Getup
-
వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్ ఎవరు?
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి? అని కళ్లకు గంతలు కట్టి అడుగుతారు. కానీ గంతలు కట్టకుండానే ఫొటోలు చూపించి, వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్ ఎవరు? అని అడిగితే... పేరు చెప్పడానికి తడబడాల్సిందే. అలా పోల్చుకోలేనంతగా మారిపోయారు కొందరు స్టార్స్. గుర్తుపట్టలేని వెరైటీ గెటప్స్‌లో ఆ స్టార్స్ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ మేకోవర్, కొత్త గెటప్ అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోల్లో విక్రమ్ ఒకరు. ‘పితామగన్’ (‘శివపుత్రుడు’), సేతు, అపరిచితుడు, ఐ, కోబ్రా’... ఇలా చెప్పుకుంటూ పోతే విక్రమ్ చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లోని పాత్రల జాబితా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ‘తంగలాన్’లోనూ విక్రమ్ వినూత్నంగా కనిపించనున్నారు. పద్దెనిమిదో శతాబ్దంలో కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నేపథ్యంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘తంగలాన్’ తీశామని ఈ చిత్రదర్శకుడు పా. రంజిత్ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్లు మాళవికా మోహనన్, పార్వతీ తిరువోత్తుల గెటప్స్ కూడా పూర్తి డీ–గ్లామరస్‌గా, ఆడియన్స్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి.⇒ తమిళ హిట్ ఫిల్మ్ ‘సారపట్ట పరంపరై’లో డీ–గ్లామరస్ రోల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు హీరోయిన్ దుషారా విజయన్. ఇప్పుడైతే మరీ గుర్తుపట్టలేని గెటప్‌లో కనిపించనున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’ సినిమాలోనే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ సినిమాలో దుషారతో పాటు వరలక్ష్మీ శరత్‌కుమార్, అపర్ణా బాలమురళి కూడా డీగ్లామరస్ రోల్స్‌లోనే కనిపిస్తారు. సందీప్ కిషన్, కాళిదాసు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు అన్నదమ్ముల కథగా సాగే ఈ మూవీ ఈ నెల 26న రిలీజ్ కానుంది.⇒ కథ డిమాండ్ చేస్తే అందులోని గెటప్‌లోకి అవలీలగా మారిపోతారు కమల్‌హాసన్. ‘భామనే సత్యభామనే’లో బామ్మగా, పది అవతారాల్లో ‘దశావతారం’ వంటి చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. ‘దశావతారం’ (2008) తర్వాత కమల్ ఒకే సినిమాలో ఎక్కువ గెటప్స్‌లో కనిపించలేదు. ఇప్పుడు ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’)లో ఐదారు గెటప్స్‌లో కనిపించనున్నారు. వీటిలో ఒకట్రెండు గెటప్స్ ఇప్పటికే బయటకు రాగా మిగిలినవి థియేటర్స్‌లో సర్ప్రైజ్గా ఉండబోతున్నాయని తెలిసింది. ‘భారతీయుడు 2’ కథ రీత్యా కమల్ వందేళ్ల వయసుపైబడిన సేనాపతి పాత్రలో నటించారు. మొత్తంగా ఆయన ఎన్ని పాత్రల్లో కనిపిస్తారో థియేటర్స్‌లోనే చూడాలి. ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్ 2’ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. ⇒ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించడంలో ధనుష్ ముందు ఉంటారు. ఈ విలక్షణ హీరో ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ములతో ‘కుబేర’ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున మరో హీరో. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా, సామాజిక అసమానతల మేళవింపుతో రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ బిచ్చగాడి గెటప్‌లో కనిపిస్తారట.⇒ మాస్ హీరో అనిపించుకున్న విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేశారు. అది ‘లైలా’ సినిమా కోసం అన్నమాట. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఫస్టాఫ్ అబ్బాయిగా, సెకండాఫ్ లైలా అనే అమ్మాయిగా కనిపిస్తారు. ఆకాంక్షా శర్మను హీరోయిన్గా పరిచయం చేస్తూ రామ్‌నారాయణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.⇒ అటు కన్నడకు వెళితే ఇప్పుడు శివ రాజ్‌కుమార్ గెటప్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ‘భైరవనకోనెపాఠ’ అనే చిత్రంలో శివ రాజ్‌కుమార్ గుర్తుపట్టలేని గెటప్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి హేమంత్‌రావు దర్శకుడు. ఈ సినిమా తెలుగు లోనూ రిలీజ్ కానుంది.ఇలా గుర్తు పట్టలేని గెటప్‌కి సై అని, సవాల్‌గా తీసుకుని నటిస్తున్న స్టార్స్ మరికొందరు ఉన్నారు. -
ప్రేయసి కోసం పరీక్ష.. చిక్కుల్లో ప్రియుడు!
ప్రేమ ఎంత గొప్పదో అని తెగ ఫీలైపోయే ప్రేమికులు.. కొన్నిసార్లు అంతే తిప్పల్ని ఎదుర్కొక తప్పదు కూడా. ఓ యువకుడు ప్రేయసి కోసం ఎవరూ చేయలేని సాహసమే చేసి.. చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు. పంజాబ్‌లో జనవరి 7వ తేదీన బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం పరీక్ష నిర్వహించింది. ఫజిల్కా ప్రాంతానికి చెందిన అంగ్రేజ్ సింగ్ అనే యువకుడు.. తన ప్రేయసి పరంజిత్ కౌర్ బదులు ఆ పరీక్ష రాయాలకున్నాడు. అమ్మాయిల వస్త్రధారణతో పరీక్ష హాల్‌కు వెళ్లాడు. ఫ్రూఫ్ల కింద.. వెంట పరంజిత్ కౌర్ పేరుతో సృష్టించిన ఫేక్ వోటర్ ఐడీ, ఆధార్ కార్డు కూడా తెచ్చుకున్నాడు. కానీ, విధి అతన్ని తప్పించుకోనివ్వలేదు. బయోమెట్రిక్ డివైస్ దగ్గర అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆ యువతి దరఖాస్తు ఫారమ్‌ను తిరస్కరించిన అధికారులు ఆమెను అనర్హులిగా ప్రకటించిన అంగ్రేజ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా అతనిపై చట్టపరమైన చర్యలకు యూనివర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
రాజేష్ దగ్గర 100 మంది నకిలీ ట్రాన్స్జెండర్లు
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు వెస్ట్‌జోన్ డీసీపీ చందన దీప్తి. వీళ్లంతా బీహార్‌కు చెందిన వాళ్లని, ఇలాంటి వాళ్లు వంద మందిదాకా ఉన్నారని ఆమె తెలిపారు. రాజేష్, అనితలు ఈ ముఠా నాయకులు. రాజేష్ దగ్గర 100 దాకా సభ్యులు ఉన్నారు. వీళ్లంతా పగలంతా ట్రాన్స్జెండర్ల వేషంలో ఉంటూ జనం దగ్గరి నుంచి డబ్బులు గుంజుతుంటారు. సాయంత్రం కాలనీలు, కమర్షియల్ ఏరియాల్లో దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈజీ మనీ కోసమే వాళ్లు ఈ గ్యాంగ్‌ను నడిపిస్తున్నారు అని డీసీపీ చందన దీప్తి తెలిపారు. ఈ ముఠాలో మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారామె. పగలంతా ప్రజలను బెదిరిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు గుంజుతున్న ఈ నకిలీ ట్రాన్స్జెండర్ల గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. సికింద్రాబాద్, ప్యారడైజ్, జూబ్లీహిల్స్ స్టేషన్ ప్రాంతంలో వీళ్లు హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. -
యముండ.. వ్యాక్సిన్ వేసుకొనుచుండ...
హెల్మెట్ నుంచి మాస్కు వరకు రకరకాల విషయాలలో ప్రచారానికి ‘యమరాజ్’ వేషం పాపులర్ థీమ్‌గా మారింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన పోలిస్ కానిస్టేబుల్ జవహర్‌సింగ్ కోవిడ్–19 వ్యాక్సిన్ గురించి ప్రచారం కోసం యముడి వేషం వేశాడు. వ్యాక్సిన్‌పై రకరకాల అపోహలు, భయాలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రచారం ప్రారంభించాడు. యముడి వేషంలోనే వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఈ వేషం ధరించడం జవహర్సింగ్కు కొత్తేమీ కాదు. సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాలలో యమ సీరియన్‌గా, యమ కమిట్మెంట్తో ప్రచారం చేశాడు. సెహబాష్ సింగ్జీ! -
గెటప్ మార్చిన గద్దర్
మహబూబ్‌నగర్ రూరల్: సమాజంలో రుగ్మతలను తొలగించే దిశగా తనవంతు కృషి చేస్తున్న ప్రజాయుద్ధనౌక, టీ మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గద్దర్ తన వేషధారణ మార్చారు. ఎప్పుడూ చేతిలో కర్ర, భుజాన గొంగడి, కాళ్లకు గజ్జెలు, గోచీతో దర్శనమిచ్చే ఆయన పూర్తిగా గెటప్ మార్చి తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్యవేదిక మహబూబ్‌నగర్ జిల్లా ఆవిర్భావ సభకు వచ్చారు. ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ దశాబ్దాలు గడుస్తున్నా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని, ఆ దిశగా ప్రభుత్వాలు సరైన కృషి చేయడంలేదనీ, ప్రజల్లో కూడా మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నుంచే మార్పు జరగాలని భావించి ప్యాంట్, ఇన్‌షర్ట్ వేసుకుని, టై కట్టుకున్నానని, ఇక నుంచి అందరూ మారాలన్నారు. -
గౌతమీపుత్రుడు ఇలా ఉంటాడు!
‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలకృష్ణ ఎలా కనిపిస్తారు? ఆయన గెటప్ ఎలా ఉంటుంది? అనేది ఇప్పటివరకూ ఊహకందని ప్రశ్న. ఈ సినిమా కోసం ఆయన మీసాలు పెంచిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గెటప్ ఎలా ఉంటుందో గురువారం విడుదలైన ప్రీ-లుక్ చూస్తే కొంతవరకూ ఊహించుకోవచ్చు. శుక్రవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్‌ని విడుదల చేశారు చిత్రదర్శకుడు క్రిష్. తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన శాతవాహన సామ్రాజ్య 23వ రాజు గౌతమీ పుత్ర శాతకర్ణిగా ఈ చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ మొరాకోలో పూర్తయింది. త్వరలోనే మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
నారదుడిలో టిడిపి ఎంపి శివప్రసాద్