
హెల్మెట్ నుంచి మాస్కు వరకు రకరకాల విషయాలలో ప్రచారానికి ‘యమరాజ్’ వేషం పాపులర్ థీమ్‌గా మారింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన పోలిస్ కానిస్టేబుల్ జవహర్‌సింగ్ కోవిడ్–19 వ్యాక్సిన్ గురించి ప్రచారం కోసం యముడి వేషం వేశాడు. వ్యాక్సిన్‌పై రకరకాల అపోహలు, భయాలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రచారం ప్రారంభించాడు. యముడి వేషంలోనే వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఈ వేషం ధరించడం జవహర్‌సింగ్‌కు కొత్తేమీ కాదు. సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాలలో యమ సీరియన్‌గా, యమ కమిట్‌మెంట్‌తో ప్రచారం చేశాడు. సెహబాష్ సింగ్‌జీ!