ఈపీఎఫ్ ఖాతాదారులకు విజ్ఞప్తి. ఖాతాదారులు ఇప్పటి వరకు అకౌంట్‌కి నామిని వివరాల్ని యాడ్ చేయకపోతే జత చేయండి అంటూ ఈపీఓవో సంస్థ కోరింది. అయితే ఇప్పుడు మనం ఈపీఎఫ్ అకౌంట్‌లో నామిని వివరాల్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం.
స్టెప్1:ఈపీఎఫ్‌ఓ వెబ్ సైట్‌లో లాగిన్ అవ్వాలి
స్టెప్2:మ్యానేజ్ బటన్‌పై క్లిక్ చేసి ఈ నామినేషన్ ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి
స్టెప్3: అండర్ ఫ్యామిలీ డిక్లరేషన్‌పై ఎస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
స్టెప్4: తర్వాత మీ నామిని డీటెయిల్స్ యాడ్ చేయాలి. నామినితో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేర్లను ఎంటర్ చేయండి
స్టెప్5: నామిని డీటెయిల్స్‌లో నామిని ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్, అడ్రస్, ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్, నామిని బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
స్టెప్6: అనంతరం యాడ్ రో ఆప్షన్ క్లిక్ చేస్తే ఇతర నామిని సభ్యుల వివరాల్ని ఎంటర్ చేయోచ్చు.
స్టెప్7: తర్వాత నామినికి ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారో (ఉదాహరణకు 100శాతం) ఎంటర్ చేయండి. ఒకవేళ నామినీలు ఒకరికంటే ఎక్కువగా ఉంటే పర్సెంటేజీల వారీగా యాడ్ చేయండి
స్టెప్8: వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీరు ఎంటర్ చేసిన వివరాలు సేవ్ అవుతాయి.
స్టెప్9: ఆ తర్వాత ఈ-సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆధార్‌తో లింకైన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటంది
ఎందుకు ఈపీఎఫ్ అకౌంట్‌కు ఈ నామినేషన్ ఫైల్ చేయాలంటే
ఖాతాదారుడు మరణిస్తే అతను/ఆమె అకౌంట్‌లో ఉన్న మొత్తం నామిని అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది
అదే ఖాతాదరుడు మరిణిస్తే పీఎఫ్‌తో పాటు రూ.7లక్షల వరకు ఇన్స్యూరెన్స్ క్లయిమ్ నామిని ఎవరైతే ఉంటారో వారికి చెందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment