రిలయన్స్ జియో మరో సంచలనం
రిలయన్స్ జియో మరో సంచలనం
Published Mon, Feb 13 2017 1:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్లతో టెలికాం ఇండస్ట్రీలో పెను సంచనాలు సృష్టించిన రిలయన్స్ జియో మరో వినూత్నానికి శ్రీకారం చుడుతోంది. తను జారీచేసే మొబైల్ నెంబర్లకు కొత్త సంఖ్యారూపాన్ని తీసుకొస్తోంది. 6-సిరీస్ తో నెంబర్లను జారీచేసేందుకు కంపెనీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వద్ద అనుమతి తీసుకుంది. ఈ అనుమతితో 6 సిరీస్లో మొబైల్ స్విచ్ఛింగ్ కోడ్ను జియో కస్టమర్లకు అలాట్ చేయనుంది. దీంతో ఆరు అంకెతో మొబైల్ నెంబర్లను ఆఫర్ చేసే తొలి టెలికాం ప్రొవైడర్గా రిలయన్స్ జియో పేరొందనుంది. ఇప్పటికే ఆరు సిరీస్తో అస్సాం, రాజస్తాన్, తమిళనాడులో ఎంఎస్సీ కోడ్స్ను డీఓటీ రిలయన్స్ జియోకు జారీచేసిందట కూడా.
రాజస్తాన్లో ఎంఎస్సీ కోడ్స్ 60010-60019, అస్సాంలో ఎంఎస్సీ కోడ్స్ 60020-60029, తమిళనాడులో ఎంఎస్సీ కోడ్స్ 60030-60039ను రిలయన్స్ జియో పొందిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్తగా ఒక మిలియన్ సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ కొత్త సిరీస్లో నెంబర్లను ఆఫర్ చేయడం ప్రారంభిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దేశీయ టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆపరేటర్లు 9,8,7 సిరీస్లో మొబైల్ నెంబర్లను ఆఫర్ చేస్తున్నాయి. కొత్తగా నెంబర్ సిరీస్కు జియో శ్రీకారం చుడుతుండటంతో 9,8,7 సిరీస్లకు డిమాండ్ తగ్గనుందని తెలుస్తోంది. దీంతో ఇవి కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట.
Advertisement