జనవరిలో భారీగా ఉపాధి కల్పన | EPFO adds 1. 48 mn subscribers in January 2023 | Sakshi
Sakshi News home page

జనవరిలో భారీగా ఉపాధి కల్పన

Published Thu, Mar 23 2023 2:19 AM | Last Updated on Thu, Mar 23 2023 2:19 AM

EPFO adds 1. 48 mn subscribers in January 2023 - Sakshi

న్యూఢిల్లీ: రిటైర్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ– ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌)లో ఈ ఏడాది జనవరిలో 14.86 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే..

► జనవరి నెలలో 3.54 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓ పరిధి నుంచి బయటకు వెళ్లారు. ఈపీఎఫ్‌ఓ చట్రం నుంచి బయటకు వెళ్లడానికి సంబంధించి గడచిన నాలుగు నెలల్లో ఇది కనిష్ట సంఖ్య. 
► జనవరిలో నమోదయిన 14.86 లక్షల మందిలో 7.77 మంది కొత్తవారు. మొదటిసారి వీరు ఈపీఎఫ్‌ఓలో చందాదారులయ్యారు.  
► జనవరి 2023లో నికర మహిళా సభ్యుల నమోదు 2.87 లక్షలు. ఇందులో దాదాపు 1.97 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. దీంతో నికర మహిళా సభ్యుల్లో 68.61 శాతం మంది తొలిసారిగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చినట్లయ్యింది.  
► రాష్ట్రాల వారీగా చూస్తే,  అత్యధిక సంఖ్యలో ఈపీఎఫ్‌ఓలో చేరిన వారిలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌. ఢిల్లీలకు చెందిన వారు ఉన్నారు.   
► ఈపీఎఫ్‌ఓలో ప్రస్తుతం దాదాపు 8 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement