హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంలోని బండ్లగూడ గ్రామానికి చెందిన పింఛన్ దారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు కార్యాలయం చుట్టు తిరిగి పింఛన్‌లను తీసుకున్న వారు నేడు పోస్టాఫీస్ చుట్టు తిరగలేక పోతున్నామని వాపోతున్నారు. ఫింఛన్ దారులకు ప్రస్తుతం పోస్టాఫీస్ ద్వారా నెల సరి పింఛన్‌లను అందిస్తున్నారు.బండ్లగూడ గ్రామానికి చెందిన వారందరికి గ్రామ డాన్‌బాస్కో స్కూల్ ప్రాంతంలోని పోస్టాఫీస్‌లో పింఛన్‌లు అందిస్తున్నారు. ఈ ప్రాంతం అందరికి అనువుగా లేదు. దూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఆటోలలో పింఛన్ దారులు వస్తు ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రతి రోజు పోస్టాఫీస్ ద్వారా కేవలం 100 మందికి మాత్రమే పింఛన్‌లు అందిస్తున్నారు. మిగిలిన వారికి రేపు రావాలంటూ సూచిస్తున్నారు. ఎవరు ముందు వస్తే వారికే పింఛన్‌లు వస్తుండడంతో తెల్లవారు జామునే పోస్టాఫీస్ వద్ద వృద్ధులు క్యూ కడుతున్నారు. గతంలో తమకు ఈ బాధలు లేవని వాపోతున్నారు. రెండు రోజులు తిరిగితే పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్ అందేదని తెలుపుతున్నారు. ప్రస్తుతం నాలుగు రోజులుగా ఆటో చార్జీకి మూడు వందలైందని లక్ష్మమ్మ అనే వద్థురాలు ఆవేధన వ్యక్తం చేశారు.అయినా తనకు పింఛన్ అందలేదన్నారు. ఇక సోమవారమే రావాలని తెలుపుతున్నారని వాపోయింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పింఛన్ దారులు కోరుతున్నారు.
బండ్లగూడలో పింఛన్ కష్టాలు
Published Sun, Aug 30 2015 8:10 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement