CBT meeting
-
ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్మెంట్లో మారిన నిబంధనలు.. అవేంటో మీకు తెలుసా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఖాతాదారులు ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకునే మొత్తం నగదుపుపై వడ్డీ, ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకునే సమయంపై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది.కేంద్ర కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) పాలక మండలి సమావేశం ఈ ఏడాది నవంబర్ 30న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈపీఎఫ్ఓ సభ్యులకు లబ్ధి చేకూరేలా కొత్త నిబంధనను అమల్లోకి తేనున్నట్లు వెల్లడించింది.ఈ కొత్త నిబంధనతో ఈపీఎఫ్ఓ అధిక మొత్తంలో వడ్డీతో పాటు క్లయిమ్ సెటిల్మెంట్ వేగవంతం చేసుకోవచ్చని సూచించింది.ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు ఈపీఎఫ్‌వో ప్రకటన ప్రకారం.. సీబీటీ ఈపీఎఫ్ స్కీమ్ 1952లోని పేరా 60(2)(బి)లోని నిబంధనలను సవరణకు ఆమోదించింది. దీంతో ఈపీఎఫ్‌వో ఖాతాదారులు తమ పీఎఫ్ క్లయిమ్ సెటిల్ అయ్యిందో ఆ తేదీ వరకు వడ్డీని పొందవచ్చు.ఉదాహరణకు..ఓ సంస్థలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత, అంటే డిసెంబర్ నెలలో తన పీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకున్నారు. పీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసిన మొత్తం డిసెంబర్ 20న అకౌంట్లో జమ అయ్యిందని మెసేజ్ వచ్చింది. అయితే, ఆ క్లయిమ్ సెటిల్ చేసిన మొత్తంపై ఈపీఎఫ్ అందించే 8.25 శాతం వడ్డీ పొందడం సాధ్యం కాదు. నవంబర్ నెల వరకు మాత్రమే సెటిల్మెంట్పై వడ్డీ వర్తిస్తుందని, డిసెంబర్ 1 నుండి 20 వరకు ఈపీఎఫ్ సెటిల్పై వడ్డీ కోల్పోయే పరిస్థితి ఉంది.కానీ ఇప్పుడు ఈపీఎఫ్‌వో తాజా మార్పుల ద్వారా, ఆ 20 రోజుల వడ్డీ కూడా సురేష్ అందుకోగలుగుతారు. దీని ద్వారా సురేష్ వంటి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరట లభించిందిదీంతో పాటు ఓ ఉద్యోగి తన సంస్థకు రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత మూడో నెలలో 24వ తేదీకి లోపు ఈపీఎఫ్‌వో క్లయిమ్ సెటిల్మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లయిమ్ ప్రాసెస్ జరగదు. 25వ తేదీ నుంచి నెల చివరి వరకు వడ్డీ నష్టపోవడం, అలాగే క్లయిమ్ సెటిల్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. అయితే, ఇప్పుడు 25వ తేదీ తర్వాత కూడా క్లయిమ్ సెటిల్ ప్రాసెస్ జరిగేలా ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. -
మార్చిలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లపై సీబీటీ కీలక సమావేశం..!
ఈపీఎఫ్ఓకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వచ్చే నెలలో గౌహతిలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో 22021-22కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ 5 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత మార్చి రెండో వారంలో గౌహతిలో సమావేశం కానుంది. వడ్డీ రేటు, కొత్త ఉత్పత్తులలో పెట్టుబడి తదితర విషయాల గురించి సమావేశంలో చర్చించనుంది. 2020-21లో పీఎఫ్ డిపాజిట్ల వడ్డీ రేటును నిర్ణయించిన విధంగా 2021-22కు 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అందిస్తుందా అని మీడియా అడిగినప్పుడు కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిస్తూ.. ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనా ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 2020-21 నాటికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీరేటును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 2021 మార్చిలో నిర్ణయించింది. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2021లో ఆమోదించింది. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ 2020-21కు వడ్డీ ఆదాయాన్ని 8.5 శాతంగా చందాదారుల ఖాతాలోకి క్రెడిట్ చేయాలని ప్రాంత కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును సీబీటీ నిర్ణయించిన తర్వాత, ఈ వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ మేరకు ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును చందాదారుల ఖాతాలో జమ చేస్తుంది. (చదవండి: విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏసియా శుభవార్త..!) -
రైలు టికెట్‌పై పది పైసల సెస్!
కేంద్ర ప్రభుత్వ యోచన న్యూఢిల్లీ: రైల్వే టికెట్‌పై కొత్తగా పది పైసలు సెస్‌గా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధంగా వచ్చిన ఆదాయంతో రైల్వే శాఖలో పనిచేసే సుమారు 20 వేల మంది కూలీలను సామాజిక రక్షణ పథకాల పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. రైల్వే శాఖ 58 శాతం రిజర్వ్డ్ టికెట్లతో సహా ప్రతిరోజూ 10 – 12 లక్షల టికెట్లను విక్రయిస్తుంది. పది పైసలు సెస్ ద్వారా ప్రతిరోజూ సుమారు రూ. 1.2 లక్షలు.. ఏడాదికి సుమారు 4.38 కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిధులు కూలీలకు పీఎఫ్, పింఛన్, సామూహిక బీమా తదితర సదుపాయాల కల్పనకు సరిపోతాయని భావిస్తోంది. సెస్ ద్వారా కూలీలకు సామాజిక రక్షణ పథకాలు వర్తింప జేయాలని గత నెల 19న బెంగళూరులో జరిగిన సీబీటీ సమావేశంలో ప్రతి పాదించారు. రాబోయే బడ్జెట్లో సెస్ విధింపు ప్రకటన ఉండవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ ఆశాభావంతో ఉంది. తేజస్ రైళ్లలో సంజీవ్ కపూర్ వంటకాలు ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న తేజస్ రైళ్లలో ప్రయాణికులకు పాకశాస్త్ర నిపుణుడు సంజీవ్ కపూర్ రూపొందించిన వంటకాలను వడ్డించనున్నారు.