నేను నిన్ను మోసం చేసాను.. | transgender ends life in Hyderabad | Sakshi
Sakshi News home page

నేను నిన్ను మోసం చేసాను..

Published Sat, Oct 19 2024 12:19 PM | Last Updated on Sat, Oct 19 2024 12:19 PM

transgender ends life in Hyderabad

జవహర్‌నగర్‌: ఉరి వేసుకొని ట్రాన్స్‌జెండర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ సంతోష్‌నగర్‌ కాలనీలో దొంతి సంతోష్‌ (31), భార్య బాలమణి, కుమారుడితో కలిసి నివసించేవారు. 2012 సంవత్సరంలో వీరికి వివాహం అయింది. కాగా గత నాలుగు సంవత్సరాల క్రితం సంతోష్‌ ట్రాన్స్‌జెండర్‌గా మారి సరితగా పేరు పెట్టుకున్నాడు. 

అప్పటి నుండి కుటుంబానికి దూరంగా ఉంటూ వికలాంగుల కాలనీ రేణుకానగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.  కాగా ఇటీవల భార్య కుషాయిగూడలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లితో ఉంటోంది. శుక్రవారం ఉదయం ట్రాన్స్‌జెండర్‌ సరిత భార్య బాలమణితో వీడియోకాల్‌లో మాట్లాడారు. ‘నేను నిన్ను మోసం చేశానని, నువు లేకుండా ఉండలేకపోతున్నానని, నువ్వు వెంటనే రావాలని, లేకుంటే చనిపోతానని’ చెప్పాడు. 

వెంటనే ఫోన్‌ కట్‌ చేసిన భార్య బాలమణి చుట్టుపక్కల వారికి ఫోన్‌ చేసి చెప్పింది. అయితే ఇంటి పక్కనవారు వెళ్లి చూసేసరికి సరిత చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. బాలమణి సంఘటన స్థలానికి వచ్చి చూడగా అప్పటికే సరిత మృతిచెందింది. తన భర్త ట్రాన్స్‌జెండర్‌గా మారి కుటుంబానికి ద్రోహం చేశాడని మనస్థాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుననారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement