![Police Arrested Two Men For Having Illegal Arms In Jagtial - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/18/gun.jpg.webp?itok=W0XiyX-k)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జగిత్యాల: ఇద్దరు వ్యక్తులు అక్రమ ఆయుధాలతో పట్టుబడటం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. జగిత్యాల పట్టణంలో తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న ముంబైకి చెందిన రాజుభాయ్, వేములవాడకు చెందిన తిరుపతిలను అదుపులోని తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు, 12 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ధర్మపురిలో కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ గౌడ్‌ను కాల్చి చంపిన కేసులో రాజుభాయ్ ప్రధాన నిందితుడు, కాగా తిరుపతి అతనికి ఆయుధం విక్రయించాడు. కాగా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను రహస్యంగా విచారిస్తున్నారు. మీడియా కంటపడకుండా వారిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment