
కారణాలేంటో? తెలియదు. గత కొన్ని నెలలుగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రాంతీయ కార్యాలయాల్లో పింఛనుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. కాలేజీ ఫీజు కట్టాలని ఒకరు. కూతురు పెళ్లి చేయాలని మరొకరు. అమ్మకు వైద్యం చేయించాలని ఇంకొకరు. ఇలా పీఎఫ్ ఖాతాదారులు కాళ్లరిగేలా ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. అయితే, ఈ క్రమంలో కాలేజీలు, స్కూళ్లు ప్రారంభం కావడంతో పాటు ఇతర కారణాల వల్ల ఎక్కువ మంది ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిపోతున్నారు.
ఇలాంటి సమాయాల్లో ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఖాతాదారులు పాత సంస్థకు రిజైన్ చేశారో వివరాల్ని అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే, అతను తన పీఎఫ్ ఖాతాను కొత్తగా చేరుతున్న సంస్థలోకి ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది.
పీఎఫ్ ఖాతాను బదిలీ చేయడానికి ముందు, ఆ వ్యక్తి తనను తాను ఆ కంపెనీలో ఉద్యోగి అంటూ వివరాల్ని నమోదు చేయాలి. దీని తర్వాత మాత్రమే పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే అవకాశం ఉంటుంది. కంపెనీని మార్చిన తర్వాత పాత సంస్థకు ఎప్పుడు రాజీనామా చేసిన తేదీని రెండు నెలలలోపు అప్‌డేట్ చేయాలి. ఒకవేళ ఎగ్జిట్ వివరాలు నమోదు చేయకుండా, సంస్థ మారే సమయంలో పీఎఫ్ విత్ డ్రా చేయడం మంచిది కాదు. పీఎఫ్ విత్ డ్రా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక పీఎఫ్ పోర్టల్‌లో సంస్థకు ఎప్పుడు రాజీనామా చేశారో తెలుపుతూ తేదీని ఎలా అప్‌డేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం
స్టెప్ట్1 : https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లో సభ్యుల సేవా పోర్టల్‌ని సందర్శించండి
స్టెప్ట్2 : వారి యూఏఎన్ నెంబర్ పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
స్టెప్ట్3 : అనంతరం 'మేనేజ్' ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'మార్క్ ఎగ్జిట్' సెలక్ట్ చేసుకోవాలి
స్టెప్ట్4 : మీరు డ్రాప్‌డౌన్ జాబితా నుండి పీఎఫ్ అకౌంటర్ నంబర్‌ను ఎంపిక చేసుకోవాలి
స్టెప్ట్ 5 : ఇక్కడ నిష్క్రమణ తేదీ, నిష్క్రమణకు గల కారణాన్ని నమోదు చేయాలి.
స్టెప్ట్ 6 : ఆ తర్వాత క్లిక్ చేసి ఓటీపీ రిక్వెస్ట్ పంపండి
స్టెప్ట్ 7 : మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి
స్టెప్ట్ 8 : చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, 'అప్‌డేట్' క్లిక్ చేసి, ఆపై 'ఒకే' అని ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ వివరాలు అప్‌డేట్ అవుతాయి.
#Employees can now update their Date of Exit on their own. To know more about this process, watch this video. Follow these simple steps to update your #DateofExit.https://t.co/Ys5JgPiQEz#AmritMahotsav #epfowithyou #PF #पीएफ #epf #HumHaiNa@PMOIndia @byadavbjp @Rameswar_Teli
— EPFO (@socialepfo) July 12, 2023
చదవండి👉 టెక్ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్.. ఇదేం పద్ధతంటూ కోర్టు చివాట్లు!