సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసులు నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
కాగా, పోలీసులు శనివారం నలుగురు నిందితులను కస్టడీలో విచారించారు. A1 సాదుద్దీన్ మాలిక్‌తో పాటుగా ముగ్గురు మైనర్లను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో మైనర్లు పోలీసులకు ట్విస్టులు ఇచ్చినట్టు సమాచారం. లైంగిక దాడి కేసులో మైనర్లు తమ తప్పులేదని పోలీసులకు చెప్పారు. తమను సాదుద్దీన్ మాలికే రెచ్చగొట్టాడని తెలిపారు. దీంతో తాము మైనర్‌పై లైంగిక దాడి చేశామని ఒప్పుకున్నారు.
అయితే, సాదుద్దీన్‌ను విచారిస్తున్న క్రమంలో పోలీసులకు అతను.. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు గందరగోళానికి గురవుతున్నారు. విచారణలో భాగంగా సాదుద్దీన్.. ఎమ్మెల్యే కుమారుడే ముందుగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపాడు. తర్వాత తామూ అనుసరించామని చెప్పాడు. కాన్సూ బేకరీ వద్ద ఎమ్మెల్యే కుమారుడు కారు దిగి వెళ్లిపోయినట్టు తెలిపాడు.
ఇక, విచారణ అనంతరం.. నిందితులకు పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో పొటెన్సీ టెస్టులు నిర్వహించారు. ఆసుపత్రిలో టెస్టుల కారణంగా శనివారం కేవలం గంటసేపు మాత్రమే నిందితులను విచారించినట్టు ఇన్వెస్టిగేషన్ అధికారి బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గరిమెళ్ల ప్రత్యూష మృతి
Comments
Please login to add a commentAdd a comment