
మాతోనే అభివృద్ధి
కేంద్ర మంత్రి దత్తాత్రేయ
అబిడ్స్: బీజేపీ, టీడీపీ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్‌సింగ్ తరఫున ఆయన శుక్రవారం ప్రచారం చేశారు. గోషామహల్ నుంచి ప్రారంభమైన రోడ్ షో షాహినాయత్‌గంజ్, గోడేకీకబర్ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్న లక్ష్మణ్‌సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. అతనిని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తాడన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు వైకుంఠం, బీజేపీ నేత లాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.