ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని సవరించనుంది. కొత్త నిబంధనల్ని అమలు చేయనుంది. ఇందుకోసం ఈపీఎఫ్‌ఓ ఈ కొత్త ప్రతిపాదనల్ని తన స్టేక్ హోల్డర్స్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓలో చేరాలంటే ఒక సంస్థలో 20మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ..వారి శాలరీ రూ.15వేలకు పైగా ఉండాలి. అలా ఉంటనే వారు చందాదారులుగా చేరే సౌకర్యం ఉంది. అయితే ఈ తరుణంలో ఈపీఎఫ్‌ఓ సంస్థ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952లోని పరిమితుల్ని ఉపసంహరించుకోనుంది.
తద్వారా ఈపీఎఫ్‌ఓ తన పథకాలను బిజినెస్ చేసుకునే వారికి సైతం అందించే సౌలభ్యాన్ని కల్పించనుంది. దీంతో పాటు ఈపీఎఫ్‌ఓలో చేరేందుకు ఇప్పటి వరకు విధించిన హెడ్ కౌంట్ (20మంది ఉద్యోగులు) ఉండాలని నిబంధనల్ని తొలగించేలా ప్రతిపాదనలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈపీఎఫ్‌ఓ ఎలా పనిచేస్తుంది
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందులో ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ తన ఖాతాదారులకు ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. మార్చి,2022 నాటి లెక్కల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ శాలరీలో నుంచి 12 శాతం వారి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. సంస్థ మరో 12శాతం ఉద్యోగి తరుపు జమ చేస్తుంది. ఈ జమ చేసిన మొత్తాన్ని ఉద్యోగి అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఆ మొత్తాన్ని ఉద్యోగి రిటైరైన తర్వాత ఈపీఎఫ్‌ఓ నెలకు పెన్షన్ రూపంలో అందిస్తుంది.
చదవండి👉 ఈపీఎఫ్‌ఓలో ఫోటో ఎలా అప్‌లోడ్ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు!
Comments
Please login to add a commentAdd a comment