Neglected by the government
-
పంచాయతీ రాజ్ ప్రాముఖ్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు
చండీగఢ్: దేశానికి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత అవసరమైందో స్వాతంత్య్రం వచి్చన నాలుగు దశాబ్ధాల తర్వాత కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థల బలోపేతానికి అప్పటి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. జిల్లా పంచాయతీ వ్యవస్థను సైతం కాంగ్రెస్ పాలకులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. ‘ఫలితంగా దేశ జనాభాలో గ్రామాల్లో నివసించే మూడింట రెండొంతుల మంది కనీస సౌకర్యాలైన రహదారులు, విద్యుత్, మంచినీరు, పక్కా ఇళ్లు వంటి వాటికి కూడా నోచుకోలేకపోయారు. ఈ నిర్లక్ష్యం ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాలకు కూడా దేశంలోని సుమారు 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం సమకూరలేదు’ అని ఆయన అన్నారు. ఇందుకు జమ్మూకశీ్మరే ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘హరియాణా క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్’ రెండు రోజుల వర్క్‌షాప్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. అమృత్ కాల్ తీర్మానాల సాధనకు, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం దిశగా నేడు భారత్ ఐక్యంగా ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. ఆగస్ట్ 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం రోజున యావత్ దేశం ‘అవినీతి..ఆశ్రిత పక్షపాతం.. బుజ్జగింపు రాజకీయాలు క్విట్ ఇండియా’ అని ఐక్యంగా నినదించాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఇంటికీ చేరేందుకు జిల్లా పరిషత్ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష కూటమిపై ప్రధాని విసుర్లు ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి భారత్ ప్రగతికి ప్రతిబంధకంగా, ప్రమాదకరంగా మారిందని ప్రధాని అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో సోమవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవాలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. -
35 గ్రామాలకు ఉప్పునీరే దిక్కు ..
సాక్షి, వాకాడు: పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి మండలంలోని 35 తీర ప్రాంత గ్రామాల్లో గత ఐదేళ్లుగా ఉప్పు జలగండం పట్టి పీడిస్తోంది. నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్నా.. తీరప్రాంత వాసులకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలో 68 గ్రామాల్లో 10.5 వేల కుటుంబాలు, 38 వేల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో 204 చేతి పంపులు ఉండగా, వాటిలో 164 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. నిడిగుర్తి, రెడ్డిపాళెం, బాలాజీ నగర్, నిమ్మవానితిప్ప, వేణుగోపాల్‌పురం, నిడిగుర్తి గొల్లపాళెం, శ్రీహరిపురం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, దుగ్గరాజపట్నం, కొత్తూరు, అంజలాపురం, కాకివాకం, పంబలి, నిడిగుర్తి, శ్రీపురం, తీపలపూడి, మూలపడవ, రాజ్యలక్ష్మీపురం, మొనపాళెం, వైట్‌కుప్పం, నలగామల, పున్నమానితిప్ప, నిడిగుర్తి గొల్లపాళెం, రెడ్డిపాళెం, మాధవాపురం, ముట్టెంబాక, కల్లూరు, దుర్గవరం, పల్లెపాళెం ఇలా 35 గ్రామాల్లో వేసవి వస్తే సరి త్రాగునీరు ఉప్పునీరుగా మారిపోయి ప్రజలు అల్లాడుతుంటారు. ఐతే వీరి గురించి అధికార పక్షం నాయకులు గానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. వీరికి సురక్షిత మంచినీరు అందించేందుకు వాకాడు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన పాత పైలెట్ ప్రాజెక్టు పట్ల పాలకులు, కాంట్రాక్టుల నిర్లక్ష్యం కారణంగా తాగునీరు సక్రమంగా అందడంలేదు. అక్కడక్కడ పైపు లైన్లు పగిలిపోయి మరమ్మత్తులకు గురైనప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా తీర గ్రామాల ప్రజలు దాహార్తితో అల్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లు ద్వారా నీటిని తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికులు, దాతల చందాలతో మంచినీరు దొరికే ప్రాంతాల్లో గ్రామస్తులే బోరు పాయింట్లు నిర్మించుకుని తాగునీరు తెచ్చుకుంటున్నారు. తీరప్రాంత గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఉప్పునీరు పనికిరాదు. మండలంలో శాశ్వత తాగునీటి పరిష్కారం కొరకు వాకాడు స్వర్ణముఖి వద్ద మరో మంచినీటి ప్రాజెక్టు నిర్మించాలని మండల ప్రజలు కోరుచున్నారు. తాగేందుకు ఉప్పునీరే గతి స్నానాలు చేయాలన్నా.. వంట చేసుకోవాలన్నా ఉప్పునీరు కావడంతో చాలా ఇబ్బందిగా ఉంది. మంచినీళ్లు తాగి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎప్పుడైనా పట్టణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మా త్రమే మంచినీళ్లు తాగుతున్నాం. మిగిలిన సమయంలో ఉప్పునీరే తాగుతున్నాం.– నల్లపురెడ్డి మునస్వామిరెడ్డి, వేణుగోపాలపురం ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం గ్రామాల్లో లభిస్తున్న ఉప్పునీరు కారణంగా ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం. సిమెంటులో ఉప్పునీరు కలిపితే నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. మండలంలోని 35 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. – మునస్వామి, ఓడపాళె ఆందోళన చేసినా పట్టించుకోలేదు గ్రామంలో తాగునీరు ఉప్పునీరుగా మారి ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై అనేక సార్లు ఆందోళన చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఉప్పునీరు తాగే బతుకుతున్నాం.– పోలయ్య మత్స్యకార కాపు, కొండూరుపాళెం -
ఎన్నాళ్లీ ఇన్చార్జిల పాలన..!
చేవెళ్ల: పాఠశాలల పనితీరును పర్యవేక్షిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిన మండల విద్యాధికారుల పోస్టులు జిల్లాలో అధికశాతం ఖాళీలుగా ఉన్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం విహస్తోంది. దీంతో ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న సీనియర్లను ఇన్చార్జిలుగా నియమిస్తుండడంతో ఇప్పటికే టీచర్ల కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఉన్నవారికి అదనపు భారం పడుతోంది. పూర్తిస్థాయి మండల విద్యాధికారులను నియమించాలని గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు నోచుకోకపోవడంతో ఇన్చార్జీల పాలనే కొనసాగుతున్నది. ఇటీవలి కాలంలో ఎంఈఓలకు పనిభారం పెరగడం, ఇన్‌చార్జీలుగా ఉన్నవారు తాము పనిచేస్తున్న పాఠశాలలకు అప్పుడప్పుడైనా వెళ్లాలని నిబంధనలు ఉండడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంఈఓలు పాఠశాలల పనితీరును పర్యవేక్షించడం, మధ్యాహ్న భోజన పథకం బిల్లులను పంపించడం, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీచేయడం, విద్యాశాఖనుంచి వచ్చిన నివేదికలను పంపించడం, టీచర్లకు శిక్షణా తరగతులు నిర్వహించడం, వాటిని పర్యవేక్షించడం తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. ప్రధానోపాధ్యాయులపై భారం జిల్లాలోని 37 మండలాలలకుగాను కేవలం నాలుగు మండలాలలో మాత్రమే రెగ్యులర్ మండల విద్యాధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. హయత్‌నగర్, గండేడు, దోమ, బాల్నగర్ మండలాలలో మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలుండగా మిగతా మండలాలలో ఇన్చార్జులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ మండలంలో రెగ్యులర్ ఎంఈఓ పోస్టు ఖాళీగా ఉంటే ఆ మండలంలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని ఇన్చార్జిగా నియమిస్తున్నారు. దీంతో ఆ పాఠశాలలో ఒక పోస్టు ఖాళీ అవడం, ఆ స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు చేవెళ్ల ఎంఈఓగా మల్కాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్కే శ్రీశైలం ఇన్చార్జి ఎంఈఓగా గత మూడు సంవత్సరాలుగా విధులు నిర్వర్తించారు. ఆయన జూన్ 30వేతదీన పదవీవిరమణ చేయడంతో చేవెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగరాణికి ఇన్చార్జి ఎంఈఓగా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె పదవీబాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆమె బోధించే సబ్జెక్టుకు టీచరు లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. తనిఖీలు లేవు.. పర్యవేక్షణ లేదు.. ఆయా మండలాలలోని ఉన్నత పాఠశాల సీనియర్ ప్రధానోపాధ్యాయులనే ఇన్చార్జి ఎంఈఓలుగా ప్రభుత్వం నియమిస్తుండడంతో పాఠశాలల తనిఖీలు గాని, ఉపాధ్యాయుల మీద పర్యవేక్షణ గాని చేయడంలేదనే ఆరోపణలున్నాయి. తరచుగా ఎంఈఓలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు ఎక్కడా అమలు కావడంలేదు. ఎంఈఓలు ఆఫీసులలో కూర్చుని పేపరు వర్కుకే పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు సరిగ్గా లేనందువల్లనే తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడంలేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. భారమైనాసరే కూలీ చేసుకునే వారు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. ప్రైవేటు స్కూళ్లపై చర్యలేవీ... ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికఫీజులు దండుకుంటున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలున్నా ఎంఈఓలు ఆ స్కూళ్లను కనీసం తనిఖీచేసిన పాపాన పోవడంలేదు. విద్యార్థి సంఘాలు పలుమార్లు అధికారులను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు ఎంఈఓలు తొత్తులుగా వ్యవహారిస్తున్నారని, అందువల్లనే కనీసం తనిఖీలు కూడా నిర్వహించడంలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇన్చార్జి ఎంఈఓలు ఉన్నందువల్లనే ఈ దుస్థితి ఉన్నదని, వీరి స్థానంలో వెంటనే టీపీపీఎస్సీ ద్వారా పూర్తిస్థాయి ఎంఈఓలను నియమించాలని కోరుతున్నారు.