
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోయింది. దీంతో పబ్ నిర్వాహకులు నిబంధనలను ఉల్లఘించి ఇష్టారీతిలో పబ్‌లను రన్ చేస్తున్నారు. తాజాగా నగరంలోని రాంగోపాల్‌పేటలో ఉన్న తకీల పబ్‌పై శనివారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్స్ నిర్వహించారు.
అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ రన్ చేస్తుండటంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది గ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్ ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, పబ్‌కు అనుమతి లేకున్నా అమ్మాయితో నిర్వాహకుడు డ్యాన్స్ చేయిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో సౌండ్ సిస్టమ్, పబ్‌ను సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిని రాం గోపాల్‌పేట పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు.
ఇది కూడా చదవండి: ఆరు నెలలు కాకముందే భర్త అసలు క్యారెక్టర్ బట్టబయలు.. భార్య సూసైడ్
Comments
Please login to add a commentAdd a comment