్తంగా 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆఫర్లో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. దీంతో బ్యాంకును దక్కించుకున్న బిడ్డర్.. పబ్లిక్ నుంచి మరో 5.28 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను చేపట్టవలసి ఉంటుంది. కొనుగోలుదారు సంస్థ కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. గత ఐదేళ్లలో మూడేళ్లపాటు నికర లాభాలు ఆర్జించి ఉండాలి. ఒక కన్సార్షియంలో భాగంగా నాలుగు సంస్థలను మాత్రమే అనుమతిస్తారు. బ్యాంకును సొంతం చేసుకున్నాక కనీసం 40 శాతం ఈక్విటీ పెట్టుబడులను ఐదేళ్లపాటు తప్పనిసరిగా లాకిన్ చేయవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1.4% నీరసించి రూ. 57.3 వద్ద ముగిసింది. -
10ఎఫ్ దాఖలుకు మార్చి వరకు గడువు
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ (భారత్‌లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్ పత్రాన్ని మాన్యువల్‌గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. తక్కువ టీడీఎస్ అమలు చేసేందుకు వీలుగా నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఫామ్ 10ఎఫ్ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్ నంబర్లు లేని వారు ఫామ్ 10ఎఫ్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్10 ఎఫ్ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. -
ఐటీ రిటర్నుల దాఖలుకు మరింత వ్యవధి
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును (వ్యక్తులు) డిసెంబర్ 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ గడువు సెప్టెంబర్ 30 వరకే ఉంది. వాస్తవానికి పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 చివరి తేదీ. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సర్కారు గత ఏడాదికి మాదిరే.. ఈ ఏడాదీ అదనపు వ్యవధిని ఇస్తూ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆదాయపన్ను నూతన ఈ ఫైలింగ్ పోర్టల్‌లో ఎన్నో సాంకేతిక సమస్యలు నెలకొనడం కూడా ఈ ఏడాది గడువు పెంచేందుకు గల కారణాల్లో ఒకటి. ‘అసెస్మెంట్ సంవత్సరం 2021–22 సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు విషయంలో ఎన్నో ఇబ్బందులను పన్ను చెల్లింపుదారులు, భాగస్వాములు మా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) గడువు తేదీలను పొడిగిస్తూ నిర్ణయించింది’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. కంపెనీలు ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువును నవంబర్ 30 నుంచి 2022 ఫిబ్రవరి 15కు సీబీడీటీ పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సరి్టఫికెట్లకు జనవరి 15, జనవరి 31 వరకు గడువు ఇచి్చంది. ఆలస్యపు రిటర్నుల దాఖలుకు గడువును వచ్చే మార్చి వరకు ఇచి్చంది. -
వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇప్పుడే కాదు
న్యూఢిల్లీ: వివాదాస్పద ప్రైవసీ పాలసీ అప్డేట్పై వాట్సాప్ యాజమాన్యం వెనక్కి తగ్గింది. మే 15వ తేదీలోగా ఖాతాదారులు దీన్ని ఆమోదించాలని, లేకపోతే ఖాతాలను రద్దు చేస్తామంటూ విధించిన డెడ్‌లైన్‌ను ఉపసంహరించుకుంది. ప్రైవసీ పాలసీ ఆప్డేట్ చేసుకోకపోయినా మే 15న ఖాతాలేవీ రద్దు కావని వాట్సాప్ అధికార ప్రతినిధి శుక్రవారం స్పష్టం చేశారు. భారత్‌లో వాట్సాప్ ఖాతాలన్నీ యథాతథంగా పని చేస్తాయని పేర్కొన్నారు. ప్రైవసీ విధానంపై తదుపరి నిర్ణయాలను వినియోగదారులకు తెలియజేస్తామన్నారు. ఈ విధానంపై కొత్త నియమ నిబంధనలను మెజార్టీ వినియోగదారులు ఆమోదించారని గుర్తుచేశారు. కొందరికి మాత్రం ఇంకా ఆ అవకాశం రాలేదన్నారు. అయితే, డెడ్‌లైన్‌పై వెనక్కి తగ్గడానికి గల కారణాలను వాట్సాప్ యాజమాన్యం బయటపెట్టలేదు. కొత్త నిబంధనలను ఎంతమంది వినియోగదారులు ఆమోదించారో చెప్పలేదు. ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ యాజమాన్యం ఈ ఏడాది జనవరిలో కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తొలుత ఫిబ్రవరి 8లోగా వీటిని ఆమోదించాలని గడువు విధించింది. అనంతరం ఈ డెడ్‌లైన్‌ను మే 15 దాకా పొడిగించింది. కొత్త పాలసీలో భాగంగా తమ వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో వాట్సాప్ యాజమాన్యం పంచుకుంటోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే, దీన్ని వాట్సాప్ కొట్టిపారేసింది. -
విశాఖ భూ కుంభకోణం: సిట్ గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: విశాఖ భూముల వ్యవహారంపై సిట్ గడువు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 28 నాటికి ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది. 2019 అక్టోబరు 17న విశాఖ, పరిసర మండలాల్లో భూముల కొనుగోళ్ల వ్యవహారంపై ప్రభుత్వం.. సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ లాక్‌డౌన్‌తో సిట్ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. లాక్డౌన్ అనంతరం 2020 జూన్ 10 నుంచి తిరిగి సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఫిబ్రవరి 28 నాటికి నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌కు ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. -
లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు గడువు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్ పత్ర–జేపీపీ) సమర్పించే తుది గడువును వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఆలోగా ఎప్పుడైనా ఇవ్వవచ్చని పేర్కొంది. కోవిడ్–19 కారణంగా జేపీపీ అందజేయలేకపోయిన సుమారు 35 లక్షల పింఛనుదారులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. నవంబర్ 30వ తేదీలోగా జేపీపీ సమర్పించని వారికి ఫిబ్రవరి వరకు పింఛను యథా ప్రకారం అందుతుందని స్పష్టం చేసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం–1995 ప్రకారం పింఛను పొందుతున్న వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని వివరించింది. జేపీపీ ఏడాదిపాటు అమల్లో ఉంటుందని తెలిపింది. -
ఐటీ రిటర్న్‌ల గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరటనిచ్చింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గానూ వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. అలాగే ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలు గడువును జనవరి 31 వరకు పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీసీ) విడుదల చేసిన ఒక ప్రకటన ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అంతర్జాతీయ లావాదేవీలు, కొన్ని ప్రత్యేక స్వదేశీ లావాదేవీలు నిర్వహించే పన్ను చెల్లింపుదార్లు తమ ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఇదివరకు నిర్దేశించిన గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఇతర పన్ను చెల్లింపుదారులకూ గడువును జనవరి 31వరకు పొడిగించారు. దిగువ తరగతి, మధ్యతరగతి పన్ను చెల్లింపుదార్లు తాము స్వయంగా మదింపు చేసిన ఆదాయ పన్ను వివరాలు దాఖలు చేయడానికి మరోసారి వెసులుబాటు కల్పించారు. పన్ను విధింపునకు ఆస్కారం ఉన్న రూ.లక్ష వరకూ ఆదాయం ఉన్న వారు స్వయంగా మదింపు ప్రక్రియ వివరాలు సమర్పించేందుకు జనవరి 31 వరకు అవకాశం కల్పించారు. -
అబార్షన్‌కు 24 వారాల గడువు
న్యూఢిల్లీ: అబార్షన్ చేయించుకోవడానికి ప్రస్తుతం ఉన్న 20 వారాల గరిష్ట కాలపరిమితి గడువును 24 వారాలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో గర్భం దాల్చిన మహిళలు, రక్తసంబంధీకుల ద్వారా గర్భం దాల్చిన మహిళలు, దివ్యాంగులు, మైనర్లు వంటి ప్రత్యేక కేటగిరి మహిళలకే 24 వారాల గడువు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన బిల్లుకి ఆమోద ముద్ర వేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971కి సవరణలు చేస్తూ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ (సవరణ) బిల్లు, 2020ని కేంద్రం రూపొందించింది. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్ సమావేశానంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. గర్భ విచ్ఛిన్నానికి గరిష్ట గడువుని 20 వారాల నుంచి 24 వారాలకి పెంచడం వల్ల ఎందరో మహిళలకు బాగా సాయపడుతుందని అన్నారు. అత్యాచార బాధితులు, మైనర్లు గర్భం దాల్చినప్పటికీ చాలా ఆలస్యంగా గ్రహిస్తారని, అలాంటి వారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని అన్నారు. అంతేకాదు సులువుగా గర్భస్రావం, మహిళల పునరుత్పత్తి హక్కుల్ని కాపాడినట్టు అవుతుందని చెప్పారు. చాలా మందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు జవదేకర్ చెప్పారు. దీనిని ఒక ప్రగతిశీల సంస్కరణగా జవదేకర్ అభివర్ణించారు. అయితే ఇన్నాళ్లూ ఒక వైద్యుడు అంగీకరిస్తే అబార్షన్ చేసేవారని, కానీ 24 వారాలు వచ్చాక అబార్షన్ చేస్తే ఇద్దరు వైద్యులు అంగీకరించాల్సిన అవసరం ఉందని, వారిలో ఒకరు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యుడు అయి ఉండి తీరాలని జవదేకర్ వివరించారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలకు ఎన్ఈసీ నిధుల్లో 30% నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ (ఎన్ఈసీ) నిధుల్లో 30 శాతం సమాజంలో అణగారిన వర్గాలు నివసించే ప్రాంతాలు, నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాల్లో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులకి ఈ నిధుల్ని కేటాయించనున్నారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి ఎన్ఈసీ నిబంధనల్ని కూడా సవరించనున్నారు. మిగిలిన నిధుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టులకు కేటాయిస్తారు. -
‘పన్ను’కు టైమైంది..
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు పెద్దగా సమయం లేదు. వాస్తవానికి జూలై చివరి నాటికే ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ చివరి వరకు గడువును పొడిగించింది. దీంతో ఈ నెల చివరి వరకు అవకాశం లభించినట్టు అయింది. కనుక వెంటనే ఐటీఆర్ దాఖలును ప్రారంభించడం మంచిది. బేసిక్ పన్ను మినహాయింపు అయిన రూ.2.5 లక్షలు (60 ఏళ్లు దాటిన వారికి రూ.3 లక్షలు) దాటి ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరూ నిబంధనల మేరకు ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాలంటే, అందులో ఉండే పన్ను అంశాలు, వాటికి సంబంధించి ఇవ్వాల్సిన వివరాలు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అంతేకాదు అందరికీ ఒకటే ఐటీఆర్ వర్తించదు. వేతన జీవులు, వ్యాపారులు, ఉమ్మడి కుటుంబాల వారు... ఇలా వారి ఆదాయ మార్గాలను బట్టి ఐటీఆర్ కూడా మారిపోతుంది. కనుక ఐటీఆర్ ప్రక్రియ గురించి అవగాహన కలిగి ఉంటే, సులభంగా దాఖలు చేయవచ్చు. ఆ వివరాలే ఈవారం ప్రాఫిట్ ప్లస్ కథనం... గడువులోపు ఐటీఆర్ దాఖలు అన్నది మంచి చర్య అవుతుంది. లేదంటే పెనాల్టీలు, ఇతర వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఐటీఆర్ దాఖలు కోసం ముందుగా మీరు మీ ఆదాయ వనరులు అన్నింటిపై అవగాహన కలిగి ఉండాలి. వేతనం, ఇంటి అద్దె, ఏవైనా రాయల్టీలు (ప్రతిఫలాలు) ఇలా అన్ని ఆదాయ వనరుల సమాచారం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆదాయంలో దేనిపై పన్ను వర్తిస్తుందన్నది తెలుసుకోవాలి. ఆదాయపన్ను అన్నది బేసిక్ శాలరీ, కరువుభత్యం (డీఏ), బోనస్‌లపై అమలవుతుంది. సొంతిల్లు ఉండి, అందులో మీరు నివసిస్తుంటే తప్ప ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పన్ను పరిధిలోకి రాదు. ఇక ఆదాయంలో పన్ను మినహాయింపులు వేటికన్నది గుర్తించాల్సి ఉంటుంది. సేవింగ్స్ పథకాలు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటివన్నీ సెక్షన్ 80సీ కింద మినహాయింపులోకి వస్తాయి. పన్ను వర్తించే ఆదాయం అన్నది స్థూల ఆదాయంలో ఒక భాగం కాగా, మిగిలినది మినహాయింపులకు అర్హమైనది. పన్ను వర్తించే ఆదాయంపై పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పన్ను ఆదాయం ఉన్న వారి వేతనం నుంచి టీడీఎస్‌ను సంస్థలు మినహాయిస్తుంటాయి. ఈ వివరాలను ఫామ్–16 రూపంలో సంస్థ నుంచి పొందొచ్చు. ఐటీ చట్టం ప్రకారం పలు రకాల పన్ను శ్లాబులు ఉన్నాయి. మీకు పన్ను వర్తించే ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, అందులో వర్తించే రేటు మేరకు పన్ను చెల్లించాలి. ఐటీఆర్‌లో అన్ని వివరాలు పొందుపరిచి మినహాయింపుల ఆదాయం పోను మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించిన తర్వాత... ఏవైనా వ్యత్యాసం ఉంటే.. ఆ మేరకు పన్ను చెల్లింపుదారుడు రిఫండ్ కోరొచ్చు. తనే అదనంగా చెల్లించాల్సి ఉంటే పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆదాయ వనరులు... మీరు ఉద్యోగి అయితే, నెలవారీ ఆదాయం లేదా వార్షికాదాయంతోపాటు.. ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం (అంటే ఇంటిపై అద్దె, ఉన్న ఆస్తిని విక్రయించగా వచ్చిన ఆదాయం వంటివి). పన్ను పరంగా అన్ని రకాల ఆదాయం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం కిందకు వస్తుంది. బేసిక్ సాలరీ, బోనస్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర అలవెన్స్‌ను వేతనంలో భాగంగా పొందుతుంటే అది పన్ను వర్తించే ఆదాయమే. అలాగే, ఇంటిపై వచ్చే ఆదాయంపైనా పన్ను ఉంటుంది. ఏదైనా ఆస్తిని విక్రయించగా వచ్చిన మూలధన లాభం లేదా నష్టం. వ్యాపారంపై వచ్చే ఆదాయం. ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంకు ఖాతాపై వడ్డీ ఆదాయం, గిఫ్ట్, కుటుంబ పెన్షన్‌ను సైతం ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది. మినహాయింపులు... ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు ఆదాయంలో కొంత వరకు పన్ను మినహాయింపులు పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి. సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు చెల్లింపులు ఈ సెక్షన్ల కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవి. అందుబాటులో ఉన్న సాధనాల్లో మీకు అనుకూలమైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మేరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం సౌకర్యవంతం. ఇవి కాకుండా ఇతర పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలు (ప్రిన్సిపల్) మొత్తంపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితి మేరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక మొదటి సారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. బ్యాంకు సేవింగ్స్ ఖాతాపై వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు (హెచ్‌యూఎఫ్) సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీసీజీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడులపై 50 శాతం, గరిష్టంగా 25,000కు... దీర్ఘకాలిక ఇన్ఫ్రా బాండ్లలో రూ.20,000 పెట్టుబడులకు సెక్షన్ 80సీసీఎఫ్ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద వ్యక్తులు అయితే రూ.25,000 వరకు హెల్త్ ప్రీమియంపై, వృద్ధులకు రూ.30,000 ప్రీమియంకు పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80ఈ కింద విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు పరిమితి లేకుండా ప్రయోజనం పొందొచ్చు. ఐటీఆర్ దాఖలు ఇలా... అన్ని వివరాలపై అవగాహన తెచ్చుకున్న తర్వాత ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా సమగ్రంగా ఉండేలా చూసుకోవచ్చు. ఆన్లైన్లో స్వయంగా ఐటీఆర్ దాఖలు చేయడం లేదంటే నిపుణుల సాయం తీసుకోవచ్చు. మీ సమక్షంలో వారు ఐటీఆర్ దాఖలు చేస్తారు. ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రం సహజ్‌ను పొందొచ్చు. ఆదాయపన్ను ఈఫైలింగ్ వెబ్‌పోర్టల్‌లో తమ పేరిట అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, ఆన్లైన్లోనే ఈ ఫామ్‌ను పూర్తి చేసి దాఖలు చేయవచ్చు. ఇలా రిటర్నులు దాఖలు చేసే ముందు ఆదాయం, పెట్టుబడుల వివరాలను, సంబంధిత డాక్యుమెంట్లను, ఫామ్ 16ను రెడీగా ఉంచుకోవాలి. రిటర్నుల సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులభంగా పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ టూల్‌ను గతంలో వినియోగించినట్టయితే, లాగిన్ అయి ప్రీఫిల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా ఇతర వివరాలను నమోదు చేసి దాఖలు ప్రక్రియను పూర్తి చేయడం సులభం. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీపై పన్ను చెల్లింపు బాధ్యత ఎంతన్నది లెక్కించుకోవాలి. అంతిమంగా చెల్లించాల్సిన పన్ను, అప్పటికే టీడీఎస్ రూపంలో చెల్లించినది పోను మిగిలిన మేర చెల్లించాలి. ఐటీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత ఐటీఆర్–వీ ఫామ్ అన్నది జనరేట్ అవుతుంది. దీనిపై డిజిటల్‌గా సంతకం చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకుని ఐటీఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. లేదంటే ఐటీఆర్–వీ పత్రాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి, ఐటీ కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు. ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి.. ఒక వ్యక్తి ఏయే ఫారంల ద్వారా రిటర్నులు దాఖలు చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. గతంలో వేతన జీవులకొక ఫారం, ఇతరులకొక ఫారం అంటూ రెండే ఉండేవి. కాలక్రమంలో ఎన్నో మార్పు.. ఎన్నో ఫారాలు.. మొత్తం వాడుకలో ఉన్న ఏడు ఫారాలలో నాలుగు ఫారాలు వ్యక్తులకు వర్తిస్తాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రీఫిల్డ్ ఫారాలు అమల్లో ఉన్నాయి. ఐటీ సైట్లోకి వెళ్లి my account ఆప్షన్‌లోకి వెడితే.. Prefilled XML ఉంటుంది. ఫారం 26 A లోని వివరాలు కనిపిస్తాయి. జీతం, పెన్షన్, వడ్డీ.. తదితరసమాచారం ఇందులో ఉంటుంది. ఐటీ ట్యాక్స్ వివరాలు ఉంటాయి. ఐటీఆర్1 వ్యక్తులు.. రెసిడెంట్ అయి ఉండి, నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటని వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయం ఉండకూడదు. ఏదేని సంస్థలో డైరెక్టర్ అయి ఉండకూడదు. వ్యాపారం, క్యాపిటల్ గెయిన్స్ ఉండకూడదు. ఏ వనరు ద్వారా కూడా నష్టం ఉండకూడదు. ఒక ఇంటి నుంచే ఆదాయం ఉండాలి. మరో విధంగా చెప్పాలంటే.. కేవలం జీతం, వడ్డీ, ఒక ఇంటి మీద ఆదాయం (నష్టం కాదు) ఉన్న వారు ఈ ఫారం దాఖలు చేయాలి. వ్యవసాయం మీద ఆదాయం, డివిడెండ్లు రూ. 5,000 దాటకపోతే కూడా వేయొచ్చు. ఐటీఆర్ 2 వ్యక్తులు మరియు ఉమ్మడి కుటుంబాలు ఈ ఫారం దాఖలు చేయొచ్చు. జీతం, ఇంటి మీద ఆదాయం (నష్టం ఉన్నా ఫర్వాలేదు), ఇతర ఆదాయాలు, క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. నాన్ రెసిడెంట్లు కూడా ఈ ఫారం వేయొచ్చు. అయితే, వారు తమ ట్యాక్స్ ఐడెంటిటీ నంబరు ఇవ్వాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటిన వారు దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల వివరాలు, షేర్లు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, పెయింటింగ్, కళాత్మక వస్తువులు, బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, రావల్సిన అప్పులు, నగదు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఆస్తులను కొన్న ధర చూపాలే తప్ప ప్రస్తుత మార్కెట్ విలువ కాదు. నష్టం, సర్దుబాటు చూపొచ్చు. ఐటీఆర్ 3 ట్యాక్స్ క్రెడిట్ పరిధిలోకి రానివారు, పలు వనరుల నుంచి ఆదాయం ఉన్నవారు.. అంటే జీతం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతరత్రా వ్యాపారం.. వృత్తిగత ఆదాయాలు ఉన్నవారు దీన్ని దాఖలు చేయొచ్చు. ఇది పెద్ద ఫారం. చాలా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్లు, వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు దీన్ని వేయొచ్చు. ఆస్తులు.. అప్పుల పట్టీ, స్థూల ఆదాయం, ఖర్చుల వివరాలు, నగదు, బ్యాంకు నిల్వల వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఐటీఆర్ 4 ఇది రెసిడెంట్లు మాత్రమే ఉపయోగించగలిగే ఫారం. వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు దీన్ని దాఖలు చేయొచ్చు. వ్యాపారం మీద స్థూల ఆదాయం/టర్నోవరు రూ. 2 కోట్లు దాటకూడదు. వృత్తి నిపుణుల స్థూల ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు. ఒక ఇంటి మీద మాత్రమే ఆదాయం ఉండాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటకూడదు. ఊహాజనిత ఆదాయాలున్న వారు దీన్ని వేయొచ్చు. ఈ ఫారాన్ని ఒకసారి వేస్తే.. వరుసగా అయిదేళ్ల పాటు ఇదే ఫారం దాఖలు చేయడం కొనసాగించాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఫారం 3 వేస్తే రాబోయే అయిదు సంవత్సరాలు కూడా ఫారం 3 మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఇంకా సందేహాలు ఉంటే వృత్తి నిపుణులను సంప్రతించండి. ఐటీ రిటర్నులను మీరే స్వయంగా దాఖలు చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తప్పులు చేయొద్దు. ఆదాయాన్ని చూపించడం మానొద్దు. లేకపోతే 50–200% దాకా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
ఆధార్ లింకేజీ గడువు పెంపునకు అవకాశం
న్యూఢిల్లీ: ఆధార్‌ను ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలకు అనుసంధానం చేసే గడువును మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం చేపట్టిన విచారణ సందర్భంగా అటార్నీ జనరల్(ఏజీ) కేకే వేణుగోపాల్ ఈ విషయం తెలిపారు. ఆధార్ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నందున, ఇందుకు వీలుగా ప్రభుత్వం గడువు పెంచాలనుకుంటోందని ఏజీ తెలపగా ధర్మాసనం అంగీకరించింది. ఆధార్ విషయంలో పదేపదే ఒకే రకమైన వాదనలు చేసేందుకు పిటిషనర్లను అంగీకరించబోమని బెంచ్ తెలిపింది. బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. -
మక్కలకు మోక్షం!
గజ్వేల్, న్యూస్‌లైన్: ‘సాక్షి’ ప్రయత్నం ఫలించింది. ఈ నెల 31న మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను మూసేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 20న ‘సాక్షి’ ‘మక్క రైతుకు మరో షాక్’ శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందించి.. మరికొన్ని రోజులు కొనుగోళ్లు చేపట్టాలని భావిస్తోంది. ఈ విషయాన్ని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు. ఇదిలావుంటే మార్కెట్ యార్డుల్లోని ఐకేపీ కేంద్రాల్లో వారం రోజులుగా గోదాములు ఖాళీ లేక వేలాది క్వింటాళ్ల మక్కలు పేరుకుపోగా కొనుగోళ్లు సైతం నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి ఎట్టకేలకు మార్క్‌ఫెడ్ చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలోనే సోమవారం యార్డుల్లో నుంచి లారీలు కదిలాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.25 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. నవంబర్ నెలలో తుపాన్ ధాటికి అపార నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితి వల్ల మక్కలు పూర్తిగా రంగు మారాయి. నష్టాన్ని మినహాయిస్తే జిల్లావ్యాప్తంగా రైతులవద్ద సుమారు 62 లక్షల క్వింటాళ్లకుపైగా ఉత్పత్తులు ఉండగా ప్రభుత్వం అక్టోబర్ నెలలో జిల్లాలో 14 ఐకేపీ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు కేవలం 4 లక్షల క్వింటాళ్ల మక్కలను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.1,310 చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.1050కి మించి ధర చెల్లించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఉత్పత్తులను ఐకేపీ కేంద్రాలకే తరలిస్తున్నారు. ఇంకా రైతుల వద్ద లక్షలాది క్వింటాళ్లలో మక్కలు పేరుకుపోయాయి. చాలాచోట్ల రైతులు ఇంకా మొక్కజొన్న జూళ్లు విప్పనేలేదు. మరోపక్క గోదాముల కొరత కారణంగా ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ఉత్పత్తుల తరలింపులో తీవ్ర జాప్యం నెలకొని కొనుగోళ్లు వేగంగా సాగడం లేదు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఈ నెల 31న కొనుగోలు కేంద్రాలను మూసేయాలని భావించారు. ఈ నిర్ణయం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను వివరిస్తూ ‘సాక్షి’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన కలెక్టర్ 31న కొనుగోలు కేంద్రాలను మూసేయవద్దని ఆదేశించారు. కలెక్టర్ సూచనల మేరకు కేంద్రాలను కొనసాగిస్తున్నామని మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక సోమవారం ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు. ఇప్పటివరకు కట్ఆఫ్ తేదీ అధికారికంగా రాలేదని, రైతుల అవసరాల దృష్ట్యా కొనుగోళ్లు చేపడతామన్నారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి గోదాములు కొరత కారణంగా కేంద్రాల్లో మక్కలు పేరుకుపోయి ఉన్నాయని చెప్పారు. చివరకు జిల్లాలోని 14 కేంద్రాల్లో పేరుకుపోయిన నిల్వలను సిద్దిపేటలోని వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన గోదాముల్లోకి సోమవారం నుంచి తరలిస్తున్నామని, తొందర్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి కొనుగోళ్లు యథాతథంగా సాగేలా చూస్తామని స్పష్టం చేశారు.