![8.96 lakh new jobs in January - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/23/Untitled-9.jpg.webp?itok=DQGE5xM5)
న్యూఢిల్లీ: దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ సంస్థ తాజాగా విడుదలచేసిన డేటా ప్రకారం.. సంఘటితరంగంలో ఈ ఏడాది జనవరిలో 8,96,516 నూతన ఉద్యోగ కల్పన జరిగింది.
ఇది ఏకంగా 17 నెలల గరిష్టస్థాయి కాగా.. గతేడాది ఇదేకాలంతో పోల్చితే 131 శాతం వృద్ధి చోటుచేసుకుంది. జనవరిలో 2.44 లక్షల నూతన ఉద్యోగాల్లో 22–25 ఏళ్ల మధ్యవారు ఉండగా, 2.24 లక్షల ఉద్యోగాల్లో 18–21 ఏళ్ల వయసువారు ఉన్నట్లు వెల్లడైంది. ఇక సెప్టెంబర్ 2017 నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో 76.48 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment