
న్యూఢిల్లీ: అన్ని సర్కిళ్లలోనూ 5జీ విస్తరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. తదుపరి టెస్టింగ్ కోసం 10% సైట్లను టర్మ్ సెల్ ఎంపిక చేయనున్నట్లు టెలికం శాఖ (డాట్) వివరించాయి. వీటి ఫలితాలు వచ్చిన తర్వాత సేవల విస్తరణ నిబంధనలను పూర్తి చేసినట్లుగా సరి్టఫికెట్ జారీ అవుతుందని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా జూలై 7 నాటికి టెల్కోలు 2.81 లక్షల పైచిలుకు 5జీ టవర్లను (బీటీఎస్) ఏర్పాటు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ ఇటీవల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment