సాక్షి, హైదరాబాద్: కార్మికుల మూల వేతనం, కరువు భత్యం కలిపి రూ.15 వేలు మించితే పీఎఫ్ జమకట్టే బాధ్యత నుంచి వైదొలగాలనే ఆర్టీసీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎన్‌ఎంయూ పేర్కొంది. ఇలాంటి కార్మిక వ్యతిరేక చర్యలకు ఉపక్రమిస్తే ఉద్యమిస్తామని యూనియన్ నేతలు శంకర్‌రెడ్డి, రమేశ్, మహమూద్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. గతంలో పీఎఫ్ సొమ్మును వాడుకున్న ఆర్టీసీ యాజమాన్యం ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని, దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.