సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తనపై.. ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో.. రాజ్‌భవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ వివాదంపైనా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘నేను ఎక్కడ ఉన్నా తెలంగాణతో బంధం మరిచిపోను. నేను సవాళ్లకు, పంతాలకు భయపడే వ్యక్తిని కాను. నా బాధ్యతలు, విధులను సమర్థవంతగా నిర్వర్తిస్తూ.. తెలంగాణలో గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్నా. అలాగే.. నేను కోర్టు కేసులకు, విమర్శలకు భయపడే రకం కాదు. ప్రొటోకాల్ ఉల్లంఘనతో నన్ను కట్టడి చేయలేరు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా. ప్రజల విజయమే నా విజయం అంటూ వ్యాఖ్యానించారామె.
► నేను రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం.. కొట్లాడే ఉద్దేశం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ లీడర్.. పవర్ ఫుల్ నేత. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నేను చూస్తున్నా. రాజ్‌భవన్‌కి, ప్రగతి భవన్‌కు గ్యాప్ లేదు. సీఎంతో ఎలాంటి దూరం లేదు. దూరం గురించి నేను పట్టించుకోను. నా దారి నాదే.
► ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది. కానీ, గవర్నర్ ఆఫీస్‌కు కొంత లిమిట్ ఉంది. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయాలని ఉన్నా.. నిధుల కొరత ఉంది. నాకు పొలిటికల్ ఎజెండా లేదు.. ప్రజలకు సేవ చేయడం తప్ప. నాది మోసం చేసే తత్వం కాదు. నాది కన్నింగ్ మెంటాల్టి కాదు.. పేదలకు ఏదో చేయడం తప్ప. పీపుల్ ఫ్రెండ్లీ గవర్నర్ గా ఉండాలని అనుకుంటా అంతే.
► తెలంగాణ బర్త్ డే- నా బర్త్ డే ఒకేరోజు. నా మైండ్ లో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ఉంటుంది. నా కుటుంబ నేపథ్యం అంతా రాజకీయాలు మాత్రమే. నేను గౌరవం కోసం కొట్లాడే వ్యక్తిని కాదు.. నిరంతరం సంతోషంగా ఉండే వ్యక్తిని. పుదిచ్చేరికి కూడా గవర్నర్ గా ఉన్నా.. తెలంగాణ ప్రజల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. అడ్మిస్టేషన్ పరంగా రెండు రాష్ట్రాలకూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. ఇక్కడ జిల్లాలకు వెళ్తే ఐఏఎస్ అధికారులు రారు. కానీ, పుదుచ్చేరిలో సీఎస్ సహా చాలా మందిని పర్యవేక్షిస్తున్నాను. నాకు గౌరవం ఇస్తారా.. నా పనిని గుర్తిస్తారా? అనేది నాకు అవసరం లేదు.
► ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగింది. నేను ఆర్టీసీ కార్మికుల లబ్ధికోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కేటగిరి పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి అర్హత ఫీల్ చేస్తే.. సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.
► మెడికల్ కాలేజీల వ్యవహారంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరిగింది. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి. మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి కేంద్రం అడిగిన సమయంలో రాష్ట్రం స్పందించలేదనే విషయాన్ని కేంద్రం చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా మెడికల్ కాలేజీలు కేంద్రం ఇచ్చింది.
అంతకుముందు.. తెలుగులో స్పీచ్ మొదలు పెట్టిన గవర్నర్ తమిళిసై, తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా పనిచేయడం ఎంతో గౌరవంగా ఉందని పేర్కొన్నారు. గవర్నర్ గా తనకు అవకాశం కల్పించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
‘‘నా మొదటి సంవత్సరంలోనే కోవిడ్ ఛాలెంజ్ ఎదుర్కొన్నాం. తెలంగాణ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అందిచడం ఒక ప్రాధాన్యత ఉండేది. దోనెట్ డివైజ్ తో పేద విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు అందించాం. మహిళా గవర్నర్ గా మహిళ సాధికారత అందించడం మరో ఛాలెంజ్. గిరిజన మహిళల ఆరోగ్యం పై నేను దృష్టి పెట్టాను. గిరిజన మహిళల్లో రక్తహీనత ఎంత బాధను కలిగించింది. గిరిజన గ్రామాల్లో పోషకాలు, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం జరిగింది అని తెలిపారామె. అలాగే రాజ్‌భవన్ తరపు ఘనతలను కూడా ఆమె చదివి వినిపించారు.
నాకు, తెలంగాణకు మధ్య దేవుడు ఇచ్చిన బంధం ఉంది అంతే. ఇంకో 30, 40 ఏళ్ళ పాటు ఇదే రకంగా ఉంటాను అంటూ భావోద్వేగంగా మాట్టాడారామె.
ఇదీ చదవండి: ఆయనంతే అదో టైప్!
Comments
Please login to add a commentAdd a comment