penction
-
ఈపీఎఫ్‌వో ఖాతాలో ఈ చిన్న పని చేశారా? లేదంటే క్యాష్ విత్‌డ్రా కష్టమే!
కారణాలేంటో? తెలియదు. గత కొన్ని నెలలుగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రాంతీయ కార్యాలయాల్లో పింఛనుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. కాలేజీ ఫీజు కట్టాలని ఒకరు. కూతురు పెళ్లి చేయాలని మరొకరు. అమ్మకు వైద్యం చేయించాలని ఇంకొకరు. ఇలా పీఎఫ్ ఖాతాదారులు కాళ్లరిగేలా ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. అయితే, ఈ క్రమంలో కాలేజీలు, స్కూళ్లు ప్రారంభం కావడంతో పాటు ఇతర కారణాల వల్ల ఎక్కువ మంది ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిపోతున్నారు. ఇలాంటి సమాయాల్లో ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఖాతాదారులు పాత సంస్థకు రిజైన్ చేశారో వివరాల్ని అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే, అతను తన పీఎఫ్ ఖాతాను కొత్తగా చేరుతున్న సంస్థలోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ ఖాతాను బదిలీ చేయడానికి ముందు, ఆ వ్యక్తి తనను తాను ఆ కంపెనీలో ఉద్యోగి అంటూ వివరాల్ని నమోదు చేయాలి. దీని తర్వాత మాత్రమే పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే అవకాశం ఉంటుంది. కంపెనీని మార్చిన తర్వాత పాత సంస్థకు ఎప్పుడు రాజీనామా చేసిన తేదీని రెండు నెలలలోపు అప్డేట్ చేయాలి. ఒకవేళ ఎగ్జిట్ వివరాలు నమోదు చేయకుండా, సంస్థ మారే సమయంలో పీఎఫ్ విత్ డ్రా చేయడం మంచిది కాదు. పీఎఫ్ విత్ డ్రా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పీఎఫ్ పోర్టల్‌లో సంస్థకు ఎప్పుడు రాజీనామా చేశారో తెలుపుతూ తేదీని ఎలా అప్డేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం స్టెప్ట్1 : https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లో సభ్యుల సేవా పోర్టల్‌ని సందర్శించండి స్టెప్ట్2 : వారి యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. స్టెప్ట్3 : అనంతరం 'మేనేజ్' ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'మార్క్ ఎగ్జిట్' సెలక్ట్ చేసుకోవాలి స్టెప్ట్4 : మీరు డ్రాప్‌డౌన్ జాబితా నుండి పీఎఫ్ అకౌంటర్ నంబర్‌ను ఎంపిక చేసుకోవాలి స్టెప్ట్ 5 : ఇక్కడ నిష్క్రమణ తేదీ, నిష్క్రమణకు గల కారణాన్ని నమోదు చేయాలి. స్టెప్ట్ 6 : ఆ తర్వాత క్లిక్ చేసి ఓటీపీ రిక్వెస్ట్ పంపండి స్టెప్ట్ 7 : మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి స్టెప్ట్ 8 : చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, 'అప్డేట్' క్లిక్ చేసి, ఆపై 'ఒకే' అని ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ వివరాలు అప్డేట్ అవుతాయి. #Employees can now update their Date of Exit on their own. To know more about this process, watch this video. Follow these simple steps to update your #DateofExit.https://t.co/Ys5JgPiQEz#AmritMahotsav #epfowithyou #PF #पीएफ #epf #HumHaiNa@PMOIndia @byadavbjp @Rameswar_Teli — EPFO (@socialepfo) July 12, 2023 చదవండి👉 టెక్ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్.. ఇదేం పద్ధతంటూ కోర్టు చివాట్లు! -
నేషనల్ పెన్షన్ స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం?
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఓల్డ్ పెన్షన్ స్కీం వర్సెస్ నేషనల్ పెన్షన్ స్కీం అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. పాత పింఛను విధానం కాకుండా ఇతర మార్గాలను అన్వేషించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమల్లో ఉన్న ఎన్పీఎస్ పథకం కింద ఉద్యోగి రిటైర్ అయ్యాక చివరి వేతనంలో 40 - 45 శాతం పెన్షన్‌గా అందుకునేలా మార్పులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. కొత్త పెన్షన్ విధానం అమలులో సాధ్యసాధ్యాలు, కేంద్ర రాష్ట్రాలపై రుణ భారం వంటి ఇతర అంశాలపై రివ్యూ జరిపేలా ఏప్రిల్ నెలలో కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. తాజాగా, ఆ కమిటీ సభ్యులు కేంద్రానికి ఓ రిపోర్ట్‌ను అందించారు. దాని ఆధారంగా ఎన్పీఎస్ చందాదారులు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ఆఖరి నెల జీతంలో 40 - 45 శాతం పెన్షన్‌గా వచ్చేలా హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రస్తుతం అందుబాటులోకి ఉన్న ఎన్‌పీఎస్‌లో ఉద్యోగి తన వాటాగా 10 శాతం చెల్లించాలి. ప్రభుత్వం తన వాటాగా 14 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని డెట్, ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేస్తారు. అయితే, ఎన్పీఎస్ కింద పెన్షన్ మొత్తానికి ఎలాంటి హామీ ఉండదు. -
పెన్షన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త!
పెన్షన్ లబ్ధిదారలకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) శుభవార్త చెప్పింది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షన్ దారులు వారి నిర్ణయం ప్రకారం.. ఎంత నగదు కావాలనుకుంటే అంత నగదు విత్ డ్రా చేసుకోవచ్చని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మొహంతీ తెలిపారు. సిస్టమెటిక్ విత్‌డ్రా ప్లాన్‌లో భాగంగా 60 ఏళ్ల నుంచి 75 ఏళ్లలోపు నేషన్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) పెన్షన్ దారులు ఒకనెల, మూడు నెలలు, ఆరు నెలలు డబ్బుల్ని డ్రా చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్పీఎస్ దారులు 60 ఏళ్ల తర్వాత తన రీటైర్మెంట్ సొమ్మును మొత్తం డ్రా చేసుకునేందుకు వీలు లేదు. కేవలం 60 శాతం మాత్రమే ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 40 శాతం మొత్తాన్ని ఏడాదికి కొంత మొత్తాన్ని తీసుకునే సౌకర్యం ఉంది. తాజాగా, ఆ పథకంలో మార్పులు చేస్తున్నామని.. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు దీపక్ మొహంతీ పేర్కొన్నారు. ఇక, ఈ మార్పులతో ఎవరైతే 60 శాతం పెన్షన్‌ను ఒకేసారి తీసుకునేందుకు ఇష్టపడని వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. దీంతో పాటు, ఈ స్కీమ్‌లో 60 ఏళ్లు నిండిన వారు 70 ఏళ్ల వరకు కొనసాగవచ్చు. ఇప్పుడు ఆ కాలాన్ని మరో ఐదేళ్లు అంటే 75ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చివరిగా :: దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. చదవండి : సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట! -
పేపర్‌కే.. పరిమితం..!!
సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం ఏర్పాటు చేస్తున్న ప్రజావాణికి వస్తున్న బాధితులకు నిరాశే మిగులుతోంది. కేవలం అర్జీల స్వీకరణకే పరిమితం అవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోడు పట్టించుకోకపోవడంతో బాధితులు మళ్లీమళ్లీ వస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారం కాక మండలాల నుంచి కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చే బాధితులు తిరిగి తిరిగి వేసారుతున్న దుస్థితి. సాక్షి,కరీంనగర్‌సిటీ : కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో అధికారులు కంప్యూటర్లో దరఖాస్తులు నమోదు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. తర్వాత సంబంధిత శాఖకు బదిలీ చేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో వేలల్లో వచ్చే దరఖాస్తులు జిల్లాల విభజన అనంతరం వందల్లో వస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 152 దరఖాస్తులు సమర్పించారు. ప్రధానంగా భూ సంబంధిత, పింఛన్లు, డబుల్ బెడ్రూంలు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఆహారభద్రత కార్డులు, ఉపాధి కల్పన వంటి సమస్యలపై వచ్చిన బాధితులే మళ్లీ మళ్లీ వస్తున్న దృశ్యాలు కనిపించాయి. పెండింగ్ సమస్యలన్నీ అధికారులు పరిష్కరించినట్లే పేర్కొంటున్నారు. సమస్యల పరిష్కార దశను చూపించే లెక్కల్లోనూ క్షేత్రస్థాయికి భిన్నంగా భారీ వ్యత్యాసముంటోంది. సమస్యలు పరిష్కారానికి నోచుకోక బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రంలోని ప్రజావాణికి వస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందంటూ బాధిత ప్రజలు వాపోతున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలకూ పరిష్కారం దొరకడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. ఏం జరుగుతోంది..? ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. కలెక్టర్, జేసీ సహా ఉన్నతాధికారులు పాల్గొంటుంటారు. మొదట ప్రత్యేక కౌంటర్లలో ప్రజావాణి దరఖాస్తులను వెబ్సైట్లో నమోదు చేసుకుని శాఖల వారీగా ఉన్నతాధికారులకు చేరవేస్తారు. దరఖాస్తు నమోదైనట్లు కౌంటర్లో బాధితుడికి ఓ ప్రతి ఇస్తారు. అయితే.. 15 రోజుల్లోగా సమస్య పరిష్కారానికి నోచుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాలున్నా అవి అమలుకావడం లేదు. వినతులు స్వీకరించిన ఆయా శాఖల అ«ధికారులు ప్రజావాణి ద్వారా అందిన అర్జీలు, పరిష్కారం, పురోగతి తదితర వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సరైన స్పందన లేకపోవడంతో వెబ్సైట్ నిర్వహణ మొక్కుబడిగా సాగుతోంది. చాలా శాఖలు ప్రజావాణి ద్వారా సంబంధిత సమస్యలు పరిష్కారం కాబడినవి అంటూ స్పందిస్తూ బాధితులకు లేఖలు చేరుతుండడంతో అవాక్కయ్యే సంఘటనలూ కనిపిస్తున్నాయి. ప్రధానంగా భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. వాటిపైనే ఫిర్యాదులు, వినతుల సమర్పిస్తున్నా దాటవేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దళితులు అధిక సంఖ్యలో భూమి కోసం కలెక్టరేట్‌కు తరలివచ్చి అర్జీలు పెట్టుకున్నా వాటికి మోక్షం లేకుండా పోతోంది. డబుల్బెడ్రూం మంజూరు చేస్తామని ప్రకటించగానే మధ్య, దిగువ, పేద ప్రజలు అధిక సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నా వాటిని కనీసం చూసే పరిస్థితి లేదు. ప్రతినెలా ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంపులు నిర్వహణలోనూ వైఫల్యమవుతుండడం.. ఆసరా పింఛన్లు అందకపోవడం.. ఆసరా దరఖాస్తులు పెట్టుకున్నా 6 నెలల వరకు మోక్షం లేకపోవడంతో నిత్యకృత్యంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కార మార్గాన్ని సైతం అధికారులు అన్వేషించడం లేదన్న ఆరోపణలున్నాయి. హాజరుపై అశ్రద్ధ.. ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులను కలుసుకోవడానికి ప్రజావాణి ఓ వేదిక. ప్రతీ సోమవారం కలెక్టర్, జేసీతో పాటు ప్రజావాణిలో జిల్లా అ«ధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. గతానికి భిన్నంగా జిల్లా అధికారులు తమ ఆఫీసులోని కిందిస్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపి చేతులు దులుపుకుంటున్నారు. కలెక్టర్, జేసీలు ఏదేని అధికారిక కార్యక్రమానికి వెళ్తే జిల్లా అధికారులు ఉండడం లేదు. సమస్యలు పరిష్కారమవుతాయని గంపెడాశతో వస్తున్న బాధితులు నిరాశ చెందుతున్నారు. అర్హతలున్నా పింఛనేదీ..? బావి ప్రమాదంలో నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనలో నా రెండు చేతులు విరిగిపోవడమే కాకుండా ఎడమ కాలు విరిగిపోయింది. శరీరంపై కూడా బలమైన గాయాలయ్యాయి. కూలీ పనులు కూడా చేసుకుని జీవించడానికి కష్టంగా ఉంది. నాలుగేళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్నా. అధికారులకు అర్జీలు పెట్టుకుంటున్నా కనికరించడం లేదు. అన్ని అర్హతలున్నా పింఛన్ ఇస్తలేరు. తిప్పుకుంటున్నరు.. ఇదెక్కడి న్యాయం. పింఛన్ ఇప్పించి ఆసరాగా నిలవాలని వేడుకుంటున్నా. – ఇట్టవేన సమ్మయ్య, రెడ్డిపల్లి, వీణవంక సర్కారును మోసం చేస్తున్నా పట్టింపులేదా..? గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎకరం నడి చెరువులో ఉంది. ఆ రైతు ఎక్ఫసల్ పట్టాగల భూమి అందులో ఉండగా మిషన్ కాకతీయలో భాగంగా 2 మీటర్ల మేర ఎత్తుకు లేపుతూ కాంట్రాక్టరు సదరు రైతుతో కుమ్మక్కయ్యాడు. చెరువులో మట్టిని తీసి అదే చెరువులో గల రైతు భూమిలో పోస్తున్నాడు. దీంతో చెరువులో ఆగే నీరు ఆగకుండా పోయింది. చెరువు కింద రైతులకు నీటి సామర్థ్యం పెరిగి లాభం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తే కాంట్రాక్టర్ అన్యాయం చేస్తున్నారు. కొలతలకు ఉంచిన దిమ్మల పైన మట్టి పోస్తూ పైకిలేపి ఎత్తును చూపిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. గత నెల రోజుల క్రితమే దరఖాస్తు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. – చెంజర్ల గ్రామస్తులు, మానకొండూర్ -
ఇక పింఛన్లకు ఐరిష్
తిరుపతి కార్పొరేషన్: డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఐరిష్ విధానంతో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మెప్మా స్పెషల్ డెరైక్టర్ చిన్నతాతయ్య వెల్లడించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బయోమెట్రిక్ విధానంలో సాంకేతిక సమస్యలు వస్తుండడంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి ఐరిష్ విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బైరాగిపట్టెడలోని మహాత్మాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ...రాష్ట్రంలో 44 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. గతంలో పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా ఇస్తుంటే ఆలస్యమయ్యేదని, అందుకే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. దీనికి ఆధార్ లింకు పెట్టడం వల్ల పంపిణీ సమయంలో పలు సాంకేతిక సమస్యలు వస్తున్నట్టు తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్ సామర్థ్యం పెంచడం, ఆధార్, బీఎస్ఎన్ఎల్ సర్వర్లను సరిచేసి సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. అయితే ఈ సమస్యలు పునరావృతం కాకుండా లబ్ధిదారులకు ఐరిష్ తీస్తామని, దాని ద్వారా డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
బండ్లగూడలో పింఛన్ కష్టాలు
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంలోని బండ్లగూడ గ్రామానికి చెందిన పింఛన్ దారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు కార్యాలయం చుట్టు తిరిగి పింఛన్లను తీసుకున్న వారు నేడు పోస్టాఫీస్ చుట్టు తిరగలేక పోతున్నామని వాపోతున్నారు. ఫింఛన్ దారులకు ప్రస్తుతం పోస్టాఫీస్ ద్వారా నెల సరి పింఛన్లను అందిస్తున్నారు.బండ్లగూడ గ్రామానికి చెందిన వారందరికి గ్రామ డాన్‌బాస్కో స్కూల్ ప్రాంతంలోని పోస్టాఫీస్‌లో పింఛన్లు అందిస్తున్నారు. ఈ ప్రాంతం అందరికి అనువుగా లేదు. దూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఆటోలలో పింఛన్ దారులు వస్తు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి రోజు పోస్టాఫీస్ ద్వారా కేవలం 100 మందికి మాత్రమే పింఛన్లు అందిస్తున్నారు. మిగిలిన వారికి రేపు రావాలంటూ సూచిస్తున్నారు. ఎవరు ముందు వస్తే వారికే పింఛన్లు వస్తుండడంతో తెల్లవారు జామునే పోస్టాఫీస్ వద్ద వృద్ధులు క్యూ కడుతున్నారు. గతంలో తమకు ఈ బాధలు లేవని వాపోతున్నారు. రెండు రోజులు తిరిగితే పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్ అందేదని తెలుపుతున్నారు. ప్రస్తుతం నాలుగు రోజులుగా ఆటో చార్జీకి మూడు వందలైందని లక్ష్మమ్మ అనే వద్థురాలు ఆవేధన వ్యక్తం చేశారు.అయినా తనకు పింఛన్ అందలేదన్నారు. ఇక సోమవారమే రావాలని తెలుపుతున్నారని వాపోయింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పింఛన్ దారులు కోరుతున్నారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: ప్రభుత్వం నుంచి నెలనెలా అందే వృద్ధాప్య పింఛను ఆగిపోయిందని, ఇంటి పట్టా రద్దు అయిందన్న మనస్తాపంతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా గుంతకల్లు మునిసిపల్ కార్యాలయం ఎదుట జరిగింది. శ్రీనివాసులు(65), భానుమతి 12వ వార్డులో ఉండేవారు. టీడీపీ కౌన్సిలర్ అంజద్ మస్తాన్ యాదవ్ తమకు వచ్చే ఫించనుతో పాటు, ఇంటి పట్టాను రద్దు చేయించాడంటూ పురుగుల మందు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.