E - Filing Portal
-
ఈపీఎఫ్‌లో ఈ-నామినేషన్ ఫైల్ చేశారా! లేదంటే మీకే నష్టం!
ఈపీఎఫ్ ఖాతాదారులకు విజ్ఞప్తి. ఖాతాదారులు ఇప్పటి వరకు అకౌంట్‌కి నామిని వివరాల్ని యాడ్ చేయకపోతే జత చేయండి అంటూ ఈపీఓవో సంస్థ కోరింది. అయితే ఇప్పుడు మనం ఈపీఎఫ్ అకౌంట్లో నామిని వివరాల్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. స్టెప్1:ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో లాగిన్ అవ్వాలి స్టెప్2:మ్యానేజ్ బటన్‌పై క్లిక్ చేసి ఈ నామినేషన్ ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి స్టెప్3: అండర్ ఫ్యామిలీ డిక్లరేషన్‌పై ఎస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. స్టెప్4: తర్వాత మీ నామిని డీటెయిల్స్ యాడ్ చేయాలి. నామినితో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేర్లను ఎంటర్ చేయండి స్టెప్5: నామిని డీటెయిల్స్‌లో నామిని ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్, అడ్రస్, ఐఎఫ్ఎస్ఈ కోడ్, నామిని బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. స్టెప్6: అనంతరం యాడ్ రో ఆప్షన్ క్లిక్ చేస్తే ఇతర నామిని సభ్యుల వివరాల్ని ఎంటర్ చేయోచ్చు. స్టెప్7: తర్వాత నామినికి ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారో (ఉదాహరణకు 100శాతం) ఎంటర్ చేయండి. ఒకవేళ నామినీలు ఒకరికంటే ఎక్కువగా ఉంటే పర్సెంటేజీల వారీగా యాడ్ చేయండి స్టెప్8: వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీరు ఎంటర్ చేసిన వివరాలు సేవ్ అవుతాయి. స్టెప్9: ఆ తర్వాత ఈ-సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆధార్‌తో లింకైన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటంది ఎందుకు ఈపీఎఫ్ అకౌంట్‌కు ఈ నామినేషన్ ఫైల్ చేయాలంటే ఖాతాదారుడు మరణిస్తే అతను/ఆమె అకౌంట్లో ఉన్న మొత్తం నామిని అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది అదే ఖాతాదరుడు మరిణిస్తే పీఎఫ్‌తో పాటు రూ.7లక్షల వరకు ఇన్స్యూరెన్స్ క్లయిమ్ నామిని ఎవరైతే ఉంటారో వారికి చెందుతుంది. -
ఈ - ఫైలింగ్ పోర్టల్‌లో అవాంతరాలు
న్యూఢిల్లీ: పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్ల ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చే ఉద్దేశ్యంతో ఆదాయపన్ను శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక అంతరాలు దర్శనమిచ్చాయి. దీనిపై యూజర్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ట్విట్టర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అంతరాయాలను సరిచేయాలంటూ ఇన్ఫోసిస్, ఆ సంస్థ సారథి నందన్‌నీలేకనిని మంత్రి కోరారు. ‘‘అంతరాయాల విషయమై నా టైమ్‌లైన్‌పై ఫిర్యాదులను చూశాను. ఇన్ఫోసిస్, నందన్ నీలేకని మన పన్ను చెల్లింపుదారులకు నాణ్యమైన సేవలను అందించే విషయంలో నిరాశపరచదని భావిస్తున్నాను’’ అంటూ మంత్రి ట్వీట్ చేశారు. పన్ను చెల్లింపుదారులకు నిబంధనల అమలును సులభంగా మార్చడమే తమ ప్రాధాన్యమని మంత్రి చెప్పారు. నూతన ఈ–ఫైలింగ్ పోర్టల్ ఈ నెల 7న ప్రారంభమైంది. దీన్ని రూపొందించే కాంట్రాక్ట్‌ను 2019లో ఇన్ఫోసిస్ సొంతం చేసుకుంది. జీఎస్టీ నెట్వర్క్ పోర్టల్‌ను అభివృద్ధి చేసిందీ ఇన్ఫోసిస్ కావడం గమనార్హం. చదవండి: ప్రముఖ వెబ్సైట్ల సర్వర్ డౌన్ -
ఎన్నారైలు...ట్యాక్స్ రిటర్నులు
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) విదేశాల్లో ఆర్జించిన ఆదాయంపై భారత్‌లో పన్ను ఉండదు. కానీ, కొందరు ఎన్నారైలకు తమ స్వదేశంలో డిపాజిట్లు, అద్దెల రూపంలో ఆదాయాలుంటాయి. ఇలాంటి ఆదాయం వార్షిక పరిమితి రూ.2 లక్షలు మించితే వారు విదేశాల్లో నివసిస్తున్నా ఇక్కడ కూడా ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. డిపాజిట్లు, అద్దెలే కాకుండా షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటిలోనూ లాభాలొస్తే వాటికీ పన్ను చెల్లించాలి. ఎన్నారైలు రిటర్నులు దాఖలు చేయడానికి గడువు జూలై 31. రిటర్నుల దాఖలుకు ముందు ఎన్నారైలు గమనించాల్సిన కొన్ని అంశాలివీ... రిటర్నులు ఎప్పుడు దాఖలు చేయాలంటే.. ఇండియాలో ఆదాయం బేసిక్ మినహాయింపు పరిమితిని మించినపుడు; చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ డిడక్ట్ చేసినపుడు; మూలధన నష్టాల(క్యాపిటల్ లాస్)కు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కారానికి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను విధించదగిన ఆదాయం విషయంలో వ్యక్తులకు కొన్ని మినహాయింపులుంటాయి. కొన్ని రకాల పెట్టుబడులు, గృహ రుణంలో అసలును చెల్లించడం మొదలైనవి. ఈ మినహాయింపులు ఎన్నారైలకు కూడా వర్తిస్తాయి. దాఖలు చేసిన ట్యాక్స్ రిటర్నుల నుంచి రిఫండ్ కోసం బ్యాంకు అకౌంటు నంబరు, బ్రాంచ్ ఎంఐసీఆర్ కోడ్ వంటి మీ బ్యాంకు వివరాలను లోపరహితంగా అందించాలి. ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేసినపుడు రిఫండ్ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగిపోతుంది. ఆదాయ పన్ను శాఖ వారి ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఎన్నారైలు తమ రిటర్నులను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ట్యాక్స్ అడ్వైజర్ల సహాయాన్ని వారు పొందవచ్చు. లేదంటే ప్రైవేట్, పెయిడ్ ఈ-ఫైలింగ్ పోర్టల్స్ ద్వారానూ రిటర్నులు పంపవచ్చు. ఎన్నారైలకు సంబంధించి... భారత్‌లో వారి ఆదాయమంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్, పెట్టుబడులపై ఆదాయం మాత్రమే ఉంటాయి. మినహాయింపు పరిమితిలోపు ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఆదాయ స్థానంలోనే పన్ను తగ్గింపు జరిగినా రిటర్నులు సమర్పించనక్కర్లేదు.