Delta Plus Variant Covid: First Death Regsitered In Madhya Pradesh - Sakshi
Sakshi News home page

దేశంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తొలి మరణం నమోదు

Published Thu, Jun 24 2021 10:20 AM | Last Updated on Thu, Jun 24 2021 11:31 AM

Madhya Pradesh Records First Death From Delta Plus Variant of Covid - Sakshi

భోపాల్‌: కరోనా మహమ్మారి రోజురోజుకు రూపం మార్చుకుంటూ మరింత శక్తివంతంగా తయారవతుంది. తాజాగా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమయ్యింది. ఇది మిగతా వాటికన్న చాలా రేట్లు ప్రమాదకరం అని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదయ్యింది. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో డెల్టా ప్లస్ వేరియంట్‌ సోకి బుధవారం ఒక మహిళ మృతి చేందారు. 

మృతురాలి నుంచి తీసుకున్న నమూనాల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఆధారంగా సదరు మహిళ కరోనా వైరస్‌ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వల్లనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సదరు మహిళ ఈ ఏడాది మే 23న డెల్టా వేరియంట్‌ బారిన పడినట్లు తెలిపారు. బాధితురాలి కంటే ముందు ఆమె భర్తకు కోవిడ్‌ సోకిందని.. కానీ అతడు అప్పటికే వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఫలితంగా అతడు కోలుకున్నాడన్నారు. కానీ బాధితురాలు మాత్రం వ్యాక్సిన్‌ ఒక్క డోసు కూడా తీసుకోలేదని.. అందువల్లే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం 5 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు వెలుగు చూశాయి. వీటిలో మూడు భోపాల్‌ నుంచి కాగా రెండు ఉజ్జయిని నుంచి. ఈ ఐదుగురిలో వ్యాక్సిన్‌ వేయించుకున్న నలుగురు డెల్టా ప్లస్‌వేరియంట్‌ను జయించగా.. వ్యాక్సిన్‌ తీసుకొని మహిళ మృతి చెందారు. మహమ్మారి రూపం మార్చుకుని శక్తివంతంగా తయారవుతుంది. ఈ క్రమంలో కోవిడ్‌ బారిన పడినా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలంటే టీకా వేయించుకోవడం తప్పనిసరి. కనుక ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 21 డెల్టా ప్లస్ కేసులు బయటపడటంతో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమయ్యింది.

చదవండి: కణితి అని భావిస్తే.. వైట్‌ ఫంగస్‌గా తేలింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement