దత్తన్న ప్రొటోకాల్ వివాదం: ఏసీపీపై వేటు
సాక్షి, హైదరాబాద్: మహంకాళి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రొటోకాల్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్‌రావుపై బదిలీ వేటు పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
దత్తాత్రేయ వాహనాలను నిలిపివేసినందుకు గాను బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర మంత్రి ప్రొటోకాల్‌ను పాటించకుండా పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై దుమారం రేగింది. ఈ వ్యవహారంపై నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి అదనపు కమిషనర్ వీవీ శ్రీనివాస్‌రావుతో విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలో గోపాలపురం ఏసీపీని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఆదేశాలు వెలువడినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి