protocol issue
-
సర్కార్‌తో కొట్లాడే ఉద్దేశం లేదు: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తనపై.. ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో.. రాజ్‌భవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ వివాదంపైనా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఎక్కడ ఉన్నా తెలంగాణతో బంధం మరిచిపోను. నేను సవాళ్లకు, పంతాలకు భయపడే వ్యక్తిని కాను. నా బాధ్యతలు, విధులను సమర్థవంతగా నిర్వర్తిస్తూ.. తెలంగాణలో గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్నా. అలాగే.. నేను కోర్టు కేసులకు, విమర్శలకు భయపడే రకం కాదు. ప్రొటోకాల్ ఉల్లంఘనతో నన్ను కట్టడి చేయలేరు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా. ప్రజల విజయమే నా విజయం అంటూ వ్యాఖ్యానించారామె. ► నేను రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం.. కొట్లాడే ఉద్దేశం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ లీడర్.. పవర్ ఫుల్ నేత. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నేను చూస్తున్నా. రాజ్‌భవన్‌కి, ప్రగతి భవన్‌కు గ్యాప్ లేదు. సీఎంతో ఎలాంటి దూరం లేదు. దూరం గురించి నేను పట్టించుకోను. నా దారి నాదే. ► ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది. కానీ, గవర్నర్ ఆఫీస్‌కు కొంత లిమిట్ ఉంది. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయాలని ఉన్నా.. నిధుల కొరత ఉంది. నాకు పొలిటికల్ ఎజెండా లేదు.. ప్రజలకు సేవ చేయడం తప్ప. నాది మోసం చేసే తత్వం కాదు. నాది కన్నింగ్ మెంటాల్టి కాదు.. పేదలకు ఏదో చేయడం తప్ప. పీపుల్ ఫ్రెండ్లీ గవర్నర్ గా ఉండాలని అనుకుంటా అంతే. ► తెలంగాణ బర్త్ డే- నా బర్త్ డే ఒకేరోజు. నా మైండ్ లో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ఉంటుంది. నా కుటుంబ నేపథ్యం అంతా రాజకీయాలు మాత్రమే. నేను గౌరవం కోసం కొట్లాడే వ్యక్తిని కాదు.. నిరంతరం సంతోషంగా ఉండే వ్యక్తిని. పుదిచ్చేరికి కూడా గవర్నర్ గా ఉన్నా.. తెలంగాణ ప్రజల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. అడ్మిస్టేషన్ పరంగా రెండు రాష్ట్రాలకూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. ఇక్కడ జిల్లాలకు వెళ్తే ఐఏఎస్ అధికారులు రారు. కానీ, పుదుచ్చేరిలో సీఎస్ సహా చాలా మందిని పర్యవేక్షిస్తున్నాను. నాకు గౌరవం ఇస్తారా.. నా పనిని గుర్తిస్తారా? అనేది నాకు అవసరం లేదు. ► ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగింది. నేను ఆర్టీసీ కార్మికుల లబ్ధికోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కేటగిరి పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి అర్హత ఫీల్ చేస్తే.. సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ► మెడికల్ కాలేజీల వ్యవహారంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరిగింది. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి. మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి కేంద్రం అడిగిన సమయంలో రాష్ట్రం స్పందించలేదనే విషయాన్ని కేంద్రం చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా మెడికల్ కాలేజీలు కేంద్రం ఇచ్చింది. అంతకుముందు.. తెలుగులో స్పీచ్ మొదలు పెట్టిన గవర్నర్ తమిళిసై, తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా పనిచేయడం ఎంతో గౌరవంగా ఉందని పేర్కొన్నారు. గవర్నర్ గా తనకు అవకాశం కల్పించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘నా మొదటి సంవత్సరంలోనే కోవిడ్ ఛాలెంజ్ ఎదుర్కొన్నాం. తెలంగాణ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అందిచడం ఒక ప్రాధాన్యత ఉండేది. దోనెట్ డివైజ్ తో పేద విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు అందించాం. మహిళా గవర్నర్ గా మహిళ సాధికారత అందించడం మరో ఛాలెంజ్. గిరిజన మహిళల ఆరోగ్యం పై నేను దృష్టి పెట్టాను. గిరిజన మహిళల్లో రక్తహీనత ఎంత బాధను కలిగించింది. గిరిజన గ్రామాల్లో పోషకాలు, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం జరిగింది అని తెలిపారామె. అలాగే రాజ్‌భవన్ తరపు ఘనతలను కూడా ఆమె చదివి వినిపించారు. నాకు, తెలంగాణకు మధ్య దేవుడు ఇచ్చిన బంధం ఉంది అంతే. ఇంకో 30, 40 ఏళ్ళ పాటు ఇదే రకంగా ఉంటాను అంటూ భావోద్వేగంగా మాట్టాడారామె. ఇదీ చదవండి: ఆయనంతే అదో టైప్! -
ప్రొటోకాల్ అనేది విశేషాధికారం కాదు: సీజేఐ
ఢిల్లీ: న్యాయమూర్తుల ప్రొటోకాల్ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేం విశేషాధికారం కాదని.. ఆ సౌకర్యాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడమూ సరికాదని, తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో గౌరవమూ తగ్గిపోతుందన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు తన అభిప్రాయంతో కూడిన లేఖలు రాశాయన. తీర్పులతోనే కాదు.. ప్రొఫెషనల్ ఆటిట్యూడ్‌తోనూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తరచూ వార్తల్లో నిలుస్తుండడం చూస్తున్నాం. సుప్రీం కోర్టు కఫేటేరియాను సందర్శించడం, న్యాయస్థానం కార్యాలయాల పని తీరుతో పాటు అక్కడ పని చేసే వాళ్ల పోస్టుల పేర్లను మార్చాలని(పారిశుద్ధ్య కార్మికులతో సహా) ప్రతిపాదించడం లాంటి చర్యలతో ప్రశంసలు అందుకున్నారాయన. ఈ క్రమంలో.. తాజాగా ఓ హైకోర్టు న్యాయమూర్తి తనకు రైలు ప్రయాణంలో ఎదురైన ఇబ్బందికర అనుభవం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సదరు రీజినల్ రైల్వే మేనేజర్ నుంచి కోర్టు రిజిస్ట్రార్ ద్వారా వివరణ కోరడం తెలిసే ఉంటుంది. ఈ పరిణామంపై స్పందించే క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్.. పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాశారు. రైల్వే సిబ్బందిపై హైకోర్టుకు “క్రమశిక్షణా పరిధి’’ ఉండదని అని సీజేఐ డీవై చంద్రచూడ్ లేఖల్లో న్యాయమూర్తులకు గుర్తు చేశారు. అలాగే.. ప్రొటోకాల్ అనేది విశేషాధికారం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారాయన. ఈ క్రమంలో న్యాయవ్యవస్థలో స్వీయ ప్రతిబింబం, కౌన్సెలింగ్ అవసరమంటూ అభిప్రాయపడ్డారాయన. ‘‘న్యాయమూర్తులు తమకు అందుబాటులో ఉన్న ప్రొటోకాల్ సౌకర్యాలు ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ, ఆ సమాజం నుంచి వాళ్లను వేరే చేసే విధంగా.. లేదంటే తమను తాము ప్రత్యేక వ్యక్తిగా చూపించుకునే ప్రయత్నం చేయకూడదు. కోర్టుల్లోనే కాదు.. బయటా న్యాయపరమైన అధికారాన్ని తెలివిగా అమలు చేయాలి. తద్వారా న్యాయవ్యవస్థపై విశ్వసనీయత, చట్టబద్ధతను.. అలాగే న్యాయమూర్తుల సమాజ గౌరవం నిలబడుతుంది. అంతేగానీ.. ఆ సౌకర్యాలతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అలాగే.. న్యాయవ్యవస్థపై బహిరంగ విమర్శలు చేసేందుకు దారి తీయకూడదు. నా ఈ అభిప్రాయాలను తెలియజేస్తున్నానని.. ఇక మీ అభిప్రాయాలను తనతో పంచుకోవాల’’ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరారాయన. అలహాబాద్ హైకోర్టు జడ్జి గౌతమ్ చౌదరి తాజాగా రైలు ప్రయాణంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. తన భార్యతో కలిసి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న సమయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైందట. రైలు ఆలస్యంతో పాటు సమయానికి భోజనం దొరక్కపోవడం లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారట. ఆ సమయంలో ఆయన రైల్వే పోలీసులు, రైల్వే సిబ్బంది నుంచి బదులు కోసం చూడగా.. ఫలితం లేకుండా పోయిందట. దీంతో న్యాయమూర్తి అనే తన గౌరవానికి భంగం వాటిల్లిందటూ ఆయన ప్రయాగ్‌రాజ్‌లోని నార్త్ సెంట్రల రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌ను వివరణ కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా లేఖ పంపించారు. ఇదీ చదవండి: ఇదేంది ఇది.. 100 పేజీల తీర్పు కాపీనా? -
మేము కిషన్ రెడ్డికి ఫోన్ చేశాం: తలసాని
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కిషన్ రెడ్డిని ఆహ్వానించామని, అయితే ఈ విషయంపై ఆయన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో స్థిరపడేవాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శనివారం మంత్రి తలసాని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ’హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ శ్రద్ధ వహించి మెట్రో పూర్తి చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రూ.12,500 కోట్ల అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి మేం ప్రోటోకాల్ పాటించాం. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రారంభోత్సవం ముందు రోజే ఫోన్ చేసి చెప్పాం. తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని చెప్పారు. అయిపోయిన తర్వాత సాయంత్రం వరకైనా రావాలని చెప్పాం. మొదటి కారిడార్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు కదా అయినా అది మా పార్టీ కార్యక్రమం కాదు. ప్రోటోకాల్ విషయంలో ఎవరిని కించపరచాలని మాకు లేదు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తారో చెప్పండి. మీ గౌరవమే పెరుగుతుంది. (మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ ఫైన్) లక్ష్మణ్ వల్ల ఒక్క ఉపయోగం కూడా లేదు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కొంచెం అతిగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా రెండో స్థానమే అంటున్నారు. ప్రతిసారి బొక్కబోర్లా పడుతున్నారు. బీజేపీకి లక్ష్మణ్ వల్ల ఒక్క ఉపయోగం లేదు. పాతబస్తీలో అభివృద్ధిపై వివరాలు ఇస్తాం. పాతబస్తీలో మీ పార్టీ బలోపేతానికి కృషి చేసుకోండి. చేతగాని రాష్ట్ర నాయకత్వంతో ఇలాంటివే ఎదురు అవుతాయి. 2014 నుంచి ఇప్పటివరకూ ప్రతి ఎన్నికల్లో ఓటమే. ప్రధాని ఫోటోలు లేవనడం అవాస్తవం.అనవసర ఆరోపణలు చేయొద్దు. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఎక్కడ గెలిచారో చెప్పాలి. ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదు’ అని మండిపడ్డారు. కాగా జీహెచ్ఎంసీ జరిమానాపై మంత్రి మాట్లాడుతూ ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలు పెట్టారని, అయితే ఎక్కడెక్కడ పెట్టారో తనకు పూర్తిగా తెలియదన్నారు. జీహెచ్ఎంసీ వేసిన ఫైన్ రూ.5వేలు కట్టినట్లు తలసాని తెలిపారు. -
కాబోయే సీఎంను.. మీ సంగతి చూస్తా
మూసాపేట: వచ్చేది మా ప్రభుత్వమే.. కాబోయే సీఎంను.. అందరి లెక్కలు తీస్తున్నా.. మీ సంగతి చూస్తా అంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి వైపు వేలు చూపిస్తూ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆహ్వానం పంపలేదని కలెక్టర్‌పై చిందులు తొక్కారు. దీంతో కలత చెందిన కలెక్టర్ సభలో మొహం చిన్నబుచ్చుకున్నారు. కూకట్పల్లి వైజంక్షన్‌లో శనివారం నిర్వహించిన అంబేడ్కర్ జయంత్యుత్సవాల సభ ఈ వివాదానికి వేదికైంది. సభ కొనసాగుంతుండగా వేదిక వద్దకు సర్వే వచ్చారు. ఆ సమయంలో కలెక్టర్ ప్రసంగిస్తుండగా దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు నపారి చంద్రశేఖర్ స్టేజీపైకి పిలవడంతో సర్వే వెళ్లి ఆసీనులయ్యారు. కలెక్టర్ ప్రసంగం ముగియడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో మెట్రో ఎండీ మాట్లాడుతుండగా మధ్యలో సర్వే సత్యనారాయణ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. కలెక్టర్ స్పందిస్తూ ఇది అధికారిక కార్యక్రమం అని, ప్రొటోకాల్ ప్రకారం పిలిచినట్లు చెప్పారు. అధికారిక కార్యక్రమం అయితే ప్రభుత్వ పథకాలు ఎందుకు చెబుతున్నావంటూ సర్వే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంవీ రెడ్డి ప్రతిస్పందిస్తుండగానే.. ‘నో మోర్ ఆరగ్యమెంట్.. మా ప్రభుత్వం వస్తే నేనే సీఎం’ అంటూ వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో సర్వేను మాట్లాడాల్సిందగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనకు మైక్‌ను అందించారు. సర్వే సత్యనారాయణ మైక్‌ను అందుకుంటూనే.. ‘అందరి లెక్కలు తీస్తున్నా.. మీ సంగతి చూస్తా’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. బీజేపీ దళితుల పట్ల వివక్ష చూపిస్తోందని, ఇలాగే చేస్తే దళికిస్తాన్ అని ప్రత్యేక దేశం కోరుతాం.. ఖబడ్దార్ మోదీ అని హెచ్చరిస్తుండగా.. దళిత ఐక్యవేదిక అధికార ప్రతినిధి కట్టా నర్సింగరావు కల్పించుకుని ఇది పార్టీ సమావేశం కాదని, అంబేడ్కర్ గురించి చెప్పాలని చేతులు జోడించి వేడుకున్నారు. దీంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కల్పించుకుని రాజకీయాలు మాట్లాడవద్దని కలెక్టర్‌కు సూచించిన మీరే రాజకీయాలు మాట్లాడితే ఎలా అంటూ సర్వేను ప్రశ్నించారు. సభను తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంపై సర్వేను ఎమ్మెల్యే నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు సైతం వేదికపైకి చేరడంతో సభ రసాభాసగా మారింది. తోపులాటలో కలెక్టర్‌కు రక్షణగా నిల్చొన్న ఆర్ఐ అశ్విన్‌కుమార్ ముక్కుకు గాయాలయ్యాయి. మైక్‌లు విరిగిపోయాయి. దీంతో డీసీపీ వెం కటేశ్వర్‌రావు, ఏసీపీ భుజంగరావు వేదికపైకి చేరుకున్న దళిత నాయకులను, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులను అదుపు చేసి వివాదం సద్దుమణిగేలా చూశారు. తనను అకారణంగా దూషించడంతో కలత చెందిన కలెక్టర్ రెండు చేతులు జోడించి సర్వేకు మొక్కి కంటతడి పెట్టుకుంటూ సభలోంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సర్వే సత్యనారాయణ నిష్క్రమించారు. అందరూ వెళ్లిపోవడంతో సభ అర్ధంతరంగా ముగిసింది. సర్వేపై కేసు నమోదు.. కేపీహెచ్‌బీ కాలనీ: ఈ ఘటనపై తహసీల్దార్ నాగరాజు ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వడ్డే ప్రసన్నకుమార్ తెలిపారు. కూకట్‌పల్లిలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ఎంవీ రెడ్డితో సర్వే సత్యనారాయణ వాగ్వాదానికి దిగారని, కలెక్టర్‌కు రక్షణగా వచ్చిన తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ అశ్విన్కుమార్లపై దాడికి పాల్పడ్డారని తహసీల్దార్ ఫిర్యాదు మేరకు సర్వే సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘సర్వే’పై చర్యలు తీసుకోండి: రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్ కేపీహెచ్‌బీకాలనీ: మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని మేడ్చల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శనివారం సర్వే సత్యనారాయణ చర్యలను నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. కూకట్‌పల్లిలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ఎంవీ రెడ్డిపై దుర్భాషలాడటం, బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆర్ఐపై అకారణంగా చేయి చేసుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వే సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏసీపీ భుజంగరావు, సీఐ ప్రసన్నకుమార్‌లకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతంకుమార్, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు. -
దత్తన్న ప్రొటోకాల్ వివాదం: ఏసీపీపై వేటు
సాక్షి, హైదరాబాద్: మహంకాళి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రొటోకాల్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్‌రావుపై బదిలీ వేటు పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దత్తాత్రేయ వాహనాలను నిలిపివేసినందుకు గాను బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర మంత్రి ప్రొటోకాల్‌ను పాటించకుండా పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై దుమారం రేగింది. ఈ వ్యవహారంపై నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి అదనపు కమిషనర్ వీవీ శ్రీనివాస్‌రావుతో విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలో గోపాలపురం ఏసీపీని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఆదేశాలు వెలువడినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ఆగ్రహం
అడ్డతీగల : అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అధికారులపై ధ్వజమెత్తారు. రూ.పది లక్షల ఐఏపీ నిధులతో అడ్డతీగలలో నిర్మించిన గ్రంథాలయ భవనానికి జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు మంగళవారం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అధికారుల వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఆహ్వాన పత్రికలో పేర్ల ముద్రింపులో నిబంధనలు పాటించలేదన్నారు. భవన ప్రారంభోత్సవ విషయంపై తమకు తగిన సమాచారం ఇవ్వలేదన్నారు. శిలాఫలకంపై అడ్డతీగల సర్పంచ్‌కు, ఎమ్మెల్యే అయిన తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహరించారన్నారు. అధికారుల ప్రొటోకాల్ ఉల్లంఘనపై తాను శాసనసభలో ప్రస్తావిస్తానన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ అమలయ్యేలా చూడాల్సిన డీఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అన్ని పనులకూ తమ సేవలు వినియోగించుకున్న అధికారులు ప్రారంభోత్సవంలో మాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానించడం దారుణమని అడ్డతీగల సర్పంచ్ పప్పుల చిట్టమ్మ అన్నారు. అధికారులది పొరబాటే.. అధికారులు ఈ విషయంలో పొరపాటు చేశారని, మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీరారెడ్డి అన్నారు. -
ప్రోటోకాల్‌పై మాటామాటా
అరుపులు, కేకలతో దద్దరిల్లిన జెడ్పీ సమావేశం చర్చించాలన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అక్కర్లేదన్న హోంమంత్రి రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు సమస్యలు పరిష్కారం కానప్పుడు మేము రావడమెందుకన్న జెడ్పీటీసీలు కాకినాడ రూరల్ :నిధులు, విధులు, ప్రొటోకాల్ అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అరుపులు, కేకలతో దద్ధరిల్లింది. సోమవారం జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జీఎంసీ బాలయోగి సమావేశ హాలులో జరిగింది. ప్రధాన సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అవి అలాగే మిగిలిపోతున్నాయని, తమను మండలాల్లో ఏ అధికారులూ లెక్క చేయడంలేదని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు సమస్యలు ప్రస్తావిస్తుంటే ఇంకొకరు లేచి మాట్లాడడంతో ఒక దశలో సమావేశం గందరగోళంగా మారింది. జెడ్పీటీసీ సభ్యులు తమ గ్రామాల్లో సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని యత్నించగా ఉపముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప వారిపై కన్నెర్ర చేసి కూర్చోండంటూ కేకలు వేసి మరీ కూర్చోబెట్టారు. సమస్యలు పరిష్కారం కానప్పుడు, ఇబ్బందులు చెప్పుకునే అవకాశం లేనప్పుడు తాము సమావేశాలకు రావడం ఎందుకంటూ పలువురు మహిళా జెడ్పీటీసీ సభ్యులు అధికారులను, జెడ్పీ చైర్మన్‌ను నిలదీశారు. అమరవీరులకు నివాళి సభ ప్రారంభానికి ముందుగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాద దాడిలో అమరులైన సైనికులకు సంతాపం తెలపాలని కోరడంతో సభ ఏకగ్రీవంగా అంగీకరించింది. దీంతో అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ గతంలో 13వ ఆర్థిక సంఘం గ్రాంటు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలకు వేరువేరుగా కేటాయించినట్టు కాకుండా 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామపంచాయతీలకే కేటాయించడం, ఇసుక నూతన విధానం వల్ల సీనరేజ్ ఆదాయం లేకపోవడం వల్ల జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల అభివృద్ధి పనులకు నిధుల కొరత ఎదురైందన్నారు. గతంలో మాదిరిగానే జిల్లాపరిషత్, మండల పరిషత్‌లకు నిధులు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. గ్రామపంచాయతీల్లో మరణించిన, పదవీ విరమణ చేసిన నాన్ ప్రావిన్షలైజుడ్ సిబ్బంది పింఛన్లు, ఇతర సహాయాల కోసం జిల్లా పరిషత్ 2016 వరకు రూ.59కోట్ల 11 లక్షలు ఖర్చు చేయగా ఈ ఏడాది రూ.6కోట్ల 20 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. మొత్తం రూ.65.11 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించింది. జెడ్పీ రోడ్లు, గెస్ట్‌హౌస్‌ల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసేందుకు పంచాయతీరాజ్ మంత్రిని కోరుతూ చేసిన ప్రతిపాదనలను కూడా సభ ఆమోదించింది. అధికారులు ప్రజాప్రతినిధులను అగౌరపరుస్తున్నారు : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రొటోకాల్ అంశాన్ని లేవనెత్తి అధికారులు కావాలని ప్రజాప్రతినిధులను అగౌరపరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులను గౌరవిస్తూ తమను అవమాన పరుస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రొటోకాల్ అంశం పెద్ద విషయం కాదని, అభివృద్ధిపై చర్చించాలని అన్నారు. దీనిపై సభలో మాటా మాటా పెరిగింది. వ్యవసాయ యంత్రపరికరాలకు సంబంధించి అధికారులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించడంలేదని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు చర్చ లేవనెత్తారు. కొత్తపేట జగ్గిరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోనూ రైతులకు వ్యవసాయ యంత్రపరికరాలు అందించే విషయంతో అన్యాయం జరుగుతోందన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం కల్పించుకుంటూ జగ్గిరెడ్డి యంత్రపరికరాలు అందించే విషయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతోనే లిస్టు తయారు చేసి అధికారులకు ఇచ్చారనడంతో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షనేత శాఖా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ యంత్ర పరికరాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ రైతులు వేరువేరు అనే భేదాలుంటాయా అని ప్రశ్నించారు. కౌలు రైతులకు రుణాలు, సొసైటీలు రైతుల నుంచి వడ్డీలు వసూలు తదితర అంశాలు ఒకదాని వెంట ఒకటి చర్చకు రావడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరగడంతో మంత్రి చినరాజప్ప కల్పించుకుని ఎవరికి ఏం చేయాలో మాకు తెలుసు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గదమాయించి చర్చ కొనసాగించకుండా ఆపేశారు. కాళ్ల వాపు వ్యాధిపై నిర్ధిష్టత లేకుండా ఎవరికి తోచినట్టు వారు ప్రకటనలు ఇస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టాలని ఏజెన్సీ మండలాలకు చెందిన జెడ్పీటీసీలు కోరారు. చింతూరులోనే ప్రత్యేక ఆసుపత్రిని అభివృద్ధి చేసి అక్కడ ప్రజలకు వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ వివరించారు. విద్యాశాఖ, ఎస్సీ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్, వైద్య ఆరోగ్య, స్త్రీశిశుసంక్షేమశాఖ, విద్యుత్, సాగునీరు, బీసీ కార్పొరేషన్, పశుసంవర్ధక శాఖలపై చర్చించారు. జెడ్పీ సీఈవో కె.పద్మ, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, పిల్లి అనంతలక్ష్మి, ఎ.ఆనందరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపాల్గొన్నారు.