హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం | Prepare a division of the High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం

Published Wed, Apr 20 2016 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం

హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం

కేంద్రమంత్రి దత్తాత్రేయ

 సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను కలిశారు. ఈ సమావేశం అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ైహైకోర్టు విభజనపై చర్చించినట్టు పేర్కొన్నారు.

ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనను న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, త్వరిత గతిన విభజన ప్రక్రియ పూర్తిచేయాలని కోరామన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని దత్తాత్రేయ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement