Union Water Resources Ministry
-
‘శ్రీశైలం’ భద్రతపై దృష్టి
18, 19 తేదీల్లో కేంద్ర జల సంఘం సమీక్ష హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు అంచనాకు మించి వరద వచ్చిన సందర్భాల్లో డ్యామ్ దెబ్బతినకుండా తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులపై కేంద్ర జల వనరుల శాఖ దృష్టిపెట్టింది. శ్రీశైలం డ్యామ్ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఈ నెల 18, 19 తేదీల్లో రూర్కీలో జరిగే నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ (ఎన్సీడీఎస్) సమావేశంలో దీన్ని చర్చించనుంది. 216 టీఎం సీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం డ్యామ్ ఎత్తు 885 అడుగులు కాగా, పొడవు 512 మీటర్లు (1,680 అడుగులు). 12 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి నిర్వహణ చేపడుతున్నారు. ఈ ఎత్తులో ప్రస్తుతం ఉన్న క్రస్ట్‌గేట్ల ద్వారా మొత్తంగా 15 లక్షల క్యూసెక్కుల వరదకు నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. అంతకుమించి జలాలు వచ్చిన సమయంలో డ్యామ్ నిర్వహణ సులభమయ్యేది కాదు. 2009 కృష్ణాలో వచ్చిన వరదలు డ్యామ్ భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. డ్యామ్ సామర్థ్యాన్ని మించి 25 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో నిర్వహణ కష్టసాధ్యమై భారీ నష్టం చేకూరింది. కుడి, ఎడమ కాల్వ కింద ఉన్న 1,670 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు ముంపునకు గురయ్యాయి. దీంతో దీనిపై చర్చించిన ఎన్సీడీఎస్ ఈ ప్రాజెక్టు స్పిల్‌వే సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. దీంతో పాటే ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిలో కొంత భాగాన్ని మళ్లించాలని సూచించినా అమల్లోకి రాలేదు. దీంతో దీనిపై మళ్లీ చర్చించి ముందస్తు చర్యలకు దిగాలని కేంద్రం భావిస్తోంది. -
ప్రజోపయోగంగా కాళేశ్వరం రీ డిజైన్
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సూచన ♦ గతంలో ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధులన్నీ నీటిపాలయ్యాయి ♦ అలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దు ♦ మేడిగడ్డ వద్ద 88 టీఎంసీల నిల్వతో భారీ డ్యామ్ కట్టాలి ♦ ప్రభుత్వానికి కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సూచన ♦ ‘గోదావరి’ జలాలపై శ్రీరాం పుస్తకావిష్కరణ సాక్షి, హైదరాబాద్ : గోదావరిపై గత ప్రభు త్వాలు నిర్మించిన ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధులన్నీ నీటి పాలయ్యాయని, అలాంటి పరిస్థితి పునరావృతం కారాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. లభ్యత జలాలను సంపూర్ణంగా వినియోగం లోకి తెస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని, అందుకు తగ్గట్లే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలని సూచించారు. ఆదివారం కేంద్ర జల వనరుల శాఖ సలహా దారు, రాజస్తాన్ జల వనరుల అభివృబ్ధి విభా గం చైర్మన్ శ్రీరాం వెదిరె రచించిన ‘గోదావరి జలాల సమగ్ర వినియోగం– జాతీయ, తెలం గాణ రాష్ట్ర దృక్పథాలు’అనే పుస్తకా విష్కరణ కార్యక్రమం ఇక్కడి మారియట్ హోటల్లో జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం శ్రీరాం వెదిరె సలహాలు స్వీకరిం చాలని, అవసరమైతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ సూచించారు. మేడిగడ్డ వద్ద 20 టీఎంసీల డ్యామ్ సరిపోదు: శ్రీరాం వెదిరె గోదావరి జలాల వినియోగం, ప్రణాళికలపై శ్రీరాం వెదిరె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘భావి తరాలకు గోదావరి నీటిని పూర్తి స్థాయిలో అందించాలంటే కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న డ్యామ్ నిర్మాణం సరిపోదు. 115 మీటర్ల ఎత్తులో 88 టీఎంసీల సామర్థ్యంతో భారీ డ్యామ్ కడితేనే రాష్ట్రానికి ప్రయోజనం. 350 టీఎంసీల వరకు నీటిని వాడుకోవచ్చు. భారీ డ్యామ్ కట్టకుంటే తెలంగాణకు భవిష్యత్ లేదు. అనుకున్న లబ్ధిపొందలేం’ అని పేర్కొన్నారు. 115 మీటర్ల ఎత్తులో తెలంగాణలో 210 చదరపు కిలోమీటర్లు, మహారాష్ట్రలో 113 చదరపు కిలోమీటర్లు మాత్రమే ముంపు ఉం టుందని, ఇందులో సగం రివర్ బెడ్‌లోనే ఉం టుందని తెలిపారు. ఈ డ్యామ్ కడితే చేవెళ్ల వరకు నీటిని తరలించి అక్కడి నుంచి పాల మూరు, రంగారెడ్డి జిల్లాలోని రిజర్వాయ ర్లకు సైతం 50 టీఎంసీల మేర నీటిని తర లించవచ్చని తెలిపారు. ఇక బూర్గంపాడ్ మొదలు, దుమ్ముగూడెం, ఇచ్ఛంపల్లి, కంత నపల్లి, మంథని, ఎల్లంపల్లి వరకు, అక్కడి నుంచి ఎస్సారెస్పీ మధ్య మరో తొమ్మిది బ్యారేజీల నిర్మాణం చేస్తే నదీ పరీవాహకం అంతా రిజర్వాయర్లా మారుతుందని తెలిపారు. దీంతో జల రవాణా సులభతరం అవుతుందన్నారు. జల రవాణాతో ఏకంగా కోటి ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని అన్నారు. నదుల అనుసంధానం చేస్తూ, నౌకాయానానికి అవకాశం ఇవ్వడంతో బృహ త్ ప్రయోజనాలు ఉంటాయని, గరిష్ట విద్యు దుత్పత్తి సాధ్యం అవుతుందని తెలిపారు. పట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ముంపు తక్కువ, ఎక్కువ ప్రయోజనాలనిచ్చే శ్రీరాం సూచనలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. ప్రధానిస్థాయిలో చర్చ జరగాలి: రామచంద్రమూర్తి ‘రాష్ట్రంలో 1998 నుంచి 3.50 లక్షల మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. అయినా పార్లమెంట్, అసెంబ్లీలో గంట కూడా చర్చ జరగలేదు’అని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రాజెక్టుల్లో రీ డిజైన్ చేస్తున్నారు. దాన్ని అంగీకరించని వాళ్లని తెలంగాణ విరో ధులుగా ముద్ర వేస్తున్నారు. అది సమంజసం కాదు. అందరి ఆలోచనలు స్వీకరించాలి. నదు ల అనుసంధానం, ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రధానమంత్రి స్థాయిలో చర్చ జరగాలి. గతం లో హనుమంతరావు, రాజారెడ్డి వంటి ఇంజ నీర్ల సేవలను మన ప్రభుత్వాలు ఉపయోగిం చుకోలేదు. కానీ వారి సేవలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకున్నాయి. శ్రీరాం వెదిరె సేవలను రాష్ట్రం గుర్తించకున్నా రాజస్తాన్ గుర్తించింది’ అని అన్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీనేత కిషన్‌రెడ్డి, ఎమ్మె ల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఏమి తేల్చెదరో ‘కృష్ణా’!
హైదరాబాద్ చేరుకున్న ఏకే బజాజ్ కమిటీ పోలవరం, పట్టిసీమల ద్వారా కృష్ణాకు తరలిస్తున్న నీటి వాటాలను తేల్చనున్న కమిటీ నేడు తెలంగాణ,రేపు ఏపీ అధికారులతో భేటీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలకు వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించడం లక్ష్యంగా కేంద్ర జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ హైదరాబాద్ చేరుకుంది. సోమవారం తెలంగాణతో చర్చలు, మంగళవారం ఆంధ్ర ప్రదేశ్‌తో.. తర్వాత కృష్ణా బోర్డుతో వివిధ దఫాలుగా చర్చలు జరిపి తుది నివేదికను కేంద్రానికి అందజేయనుంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణాలో లభ్యతగా ఉన్న 2,130 టీఎంసీలలో ఉమ్మడి ఏపీకి 811, మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734 టీఎంసీలు కేటాయింపులున్నాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటిలో తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీలు వినియోగించుకునేలా ఒప్పందాలున్నాయి. ఏపీ కొత్తగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తుండటంతో కొత్త సమస్య వచ్చి పడింది. పోలవరం, సహా ఏ ఇతర కొత్త ప్రాజెక్టు చేపట్టినా ఎగువ రాష్ట్రాలకు అంతే పరిమాణం వాటా కృష్ణా జలాల్లో దక్కుతుందని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు లో స్పష్టంగా ఉంది. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంతో ఎగువ రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటకలకు 35 టీఎంసీలు, ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు దక్కాయి. 35 టీఎంసీ ల్లో 14 టీఎంసీలు మహారాష్ట్రకు, కర్ణాటకకు 21 టీఎంసీలు దక్కుతాయి. ఏపీ, తెలంగా ణల మధ్య నీటి వాటాల విషయం మాత్రం తేలలేదు. గతంలో అపెక్స్ ముందు ఇదే అంశమై వాదనలు వినిపించిన సమయంలో 80 టీఎంసీల కేటాయింపుల్లో 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రకు దక్కినట్లే మిగతా 45 టీఎంసీలు ప్రస్తుతం ఎగువ రాష్ట్రమైన తమకే దక్కుతుందని తెలంగాణ తెలిపింది. ఏపీ పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీల వాటా ఇవ్వాలని కోరింది. దీనికి ఏపీ అడ్డు లగులుతోంది. బజాజ్ కమిటీ ఈ అంశాన్ని తేల్చాల్సి ఉంది. మరోవైపు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణకు మార్గదర్శకాలతో వర్కింగ్ మాన్యువల్‌ను కమిటీ తయారు చేయాల్సి ఉంది. కృష్ణా బోర్డు తాను రూపొందించిన మ్యాన్యువల్ డ్రాఫ్ట్‌ను ఇప్పటికే బజాజ్ కమిటీకి అందజేసింది. వీటిపై ఇరు రాష్ట్రాలతో చర్చించి కమిటీ ఓ నిర్ణయం చేయాల్సి ఉంటుంది. -
6 నుంచి బజాజ్ కమిటీ రాష్ట్ర పర్యటన
శ్రీశైలం, సాగర్, జూరాలలో పరిశీలన సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాల్ని పరిష్కరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ నియమించిన ఐదుగురు సభ్యుల ఏకే బజాజ్ కమిటీ ఫిబ్రవరి 6 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 5 రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల పరిధిలో పర్యటించి అధికారులతో సమావేశాలు నిర్వహించ నుంది. ఇప్పటికే కమిటీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షతన సభ్యులు మెహతా, ఆర్పీ పాండే, ప్రదీప్‌కుమార్‌శుక్లా, ఎన్ఎన్రాయ్లు ఒకమారు సమావేశమై వివాద అంశా లపై చర్చించారు. గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై ట్రిబ్యునల్ తీర్పులు, వివాదాలు తదితర అంశాలపై మొదట అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందులో భాగంగానే జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలం, సుంకేశుల ప్రాజెక్టుల పరిధిలో 30ఏళ్ల నీటి లెక్కలను ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చారు. దీనిపై ప్రస్తుతం రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. ఇరువురు సీఎంలతో భేటీ: కమిటీ ఫిబ్రవరి 6న హైదారాబాద్ వచ్చి మొదట కృష్ణాబోర్డు అధికారులతో సమావేశమవుతుంది. తరువాత రెండు రోజుల పాటు సాగర్, శ్రీశైలం, జూరాలలో పర్యటిస్తుంది. అనంతరం విజయవాడలో ఏపీ సీఎం, ఇతర అధికారులతో... అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చి సీఎం కేసీఆర్, ఇతర అధికారులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. -
రోజుకు 12 వేల క్యూసెక్కులు వదలండి
తమిళనాడుకు కావేరి నీటి విడుదలపై ఆదేశానికి సుప్రీంకోర్టు సవరణ - తీర్పును వారం పాటు నిలిపివేయాలన్న కర్ణాటక వినతికి తిరస్కృతి - నీటి పరిమాణం కొంత తగ్గించినా.. విడుదల రోజులు పెంచిన వైనం - ప్రజలు తమకు తాముగా చట్టంగా మారజాలరని స్పష్టీకరణ సాక్షి, బెంగళూరు: కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు రెండూ శాంతిభద్రతలు నెలకొనేలా చూడాలని సుప్రీం కోర్టు సోమవారం సూచించింది. కావేరి జలాల పంపిణీకి సంబంధించి రోజుకు 15 వేల క్యూసెక్కుల పది రోజుల పాటు తమిళనాడుకు నీరు విడుదల చేయాల్సిందిగా ఈ నెల 5న కర్ణాటకను సుప్రీం ఆదేశించడం విదితమే. ఆ తీర్పును.. కావేరి నీటి విడుదలపై తమ రాష్ట్రంలో చెలరేగిన శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో వారం రోజుల పాటు నిలిపివేయాలన్న కర్ణాటక విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే.. ఆ ఆదేశాలను సవరించి.. తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల 20 వరకూ నీటిని విడుదల చేయాలని తాజాగా నిర్దేశించింది. తాజా ఆదేశాలను అమలు చేసేలా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. తమిళనాడుకు నీటి విడుదలపై 5నాటి తీర్పును వారం పాటు నిలిపేయాలని, ఆ ఆదేశాలను సవరించాలని కర్ణాటక శనివారం వేసిన పిటిషన్‌పై.. జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ యు.యు.లలిత్‌ల ద్విసభ్య ధర్మాసనం సోమవారం కోర్టుకు సెలవు అయినా కూడా సమావేశమై వాదనలు విని, తాజా ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈలోగా కావేరి జలాలపై పర్యవేక్షక కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాజా తీర్పు వల్ల తమిళనాడుకు అదనంగా 2-3 టీఎంసీలు వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందని కన్నడ సంఘాలు అంటున్నాయి. ఎంత నీరు వదలాలో తీర్పు ప్రతిని అధ్యయనం చేసిన తర్వాతే చెప్పగలమని కర్ణాటక నీటి పారుదల అధికారులు అంటున్నారు. పిటిషన్లో ‘భాష’పై ఆక్షేపణ..: ఇదిలావుంటే.. కావేరి జలాలపై తీర్పును నిలిపివుంచాలని, ఆ తీర్పును సవరించాలని కోరుతూ కర్ణాటక సమర్పించిన దరఖాస్తులో ఉపయోగించిన భాషను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఒక తీర్పులో సవరణను కోరడానికి.. అకస్మాత్తుగా లేదా ఏదైనా ఉద్దేశంతో రేగిన లేదా ఏదైనా ఉత్ప్రేరక అంశం వల్ల రూపొందిన ఆందోళన అనేది ఎన్నడూ ప్రాతిపతిక కాబోదని స్పష్టం చేసింది. ‘ఒక న్యాయ ఉత్తర్వును పాటించకపోవటానికి.. అధికార యంత్రాంగం శాంతిభద్రతల అంశాన్ని కారణంగా చూపజాలదు. ఉత్తర్వును పాటించకుండా ఉండటానికి చోటే లేదు. ఉల్లంఘనకు తావే లేదు. పౌరులు తమంత తాముగా చట్టంగా మారజాలరు. న్యాయస్థానం ఒక ఉత్తర్వును జారీ చేసినపుడు.. దానిని పాటించాల్సిన పవిత్ర ధర్మం పౌరులది. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే చట్ట ప్రకారం అనుమతించగల న్యాయ పరిష్కారాలను పాటించాలి. కర్ణాటక సమర్పించిన దరఖాస్తు భావం దీనిని ప్రతిబించటం లేదు.. పైగా దీనికి విరుద్ధంగా ఉంది. మేం దీనిని ఆక్షేపిస్తున్నాం’ అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. కావేరి కమిటీ నిర్ణయం వాయిదా న్యూఢిల్లీ: సుప్రీం ఉత్తర్వుల ప్రకారం కావేరి జలాలల్లో ఎంత మొత్తాన్ని తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు విడుదల చేయాలన్న అంశంపై.. కావేరి పర్యవేక్షక కమిటీ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. దీనిపై ఈ నెల 19న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించింది. కావేరి జలాల మళ్లింపు, వినియోగం, అనుమతి లేనప్పుడు నీటిని తీసుకున్నారన్న ఆరోపణలు, వర్షపాతంలో తేడాలు దాని ప్రభావం తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాలు పూర్తిగా అందించలేదని.. తగినంత సమాచారం అందుబాటులో లేనందున కమిటీ నిర్ణయానికి రాలేకపోయిందని ఈ భేటీకి అధ్యక్షత వహించిన కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్ అనంతరం మీడియాకు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల 'కృష్ణా' పంచాయితీ: కేంద్రం కీలక నిర్ణయం
- కృష్ణా బోర్డు నుంచి ఆర్కే గుప్తాను తొలిగించిన కేంద్రం - గోదావరి బోర్డు సభ్య కార్యదర్శికి అదనపు బాధ్యతలు - తెలంగాణ అభిప్రాయం కోరకుండానే ప్రాజెక్టుల నియంత్రణపై మొండిగా వ్యవహరించిన గుప్తా సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్య కార్యదర్శి పదవి నుంచి ఆర్కే గుప్తాను తొలగిస్తూ కేంద్ర జల వనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల నియంత్రణ అంశంలో గుప్తా వ్యవహార శైలి వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. గోదావరి బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న సమీర్ ఛటర్జీని గుప్తా స్థానంలో నియమించింది. కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న గుప్తా కృష్ణా బోర్డు తొలినుంచీ బోర్డు సభ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. దీంతో పాటే తుంగభద్ర బోర్డు ఛైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కృష్ణాజలాల నీటి వినియోగం, విడుదలకు సంబంధించిన ఎలాంటి అంశాల్లో అయినా గుప్తా తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఆదేశాలు వెలువడుతుంటాయి. నీటి పంపకాల్లో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తొలినుంచీ గుప్తాపై తెలంగాణ గుర్రుగా ఉన్నా, ఆయనపై నేరుగా కేంద్రానికి ఏనాడూ ఫిర్యాదు చేయలేదు. అయితే ఇటీవల కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే అంశంలో గుప్తా కొంత మొండిగా వ్యవహరించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేనందున, ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవసరం లేదని పలు వేదికలపై తెలంగాణ పదేపదే విన్నవిస్తున్నా, వాటిని పట్టించుకోకుండా ఢ్రాప్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేసి, దాన్ని ఆమోదించాలంటూ గుప్తా నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. -
కృష్ణా బోర్డు ముసాయిదా అక్రమం
కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శికి హరీశ్‌రావు ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ అక్రమమని, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్కు మంత్రి హరీశ్‌రావు వివరించారు. మంగళవారం ఉన్నతాధికారులతో కలసి ఢిల్లీలో అమర్‌జీత్‌సింగ్‌తో హరీశ్‌రావు సమావేశమయ్యారు. కృష్ణా బోర్డు తన పరిధిని అతి క్రమించి నీటి కేటాయింపుల్లో జోక్యం చేసుకోవాలని చూస్తోందని.. ముసాయిదా నోటిఫికేషన్ ఇందుకు సాక్ష్యమన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 85(బి), 87(1) ప్రకారం బోర్డు లేని అధికారాన్ని తీసుకుని కేటాయింపులు చేసే బాధ్యతలను తీసుకునేలా ముసాయిదా నోటిఫికేషన్ తయారు చేసిందన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినా తెలంగాణ వాదనే నెగ్గుతుందన్నారు. ఇక ఆ ముసాయిదాలోని ఏకపక్ష నిర్ణయాలను క్షుణ్ణంగా వివరించారు. అమర్జీత్సింగ్ మొత్తం ఉదంతంపై ఒక వివరణాత్మక నివేదన ఇవ్వాలని కోరగా.. రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారి ఎస్.ఎ.జోషీ మంగళవారం సాయంత్రం ఈ మేరకు లేఖను ఇచ్చినట్టు సమాచారం. చంద్రబాబు వైఖరి సరికాదు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి మంగళవారం విమర్శించారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నానని పదేపదే చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ జిల్లాకు నీళ్లు వస్తుంటే అడ్డుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. -
వరదల నివారణపై కసరత్తు
- వర్షాలకు ముందే కేంద్ర జలవనరుల శాఖ సన్నద్ధత! - వరద ప్రభావిత ప్రాంతాల గుర్తింపునకు చర్యలు - విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న అంచనా నేపథ్యంలో అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: కేంద్ర జల వనరుల శాఖ అప్రమత్తమైంది. వర్షాలకు ముందే వరదల నివారణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి నష్ట నివారణకు కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న అంచనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నదుల బేసిన్ల పరిధిలో వరద కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సూచన మేరకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర జల సంఘం, రాష్ట్ర నీటి పారుదల శాఖ గుర్తించిన ప్రధాన వరద ప్రభావిత ప్రాంతాలకు తోడు, ఉపనదుల పరిధిలోనూ ప్రభావిత ప్రాంతాలను గుర్తించే పనిని ఆరంభించింది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో రాష్ట్రంలో ఇప్పటికే ఆరు వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. ఇందులో ప్రధానంగా కృష్ణా బేసిన్లో 2009లో శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో వచ్చిన 25 లక్షల క్యూసెక్కుల వరద ఇప్పటివరకు నమోదైన వాటిల్లో గరిష్టం. గోదావరి బేసిన్లో 1983లో శ్రీరాంసాగర్ పరిధిలో 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు కేంద్ర జల సంఘం రికార్డులు చెబుతున్నాయి. ఇదే 2009లో నాగార్జునసాగర్ గరిష్ట వరద 14.50 లక్షల క్యూసెక్కులు. శ్రీశైలం వరద సందర్భంగా జరిగిన నష్టం అంతాఇంతా కాదు. వరదను ఎదుర్కొనే ముందస్తు సన్నద్ధతలో విఫలం కావడంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విసృ్తతంగా వర్షాలు కురుస్తాయన్న అంచనా నేపథ్యంలో మంజీరా, గోదావరి మధ్య ప్రాంతం, మానేరు, పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి దిగువ ప్రాంతం, ఇంద్రావతి, లోయర్ భీమా, లోయర్ కృష్ణా, తుంగభద్ర, మూసీ, పాలేరు, మున్నేరు, డిండి, హాలియా వరద ప్రభావిత ప్రాంతాల్లో దానిపై శాస్త్రీయమైన అధ్యయనం చేయాలని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఓ కమిటీని సైతం జల వనరుల శాఖ ఏర్పాటు చేసింది. ఆటోమెటిక్ రెయిన్ గేజ్ స్టేషన్లు, ఆటోమెటిక్ వాటర్ లెవల్ రికార్డులు, డిజిటల్ వాటర్ లెవల్ రికార్డుల ఏర్పాటు ఏ స్థాయిలో అవసరమో ఈ కమిటీ అంచనా వేయనుంది. అన్ని రకాల అప్రమత్తత స్టేషన్లు కలిపి రాష్ట్రంలో 64 ఉండాలి. కానీ, 52 మాత్రమే ఉన్నాయని గుర్తించిన కేంద్ర జల సంఘం మిగతా వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. -
జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని ‘కృష్ణా’ నుంచి తప్పించండి
♦ కృష్ణా జలాల వివాదంలో కర్ణాటక మెలిక ♦ కేంద్ర జల వనరుల శాఖకు ఆ రాష్ట్ర సీఎస్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల వివాదం మరో మలుపు తిరిగింది. కర్ణాటక ప్రభుత్వం ముందు జాగ్రత్త పేరుతో తాజాగా ఇంకో మెలికపెట్టింది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తిని ఆ నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌లో సభ్యుడిగా నియమించడం సబబు కాద ని, దీని వల్ల భవిష్యత్తులో కొత్త వివాదం తలెత్తవచ్చని కర్ణాటక ప్రభుత్వం జనవరి 14న కేంద్ర జల వనరుల శాఖకు ఒక లేఖ రాసింది. కర్ణాటకకు చెందిన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి కృష్ణా ట్రిబ్యునల్‌లో ఉంటే భవిష్యత్తులో ఇతర భాగస్వామ్య రాష్ట్రాలకు అనుమానాలు, అపోహలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఆయనను తప్పించాలని కోరింది. ఇదే అంశాన్ని మధ్యంతర దరఖాస్తు రూపంలో మంగళవారం ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ నివేదించారు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్కు కర్ణాటక సీఎస్ అరవింద్ జాదవ్ రాసిన లేఖలోని అంశాలను ఆయన వివరించారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యానే: కర్ణాటక అనిల్ దివాన్ తన వాదన వినిపిస్తూ ‘ట్రిబ్యునల్ విచారణ కొనసాగాక రేపు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. కేవలం ప్రజాప్రయోజనాల దృష్ట్యానే ఈ అంశాన్ని లేవనెత్తాం’ అని పేర్కొన్నారు. మాకేమీ అభ్యంతరం లేదు: మహారాష్ట్ర ఈ విషయంలో మహారాష్ట్రకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ రాష్ట్రం తరఫు సీనియర్ న్యాయవాది అంద్యార్జున చెప్పారు. ఇప్పటికే నదీ జలాల వివాద పరిష్కారం ఆలస్యమవుతోందని, అవార్డు నోటిఫై చేయలేదని ఆయన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది: ఏపీ ఏపీ తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ తన వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఏర్పాటైన ప్రత్యేక ట్రిబ్యునళ్ల విషయంలో ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదని, కానీ కర్ణాటక ఈ అంశాన్ని లేవనెత్తాక దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందనిపిస్తోందన్నారు. తమ ప్రభుత్వ వైఖరి తెలుసుకుని నివేదిస్తామని చెప్పారు. తాము కూడా తమ ప్రభుత్వ వైఖరిని తెలుసుకుని నివేదిస్తామని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రారావు చెప్పారు. ఇది ఫోరం కాదు: కేంద్రం కేంద్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఖాద్రీ తన వాదనలు వినిపిస్తూ.. ‘నియామకం జరిపినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చింది? అయినా, ఒకవేళ వారికి అభ్యంతరం ఉంటే, నియామకాన్ని సవాలు చేసేందుకు తగిన ఫోరం ఈ ట్రిబ్యునల్ కాదు. ట్రిబ్యునల్ సభ్యుడిని భారత ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. మేం కేవలం నోటిఫికేషన్ ఇస్తాం..’ అని అన్నారు. కేంద్రం వైఖరిని తెలుసుకుని నివేదించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తదుపరి విచారణను బుధవారానికి వాయిదావేశారు. -
అంతర్జాతీయ వేదికపై ‘మిషన్ కాకతీయ’
♦ నేటి నుంచి ఢిల్లీలో ‘ఇండియన్ వాటర్ వీక్’ ♦ 20 దేశాల నుంచి ప్రతినిధుల హాజరు ♦ చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక ♦ ప్రజెంటేషన్ ఇవ్వనున్న రాష్ట్రం ♦ చివరి రోజు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునే అవకాశాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా సుస్థిర నీటి యాజమాన్యానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించేందుకు ‘ఇండియన్ వాటర్ వీక్’ పేరుతో అంతర్జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తోంది. ‘సుస్థిరాభివృద్ధికి నీటి యాజమాన్యం’ పేరుతో సోమవారం ప్రారంభం కానున్న ఈ సదస్సు 8వ తేదీ వరకు కొనసాగనుంది. అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థలు, వ్యక్తులతో పాటు జల వనరులతో ముడిపడి ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు, అనుబంధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వివరించనున్నారు. ఈ వేదికపై రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. 1,500 మంది ప్రతినిధుల ముందు ‘మిషన్’పై వివరణ.. కేంద్ర జల వనరుల శాఖ ప్రాథమిక అంచనా మేరకు.. దేశంలో సగానికి పైగా జనాభా స్వచ్ఛమైన రక్షిత నీటిని పొందలేకపోతున్నారు. సుమారు 8.2 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందడం లేదు. దేశంలో ఏడాదికి నీటి జనిత రోగాల కారణంగా 73 లక్షల పనిదినాలు కోల్పోతోంది. పెరుగుతున్న నీటి డిమాండ్‌కు అనుగుణంగా వనరుల లభ్యత లేకపోవడంతో భవిష్యత్ అవసరాలపై ఇది పెనుప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా నీటి యాజమాన్యంపై ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. చుక్క నీటిని ఒడిసిపట్టేలా, లభ్యత నీటిని పారిశ్రామిక, విద్యుత్, సాగు, తాగునీరు అవసరాలకు సమర్థంగా వినియోగించే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందులో భాగంగానే వ్యవసాయ, ప్లానింగ్, విద్యుత్, గ్రామీణ, పట్టణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖలు, ఐఐటీ, భారత నీటి, వ్యవసాయ పరిశోధన సంస్థలతో కలసి ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఇక్కడ వచ్చే అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించనుంది. ఈ సదస్సులో సుమారు 20 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో పాల్గొనాలని ఇప్పటికే కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫోన్ ద్వారా ఆహ్వానించారు. అయితే ఇతర కార్యాక్రమాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఈ సదస్సుకు వెళ్లే అవకాశం లేదు. అయితే తొలి రోజు నుంచి ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. 8న జరిగే ముగింపు సమావేశానికి నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తంగా గుర్తించిన చెరువులు, వాటిని నిర్ణీత కాలానికి నిర్దేశించుకున్న బడ్జెట్లకు అనుగుణంగా చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాలు, ఇప్పటికే మొదటి విడత ద్వారా సాధించిన ఫలితాలను ప్రత్యేక ప్రజెంటేషన్‌లో రాష్ట్రం వివరించే అవకాశం ఉంది. -
ఏప్రిల్‌లో రాష్ట్రానికి ఉమాభారతి
మిషన్ కాకతీయ పనుల పరిశీలన సాక్షి, హైదరాబాద్: కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఏప్రిల్ రెండో వారంలో రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులను ఆమె ఈ సందర్భంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి గత ఏడాదే మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, మంత్రి హరీశ్‌రావు ఉమాభారతికి పలుమార్లు విన్నవించారు. అయితే సమయాభావంతో ఆమె రాలేకపోయారు. ఆ తర్వాత ఈ ఏడాది రెండో విడత మిషన్ పనుల ప్రారంభానికి ముందు రావాలని కోరగా అందుకు ఆమె సమ్మతించారు. కానీ అదే సమయంలో వరంగల్ ఉప ఎన్నిక ఉండటంతో రాలేదు. ఇదిలా ఉంటే ఏప్రిల్‌లో ఢిల్లీలో జరగనున్న ‘వరల్డ్ వాటర్ వీక్’ సదస్సుకు రావాలని ఉమాభారతి ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సదస్సులో మిషన్ కాకతీయపై వివరించాలని కోరారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు వస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఏప్రిల్ రెండో వారంలో ఆమె రాష్ట్రానికి రానున్నారని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. 454 చెరువులకు రూ.129 కోట్లు: మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్రంలోని 454 చెరువుల పనులకు రూ.129.64 కోట్ల మేరకు మంగళవారం నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. -
‘వరద కాల్వ’ సవ రించిన అంచనాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఉన్న ఇందిరమ్మ వరద కాల్వ పనుల సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర జల వనరుల శాఖ నేతృత్వంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన సమావేశంలో సవరించిన అంచనా రూ. 5,887.13 కోట్లకు ఓకే చెప్పింది. దీంతోపాటు ప్రాజెక్టులో ఇంకా చేయాల్సి ఉన్న పనులకు సంబంధించి రూ.1,950 కోట్లలో 25 శాతం నిధులను సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద ఇవ్వనుంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 2.25 లక్షల ఎకరాల ఆయకట్టు నీరిచ్చేందుకు వరద కాల్వ నిర్మాణాన్ని చేపట్టారు. 1996లో కేంద్ర జల వనరుల శాఖకు సమర్పించిన డీపీఆర్ మేరకు రూ. 1,331 కోట్లుగా అంచనా వేశారు. 2005లో ప్రణాళికా సంఘం నుంచి ఆమోదం రాగా... 2006లో ఏఐబీపీ కింద రూ.382.40 కోట్లు విడుదల చేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు, భూసేకరణ జాప్యం కారణంగా అంచనా వ్యయం తాజాగా రూ.5,887.13 కోట్లకు చేరింది. ఇందులో ఇంకా రూ.1,950 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. అయితే ప్రాజె క్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపి, ఏఐబీపీ కింద నిధులివ్వాలని మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం చైర్మన్ పాండ్యా నేతృత్వంలోని టీఏసీ సోమవారం సమావేశంలో సవరించిన అంచనాకు ఆమోదం తెలిపింది. ఇక నిజాంసాగర్ ఆధునీకరణకు రూ. 978కోట్లు, మోదికుంటవాగుకు రూ.456 కోట్లకు సంబంధించిన రాష్ట్ర విన్నపాలను టీఏసీ పరిశీలిస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.