ఢిల్లీలో చేనేత ఎగ్జిబిషన్‌లో వ్రస్తాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
చండీగఢ్: దేశానికి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత అవసరమైందో స్వాతంత్య్రం వచి్చన నాలుగు దశాబ్ధాల తర్వాత కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థల బలోపేతానికి అప్పటి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. జిల్లా పంచాయతీ వ్యవస్థను సైతం కాంగ్రెస్ పాలకులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. ‘ఫలితంగా దేశ జనాభాలో గ్రామాల్లో నివసించే మూడింట రెండొంతుల మంది కనీస సౌకర్యాలైన రహదారులు, విద్యుత్, మంచినీరు, పక్కా ఇళ్లు వంటి వాటికి కూడా నోచుకోలేకపోయారు.
ఈ నిర్లక్ష్యం ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాలకు కూడా దేశంలోని సుమారు 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం సమకూరలేదు’ అని ఆయన అన్నారు. ఇందుకు జమ్మూకశీ్మరే ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘హరియాణా క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్’ రెండు రోజుల వర్క్‌షాప్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. అమృత్ కాల్ తీర్మానాల సాధనకు, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం దిశగా నేడు భారత్ ఐక్యంగా ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. ఆగస్ట్ 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం రోజున యావత్ దేశం ‘అవినీతి..ఆశ్రిత పక్షపాతం.. బుజ్జగింపు రాజకీయాలు క్విట్ ఇండియా’ అని ఐక్యంగా నినదించాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఇంటికీ చేరేందుకు జిల్లా పరిషత్ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్ష కూటమిపై ప్రధాని విసుర్లు
ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి భారత్ ప్రగతికి ప్రతిబంధకంగా, ప్రమాదకరంగా మారిందని ప్రధాని అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో సోమవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవాలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment