self employee
-
గుడ్ న్యూస్! ఈపీఎఫ్ఓ కొత్త ప్రతిపాదనలు..మారనున్న నిబంధనలు!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని సవరించనుంది. కొత్త నిబంధనల్ని అమలు చేయనుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఈ కొత్త ప్రతిపాదనల్ని తన స్టేక్ హోల్డర్స్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో చేరాలంటే ఒక సంస్థలో 20మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ..వారి శాలరీ రూ.15వేలకు పైగా ఉండాలి. అలా ఉంటనే వారు చందాదారులుగా చేరే సౌకర్యం ఉంది. అయితే ఈ తరుణంలో ఈపీఎఫ్ఓ సంస్థ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952లోని పరిమితుల్ని ఉపసంహరించుకోనుంది. తద్వారా ఈపీఎఫ్ఓ తన పథకాలను బిజినెస్ చేసుకునే వారికి సైతం అందించే సౌలభ్యాన్ని కల్పించనుంది. దీంతో పాటు ఈపీఎఫ్ఓలో చేరేందుకు ఇప్పటి వరకు విధించిన హెడ్ కౌంట్ (20మంది ఉద్యోగులు) ఉండాలని నిబంధనల్ని తొలగించేలా ప్రతిపాదనలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ ఎలా పనిచేస్తుంది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందులో ప్రస్తుతం ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. మార్చి,2022 నాటి లెక్కల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ శాలరీలో నుంచి 12 శాతం వారి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. సంస్థ మరో 12శాతం ఉద్యోగి తరుపు జమ చేస్తుంది. ఈ జమ చేసిన మొత్తాన్ని ఉద్యోగి అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఆ మొత్తాన్ని ఉద్యోగి రిటైరైన తర్వాత ఈపీఎఫ్ఓ నెలకు పెన్షన్ రూపంలో అందిస్తుంది. చదవండి👉 ఈపీఎఫ్ఓలో ఫోటో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు! -
జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో శిక్షణ
విజయవాడ(మొగల్రాజపురం): నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో వివిధ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనశిక్షణా సంస్థాన్ డైరెక్టర్ వి.శ్రీనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హోమ్ అప్పయన్స్ మెకానిజమ్, శారీ రోలింగ్, డార్నింగ్, డ్రైక్లీనింగ్, టైలరింగ్ అండ్ కటింగ్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ మెడికల్ లాబ్ టెక్నాలజీ, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్, ఎం.ఎస్.ఆఫీస్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎలక్ట్రీషియన్, డీటీపీ, మెహంది అప్లికేషన్ ఆర్ట్, బాతిక్ ప్రింటింగ్, టై అండ్ డై, మెషిన్ ఎంబ్రాయిడరీ, శారీ ఎంబ్రాయిడరీ, హోమ్ క్రాప్ట్స్, జూట్ బ్యాగ్స్ మేకింగ్, అద్దాలు కుట్టడం, స్క్రీన్ ప్రింటింగ్, కలర్ డైయింగ్, కుట్టుమిషన్ మెకానిజమ్ల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మొగల్రాజపురంలోని రావిచెట్టు సెంటర్లో ఉన్న కార్యాలయంలో నేరుగా కాని 0866–2470420 నెంబరులోకానీ సంప్రదించాలని కోరారు.