శ్రీశైలం, సాగర్, జూరాలలో పరిశీలన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాల్ని పరిష్కరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ నియమించిన ఐదుగురు సభ్యుల ఏకే బజాజ్ కమిటీ ఫిబ్రవరి 6 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 5 రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల పరిధిలో పర్యటించి అధికారులతో సమావేశాలు నిర్వహించ నుంది. ఇప్పటికే కమిటీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షతన సభ్యులు మెహతా, ఆర్‌పీ పాండే, ప్రదీప్‌కుమార్‌శుక్లా, ఎన్‌ఎన్‌రాయ్‌లు ఒకమారు సమావేశమై వివాద అంశా లపై చర్చించారు.
గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై ట్రిబ్యునల్ తీర్పులు, వివాదాలు తదితర అంశాలపై మొదట అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందులో భాగంగానే జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలం, సుంకేశుల ప్రాజెక్టుల పరిధిలో 30ఏళ్ల నీటి లెక్కలను ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చారు. దీనిపై ప్రస్తుతం రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి.
ఇరువురు సీఎంలతో భేటీ: కమిటీ ఫిబ్రవరి 6న హైదారాబాద్ వచ్చి మొదట కృష్ణాబోర్డు అధికారులతో సమావేశమవుతుంది. తరువాత రెండు రోజుల పాటు సాగర్, శ్రీశైలం, జూరాలలో పర్యటిస్తుంది. అనంతరం విజయవాడలో ఏపీ సీఎం, ఇతర అధికారులతో... అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చి సీఎం కేసీఆర్, ఇతర అధికారులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
6 నుంచి బజాజ్ కమిటీ రాష్ట్ర పర్యటన
Published Wed, Jan 25 2017 2:43 AM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
Advertisement