ఎస్‌బీ పల్లిని దత్తత తీసుకుంటా! | Central minister dattatreya sayes he will adopt SB palli | Sakshi
Sakshi News home page

ఎస్‌బీ పల్లిని దత్తత తీసుకుంటా!

Published Mon, Apr 25 2016 4:42 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

ఎస్‌బీ పల్లిని దత్తత తీసుకుంటా!

ఎస్‌బీ పల్లిని దత్తత తీసుకుంటా!

కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రకటన
 
 కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం ఎస్‌బీ పల్లిని దత్తత తీసుకుంటానని కేంద్ర కార్మికశాఖ మం త్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పంచాయతీరాజ్ దివస్‌ను పురస్కరించుకుని ఆదివారం ఇక్కడ నిర్వహించిన గ్రామ్ ఉదయ్‌సే భారత్ ఉదయ్ అభియాన్ గ్రామసభలో మంత్రి మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలు బలపడాలని దత్తాత్రేయ పేర్కొన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన 23 గ్రామీణ పథకాలను అమలు చేస్తే ఎస్‌బీ పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు, సాగునీరు వంటి సౌకర్యాలను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మొబైల్ ద్వారా ఉద్యోగాల కల్పనకుగాను నేషనల్ క్యారియర్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement