New Subscribers
-
బీఎస్ఎన్ఎల్కు కొత్తగా 8.5 లక్షల మంది..
న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా 2024 సెప్టెంబర్‌లో కోటి మందికిపైగా వైర్లెస్ చందాదారులను కోల్పోయాయి. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సుమారు 8.5 లక్షల మంది కొత్త కస్టమర్లను దక్కించుకుంది. ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్ మాసంలో రిలయన్స్ జియోకు 79.69 లక్షల మంది, భారతీ ఎయిర్టెల్ 14.34 లక్షలు, వొడాఫోన్ ఐడియాకు 15.53 లక్షల మంది దూరమయ్యారు. సెప్టెంబర్ చివరినాటికి మొత్తం వైర్లెస్ చందాదార్ల సంఖ్య 0.87 శాతం పడిపోయి 115.37 కోట్లకు వచ్చి చేరింది. ఇందులో రిలయన్స్ జియోకు 46.37 కోట్లు, భారతీ ఎయిర్టెల్ 38.34 కోట్లు, వొడాఫోన్ ఐడియా 21.24 కోట్లు, బీఎస్ఎన్ఎల్కు 9.18 కోట్ల మంది ఉన్నారు. వైర్లెస్ వినియోగదార్లు నగరాల్లో 0.80 శాతం, గ్రామాల్లో 0.95 శాతం తగ్గారు. వైర్డ్, వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ చందాదార్ల సంఖ్య 0.51% క్షీణించి 94.44 కోట్లు నమోదైంది. ఇందులో రిలయన్స్ జియోకు 47.7 కోట్లు, భారతీ ఎయిర్టెల్ 28.5 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.6 కోట్లు, బీఎస్ఎన్ఎల్కు 3.7 కోట్ల మంది ఉన్నారు. మార్కెట్ వాటా పొందేందుకు.. జూలైలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదలని ఉండబోదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి గత నెలలో స్పష్టం చేయడం గమనార్హం. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్ఎన్ఎల్ ఇటీవల స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్‌్క, డైరెక్ట్–టు–డివైస్ తదితర సేవలను ప్రారంభించింది. -
ఈపీఎఫ్‌వో కిందకు 15.62 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 15.62 లక్షల మంది సభ్యులు డిసెంబర్ నెలలో చేరారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే సభ్యుల చేరికలో 12 శాతం వృద్ధి నమోదైంది. అదే 2022 డిసెంబర్ నెల చేరికలతో పోలిస్తే 4.62 శాతం వృద్ధి కనిపించింది. ఉపాధి అవకాశాల పెరుగుదల, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, మరిన్ని సంస్థలకు చేరువ అయ్యేందుకు ఈపీఎఫ్‌వో చేపడుతున్న కార్యక్రమాలు సభ్యుల పెరుగుదలకు సాయపడుతున్నట్టు కేంద్ర కారి్మక శాఖ ప్రకటించింది. 8.41 లక్షల మంది ఈపీఎఫ్‌వో కింద మొదటిసారి నమోదు అయ్యారు. అంటే తొలిసారి వీరు సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్‌తో పోలిస్తే కొత్త సభ్యుల పెరుగుదల 14 శాతంగా ఉంది. పైగా డిసెంబర్ నెలకు సంబంధించిన నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మంది 18–25 వయసులోని వారే కావడం గమనార్హం. మిగిలిన సభ్యులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ద్వారా తమ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకున్నారు. 2.09 లక్షల మంది మహిళలు.. 8.41 లక్షల కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే 7.57 శాతం అధికం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. డిసెంబర్ నెలకు సంబంధించి కొత్త చేరికల్లో 58.33 శాతం ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర వాటా 21.63 శాతంగా ఉంది. ఐరన్ అండ్ స్టీల్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, జనరల్ ఇన్సూరెన్స్ రంగాలు ఎక్కువ మందికి అవకాశం కల్పించాయి. -
‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాలంటే డబ్బులు కట్టాలి
వాషింగ్టన్: మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’(ట్విట్టర్) తన వినియోగదారులకు చేదువార్త చెప్పింది. ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్ర్స్కిప్షన్ ప్లాన్‌ను అమల్లోకి తీసుకొచి్చంది. దీనిప్రకారం.. ‘ఎక్స్’లో కొత్త యూజర్లు పోస్ట్‌లు చేయాలన్నా, వేరొకరి ట్వీట్‌ను రీట్వీట్ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా, లైక్ కొట్టాలన్నా, షేర్ చేయాలన్నా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్ర్స్కిప్షన్ ఫీజు కింద ఏడాదికి ఒక డాలర్ చొప్పున ‘ఎక్స్’ యాజమాన్యం వసూలు చేయనుంది. -
జనవరిలో భారీగా ఉపాధి కల్పన
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్)లో ఈ ఏడాది జనవరిలో 14.86 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే.. ► జనవరి నెలలో 3.54 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ పరిధి నుంచి బయటకు వెళ్లారు. ఈపీఎఫ్ఓ చట్రం నుంచి బయటకు వెళ్లడానికి సంబంధించి గడచిన నాలుగు నెలల్లో ఇది కనిష్ట సంఖ్య. ► జనవరిలో నమోదయిన 14.86 లక్షల మందిలో 7.77 మంది కొత్తవారు. మొదటిసారి వీరు ఈపీఎఫ్ఓలో చందాదారులయ్యారు. ► జనవరి 2023లో నికర మహిళా సభ్యుల నమోదు 2.87 లక్షలు. ఇందులో దాదాపు 1.97 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. దీంతో నికర మహిళా సభ్యుల్లో 68.61 శాతం మంది తొలిసారిగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చినట్లయ్యింది. ► రాష్ట్రాల వారీగా చూస్తే, అత్యధిక సంఖ్యలో ఈపీఎఫ్ఓలో చేరిన వారిలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్. ఢిల్లీలకు చెందిన వారు ఉన్నారు. ► ఈపీఎఫ్ఓలో ప్రస్తుతం దాదాపు 8 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. -
జూలైలో జియో జూమ్!!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో జోరు కొనసాగుతోంది. జూలైలో ఏకంగా 65.1 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుని మార్కెట్ లీడర్‌గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీనితో జులై ఆఖరు నాటికి జియో సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 44.32 కోట్లకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త కస్టమర్లను (34.8 లక్షలు) దక్కించుకున్న ఏకైక సంస్థ జియో ఒక్కటే. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూలైలో భారతి ఎయిర్టెల్ కొత్త యూజర్ల సంఖ్య 19.42 లక్షలుగా నమోదు కాగా మొత్తం కనెక్షన్ల సంఖ్య 35.40 కోట్లకు ఎగిసింది. అటు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్–ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం 14.3 లక్షలు పడిపోయింది. దీంతో మొత్తం సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 27.19 కోట్లకు పరిమితమైంది. వైర్లెస్ కనెక్షన్ల మార్కెట్లో జూలై ఆఖరు నాటికి జియోకు 37.34 శాతం, భారతి ఎయిర్‌టెల్‌కు 29.83 శాతం, వొడా–ఐడియాకు 22.91 శాతం వాటా ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం, 100 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియాకు కాస్త ఊరట లభించనుంది. 120 కోట్లకు కనెక్షన్లు..: ట్రాయ్ డేటా ప్రకారం దేశీయంగా టెలిఫోన్ కనెక్షన్లు 120.9 కోట్లకు చేరాయి. వైర్లెస్ విభాగంలో మొత్తం యూజర్ల సంఖ్య 118.6 కోట్లకు చేరింది. ఇక బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల మార్కెట్లో టాప్ 5 సరీ్వస్ ప్రొవైడర్ల వాటా 98.7 శాతంగా ఉంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎట్రియా కన్వర్జెన్స్ సంస్థలు టాప్ 5లో ఉన్నాయి. -
చార్జీల వడ్డన: జియోకు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఉచిత సేవలతో టెలికాం పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియోకు తాజాగా భారీ షాక్ తగిలింది. ఇటీవలి కాలవంలో టారిఫ్ సవరింపు కారణంగా డిసెంబరు నెలలో జియో కొత్త వినియోగదారుల సంఖ్యలో భారీగా క్షీణించిందని ట్రాయ్ వెల్లడించింది. నవంబరు నెలలో 5లక్షల 60 వేల కొత్త చందారులను జత చేసుకున్న జియో డిసెంబర్ నెలలో 82,308 మంది ఖాతాదారులను మాత్రమే నమోదు చేసింది. అంతేకాదు ఈ విషయంలో బీఎస్ఎన్ఎల్ కంటే వెనకపడటం విశేషం. మరోవైపు ఏజీఆర్ బకాయిలతో సంక్షోభంలో పడ్డ వొడాఫోన్ ఐడియా చందాదారుల విషయంలో కూడా పురోగతి లేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డిసెంబర్ 31, 2019తో ముగిసిన నెలలో భారతీయ టెలికాం కంపెనీల చందాదారుల డేటాను బుధవారం విడుదల చేసింది. జియో గత ఏడాది డిసెంబర్లో తన టారిఫ్ పెంపును ప్రవేశపెట్టడమే సబ్ స్కైబర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం కావచ్చని పేర్కొంది. కంపెనీ మార్కెట్ వాటా పుంజుకుంది. నవంబర్ 2019 చివరిలో 32.04 శాతంతో పోలిస్తే 32.14 శాతానికి పెరిగింది. వోడాఫోన్-ఐడియా మార్కెట్ వాటా నవంబర్‌లో 29.12 శాతం నుండి డిసెంబర్లో 28.89 శాతానికి తగ్గింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ ఈ నెలలో సుమారు 4,26,958 మంది కొత్త చందాదారులను చేర్చుకుంది. ఇది జియో కంటే ఎక్కువ. నవంబర్ 2019 నెలలో 3,38,480 మంది మాత్రమే. దీని మార్కెట్ వాటా ఒక నెలలో 10.19 శాతం నుండి 10.26 శాతానికి పెరిగింది. 2 019 చివరి నెలలో ప్రవేశపెట్టిన సుంకం పెంపు కారణంగా మొత్తం చందాదారుల వృద్ధి మందగమనంలో ఉందని ట్రాయ్ వెల్లడించింది. అయినప్పటికీ రిలయన్స్ జియో ఇప్పటికీ మార్కెట్ వాటాలో 32.14 శాతంతో టాప్‌లో ఉండగా, వొడాఫోన్ ఐడియా 28.89 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంది. 28.43 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో ఎయిర్ టెల్ వుంది. తాజా ట్రాయ్ నివేదిక ప్రకారం వొడాఫోన్ ఐడియా డిసెంబర్ 31తో ముగిసిన నెలలో 36,44,453 మంది సభ్యులను కోల్పోయింది. ఇది నవంబర్ నెలలో కోల్పోయిన 3,64,19,365 కంటే చాలా తక్కువ. చందాదారుల సంఖ్యలో నష్టం గణనీయంగా తగ్గినప్పటికీ, మార్కెట్ వాటా గత నెలలనుంచి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఎయిర్టెల్ డిసెంబర్ నెలలో చందాదారులను కోల్పోయినా ఈ సంఖ్య 11,050 వద్ద స్థిరంగా ఉంది. మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 2019 నవంబరులో 1,154.59 మిలియన్ల నుండి 2019 డిసెంబర్ చివరినాటికి 1,151.44 మిలియన్లకు తగ్గింది. తద్వారా నెలవారీ క్షీణత రేటు 0.27 శాతం. -
జూలైలో ‘జియో’ జోరు
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ సారథ్యంలోని ‘రిలయన్స్ జియో’ నూతన సబ్స్క్రైబర్లను జతచేసుకుంటూ జర్నీని కొనసాగించడంలో వాయువేగంతో దూసుకెళ్తోంది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం.. జూలైలో 85.39 లక్షల నూతన సబ్స్క్రైబర్లను జతచేసుకుంది. ఇటీవలే సబ్‌స్రై్కబర్ల పరంగా భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కునెట్టి రెండవ స్థానానికి చేరిన ఈ సంస్థ.. అనతికాలంలోనే ఏకంగా 33.97 కోట్ల సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. జూలై చివరినాటికి 0.2 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. మరోవైపు సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతి ఎయిర్టెల్ (టాటా టెలిసర్వీస్‌తో సహా) 25.8 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఈ సంస్థ బేస్ 32.85 కోట్లకు తగ్గిపోయింది. వొడాఫోన్ ఐడియా జూలైలో 33.9 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. జూలై చివరినాటికి ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 38 కోట్లకు తగ్గినట్లు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 2.88 లక్షల నూతన సబ్స్క్రైబర్లను జతచేసుకోవడంతో ఈ సంస్థ చందాదారుల సంఖ్య 11.6 కోట్లకు పెరిగింది. 5జీ కోసం చైనా టెల్కోలతో జట్టు టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ‘రిలయన్స్ జియో’ 5జీ సేవలపై దృష్టిసారించింది. ఈ సేవలను అందించడంలో భాగంగా చైనా టెలికం సంస్థలతో జట్టుకట్టింది. ఓపెన్ టెస్ట్ అండ్ ఇంటిగ్రేషన్ సెంటర్ (ఓటీఐసీ) ఏర్పాటు కోసం ప్రముఖ టెలికం దిగ్గజ సంస్థలతో భేటీ అయినట్లు బుధవారం ప్రకటించింది. 5జీ నెట్వర్క్ సొల్యూషన్స్ అభివృద్ధి నిమిత్తం.. చైనా సంస్థలతో పాటు ఇతర దేశాల దిగ్గజ సంస్థలను సంప్రదించినట్లు తెలిపింది. చైనా మొబైల్, చైనా యునికామ్, ఇంటెల్, రాడిసిస్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్‌స్పాన్, లెనొవొ, రూజీ నెట్వర్క్, విండ్‌రివర్ వంటి సంస్థలతో చర్చలు జరిపినట్లు ప్రకటించింది. -
రిలయన్స్ జియో మరో సంచలనం
ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్లతో టెలికాం ఇండస్ట్రీలో పెను సంచనాలు సృష్టించిన రిలయన్స్ జియో మరో వినూత్నానికి శ్రీకారం చుడుతోంది. తను జారీచేసే మొబైల్ నెంబర్లకు కొత్త సంఖ్యారూపాన్ని తీసుకొస్తోంది. 6-సిరీస్ తో నెంబర్లను జారీచేసేందుకు కంపెనీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వద్ద అనుమతి తీసుకుంది. ఈ అనుమతితో 6 సిరీస్‌లో మొబైల్ స్విచ్ఛింగ్ కోడ్‌ను జియో కస్టమర్లకు అలాట్ చేయనుంది. దీంతో ఆరు అంకెతో మొబైల్ నెంబర్లను ఆఫర్ చేసే తొలి టెలికాం ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో పేరొందనుంది. ఇప్పటికే ఆరు సిరీస్‌తో అస్సాం, రాజస్తాన్, తమిళనాడులో ఎంఎస్సీ కోడ్స్‌ను డీఓటీ రిలయన్స్ జియోకు జారీచేసిందట కూడా. రాజస్తాన్‌లో ఎంఎస్సీ కోడ్స్ 60010-60019, అస్సాంలో ఎంఎస్సీ కోడ్స్ 60020-60029, తమిళనాడులో ఎంఎస్సీ కోడ్స్ 60030-60039ను రిలయన్స్ జియో పొందిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్తగా ఒక మిలియన్ సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ కొత్త సిరీస్‌లో నెంబర్లను ఆఫర్ చేయడం ప్రారంభిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దేశీయ టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆపరేటర్లు 9,8,7 సిరీస్‌లో మొబైల్ నెంబర్లను ఆఫర్ చేస్తున్నాయి. కొత్తగా నెంబర్ సిరీస్‌కు జియో శ్రీకారం చుడుతుండటంతో 9,8,7 సిరీస్‌లకు డిమాండ్ తగ్గనుందని తెలుస్తోంది. దీంతో ఇవి కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట.