సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు వెస్ట్‌జోన్ డీసీపీ చందన దీప్తి. వీళ్లంతా బీహార్‌కు చెందిన వాళ్లని, ఇలాంటి వాళ్లు వంద మందిదాకా ఉన్నారని ఆమె తెలిపారు.
రాజేష్, అనితలు ఈ ముఠా నాయకులు. రాజేష్ దగ్గర 100 దాకా సభ్యులు ఉన్నారు. వీళ్లంతా పగలంతా ట్రాన్స్‌జెండర్‌ల వేషంలో ఉంటూ జనం దగ్గరి నుంచి డబ్బులు గుంజుతుంటారు. సాయంత్రం కాలనీలు, కమర్షియల్ ఏరియాల్లో దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈజీ మనీ కోసమే వాళ్లు ఈ గ్యాంగ్‌ను నడిపిస్తున్నారు అని డీసీపీ చందన దీప్తి తెలిపారు. ఈ ముఠాలో మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారామె.
పగలంతా ప్రజలను బెదిరిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు గుంజుతున్న ఈ నకిలీ ట్రాన్స్‌జెండర్ల గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. సికింద్రాబాద్, ప్యారడైజ్, జూబ్లీహిల్స్ స్టేషన్ ప్రాంతంలో వీళ్లు హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment