సింహపురిలో పబ్ కల్చర్
నెల్లూరు(పొగతోట):
మహనగరాలు, పట్టణాలకే పరిమితమైన పబ్ కల్చర్‌ను సింహపురి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని సింధూర పబ్ ఓనర్ మాలకొండారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక సింధూర పబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పబ్ కల్చర్ ఉందన్నారు. పబ్‌లు లేని కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళుతోదన్నారు. అటువంటి ఆదాయం రాష్ట్రానికి వచ్చేందుకు అధికారుల సహకారంతో నెల్లూరు నగరంలో పబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. మెట్రో సిటీల్లో అందుబాటులో ఉండే రాబీర్ తదితర విందు, వినోద కార్యక్రమాలు నెల్లూరు ప్రజలకు దరి చేర్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. యువత కేరింతలు కోట్టేలా వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. రాబోవు ఆరు నెలల్లో బీర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో ఇంజనీర్ సుధాకర్ పాల్గొన్నారు.