కేంద్ర మంత్రి దత్తాత్రేయ సూచన
♦ గతంలో ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధులన్నీ నీటిపాలయ్యాయి
♦ అలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దు
♦ మేడిగడ్డ వద్ద 88 టీఎంసీల నిల్వతో భారీ డ్యామ్ కట్టాలి
♦ ప్రభుత్వానికి కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సూచన
♦ ‘గోదావరి’ జలాలపై శ్రీరాం పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : గోదావరిపై గత ప్రభు త్వాలు నిర్మించిన ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధులన్నీ నీటి పాలయ్యాయని, అలాంటి పరిస్థితి పునరావృతం కారాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. లభ్యత జలాలను సంపూర్ణంగా వినియోగం లోకి తెస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని, అందుకు తగ్గట్లే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలని సూచించారు. ఆదివారం కేంద్ర జల వనరుల శాఖ సలహా దారు, రాజస్తాన్ జల వనరుల అభివృబ్ధి విభా గం చైర్మన్ శ్రీరాం వెదిరె రచించిన ‘గోదావరి జలాల సమగ్ర వినియోగం– జాతీయ, తెలం గాణ రాష్ట్ర దృక్పథాలు’అనే పుస్తకా విష్కరణ కార్యక్రమం ఇక్కడి మారియట్ హోటల్‌లో జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం శ్రీరాం వెదిరె సలహాలు స్వీకరిం చాలని, అవసరమైతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ సూచించారు.
మేడిగడ్డ వద్ద 20 టీఎంసీల డ్యామ్ సరిపోదు: శ్రీరాం వెదిరె
గోదావరి జలాల వినియోగం, ప్రణాళికలపై శ్రీరాం వెదిరె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘భావి తరాలకు గోదావరి నీటిని పూర్తి స్థాయిలో అందించాలంటే కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న డ్యామ్ నిర్మాణం సరిపోదు. 115 మీటర్ల ఎత్తులో 88 టీఎంసీల సామర్థ్యంతో భారీ డ్యామ్ కడితేనే రాష్ట్రానికి ప్రయోజనం. 350 టీఎంసీల వరకు నీటిని వాడుకోవచ్చు. భారీ డ్యామ్ కట్టకుంటే తెలంగాణకు భవిష్యత్ లేదు. అనుకున్న లబ్ధిపొందలేం’ అని పేర్కొన్నారు. 115 మీటర్ల ఎత్తులో తెలంగాణలో 210 చదరపు కిలోమీటర్లు, మహారాష్ట్రలో 113 చదరపు కిలోమీటర్లు మాత్రమే ముంపు ఉం టుందని, ఇందులో సగం రివర్ బెడ్‌లోనే ఉం టుందని తెలిపారు. ఈ డ్యామ్ కడితే చేవెళ్ల వరకు నీటిని తరలించి అక్కడి నుంచి పాల మూరు, రంగారెడ్డి జిల్లాలోని రిజర్వాయ ర్‌లకు సైతం 50 టీఎంసీల మేర నీటిని తర లించవచ్చని తెలిపారు.
ఇక బూర్గంపాడ్ మొదలు, దుమ్ముగూడెం, ఇచ్ఛంపల్లి, కంత నపల్లి, మంథని, ఎల్లంపల్లి వరకు, అక్కడి నుంచి ఎస్సారెస్పీ మధ్య మరో తొమ్మిది బ్యారేజీల నిర్మాణం చేస్తే నదీ పరీవాహకం అంతా రిజర్వాయర్‌లా మారుతుందని తెలిపారు. దీంతో జల రవాణా సులభతరం అవుతుందన్నారు. జల రవాణాతో ఏకంగా కోటి ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని అన్నారు. నదుల అనుసంధానం చేస్తూ, నౌకాయానానికి అవకాశం ఇవ్వడంతో బృహ త్ ప్రయోజనాలు ఉంటాయని, గరిష్ట విద్యు దుత్పత్తి సాధ్యం అవుతుందని తెలిపారు. పట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ముంపు తక్కువ, ఎక్కువ ప్రయోజనాలనిచ్చే శ్రీరాం సూచనలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు.
ప్రధానిస్థాయిలో చర్చ జరగాలి: రామచంద్రమూర్తి
‘రాష్ట్రంలో 1998 నుంచి 3.50 లక్షల మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. అయినా పార్లమెంట్, అసెంబ్లీలో గంట కూడా చర్చ జరగలేదు’అని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రాజెక్టుల్లో రీ డిజైన్ చేస్తున్నారు. దాన్ని అంగీకరించని వాళ్లని తెలంగాణ విరో ధులుగా ముద్ర వేస్తున్నారు. అది సమంజసం కాదు. అందరి ఆలోచనలు స్వీకరించాలి. నదు ల అనుసంధానం, ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రధానమంత్రి స్థాయిలో చర్చ జరగాలి. గతం లో హనుమంతరావు, రాజారెడ్డి వంటి ఇంజ నీర్ల సేవలను మన ప్రభుత్వాలు ఉపయోగిం చుకోలేదు. కానీ వారి సేవలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకున్నాయి. శ్రీరాం వెదిరె సేవలను రాష్ట్రం గుర్తించకున్నా రాజస్తాన్ గుర్తించింది’ అని అన్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీనేత కిషన్‌రెడ్డి, ఎమ్మె ల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ప్రజోపయోగంగా కాళేశ్వరం రీ డిజైన్
Published Mon, Feb 13 2017 1:24 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement